For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా ? అయితే డేంజర్ లో పడ్డట్టే

By Nutheti
|

చాలా కాలంగా వింటూనే ఉన్నాం..రోజులో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనదని. ప్రతి ఒక్కరూ తప్పకుండా అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కానీ ఎంత మంది ఈ నియమాన్ని పాటిస్తున్నారు ? చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సన్నగా అవడానికి బ్రేక్ ఫాస్ట్ మానేయడానికే చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

READ MORE: మీరు నివారించాల్సిన టాప్ 9 బ్రేక్ ఫాస్ట్ మిస్టేక్స్

కానీ అలా బ్రేక్ ఫాస్ట్ మానేయడం అస్సలు మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి భోజనం తర్వాత శరీరానికి దాదాపు 12 గంటల తర్వాత అల్పాహారం ద్వారా ఆహారం అందిస్తాం. కాబట్టి ఇది కంపల్సరీ తీసుకోవాలి. అయితే చాలా మంది ఫిట్ నెస్ మాయలో పడి అల్పాహారం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా టిఫిన్ తినడం మానేయడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల కలిగే హాని ఏంటో తెలుసుకుందాం..

గుండెకు మంచిది కాదు

గుండెకు మంచిది కాదు

బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వాళ్లతో పోల్చితే.. బ్రేక్ ఫాస్ట్ మానేసే వాళ్లకు హార్ట్ ఎటాక్ రావడానికి 27 శాతం ఎక్కువ అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ నుంచి బయటపడవచ్చు. టిఫిన్ తినకపోవడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ కూడా ఉంది.

టైప్ 2 డయాబెటీస్

టైప్ 2 డయాబెటీస్

ఆరోగ్యానికి, ఆహారపు అలవాట్లకు చాలా దగ్గర సంబంధం ఉందని.. హార్వర్డ్ యూనివర్సిడీ స్టడీలో తేలింది. బ్రేక్ ఫాస్ట్ తినకుండా మానేసే మహిళల్లో టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

అలాగే బ్రేక్ ఫాస్ట్ మానేసే వర్కింగ్ ఉమెన్స్ కి డయాబెటీస్ రావడానికి 54 శాతం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.

బరువు పెరగడానికి

బరువు పెరగడానికి

బరువు తగ్గాలని ఉదయాన్నే అల్పాహారం మానేస్తున్నారా ? ఇలా చేయడం వల్ల నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అల్పాహారం మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు.. బరువు పెరగడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎలా అంటే.. ఆకలిగా ఉండటం వల్ల ఫ్యాట్ ఫుడ్, చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. అలాగే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తింటారు. దీనివల్ల ఈజీగా బరువు పెరుగుతారు.

ఎనర్జీ లెవెల్స్

ఎనర్జీ లెవెల్స్

బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఎనర్జీ, మూడ్ పైన కూడా దుష్ర్పభావం పడుతుంది. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి.. అలాగే మెమరీపైనా ప్రభావం చూపుతుంది.

క్యాన్సర్

క్యాన్సర్

బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఒబేసిటీకి అవకాశాలున్నాయి. అధ్యయనాల ప్రకారం ఎవరైతే ఒబేసిటీ, అధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

మైగ్రేన్

మైగ్రేన్

బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటాన్ని హైపోగ్లికోమియా అని పిలుస్తారు. బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయడం వల్ల గ్లోకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే రక్తపోటు పెరగడానికి అవకాశాలున్నాయి. అంతేకాదు.. మైగ్రేన్, తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

జుట్టు రాలడానికి

జుట్టు రాలడానికి

బ్రేక్ ఫాస్ట్ ప్రతి రోజు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం. నిత్యం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మీకు ఒత్తైన, పొడవాటి జుట్టు కావాలి అంటే.. ప్రొటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ రోజు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

జీవక్రియ

జీవక్రియ

12 గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల జీవక్రియ సజావుగా సాగుతుంది. క్రమం తప్పకుండా ఎవరైతే బ్రేక్ ఫాస్ట్ చేస్తారో వాళ్లకు జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

8 Harmful Effects Of Skipping Breakfast

You all would have heard the century old adage that says breakfast is the most important meal of the day. But how many of you follow this? In an attempt to cut down the net calorie intake and fulfilling our dream goal of being slim, a major proportion of us has a tendency to skip breakfast.
Story first published: Wednesday, December 9, 2015, 17:19 [IST]
Desktop Bottom Promotion