For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీర్ఘకాలిక వ్యాధులకు ఆందోళన కారణమా ?

By Nutheti
|

శారీరక అనారోగ్య సమస్యలకు మెడిసిన్స్ ఉన్నాయి. కానీ మానసిక ఆందోళన తగ్గించుకోవాలంటే ఎలాంటి మందులు లేవు. కేవలం ప్రశాంతత, ఓర్పు ఉన్నప్పుడు ప్రశాంతత పొందగలరు. అసలు ఎందుకు ఆందోళనకు గురవుతారు ? అంటే కారణాలు లేవు. ఒక్కొక్కరిలో ఒక్కో కారణం ఉంటుంది. తమకు ఇష్టమైన వాళ్లు సంతోషంగా ఉండాలని కొందరు ఆందోళనపడుతూ ఉంటారు. పని ఒత్తిడి వల్ల మరికొందరు ఆందోళనకు లోనవుతారు. మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆందోళన పడుతుంటారు.

READ MORE: లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ ఆలోచనలకు గుడ్ బై తప్పనిసరి..

అయితే ఆందోళన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆందోళన వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయి. మొదట్లోనే దీన్ని తగ్గించుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

READ MORE: ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించుట కొరకు 17 సహజ నివారణలు

ఆందోళన వల్ల నెగటివ్ థాట్స్ ఎక్కువవుతాయి. కాబట్టి ఆందోళన తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి సరైన పరిష్కారం. అంతేకాదు పాజిటివ్ ఆలోచనల వల్ల ఆందోళన తగ్గుతుంది. అయితే ఆందోళన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఆందోళన కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చూద్దాం.

హృద్రోగ సమస్యలు

హృద్రోగ సమస్యలు

ఆందోళన వల్ల వచ్చే భయంకరమైన అనారోగ్య సమస్య ఇది. ఆందోళన కారణంగానే చాలా వరకు హార్ట్ స్ర్టోక్, హార్ట్ ఎటాక్స్ వస్తాయి.

నిద్రకు ఆటంకం

నిద్రకు ఆటంకం

మానసిక ఆందోళన వల్ల రాత్రివేళల్లో నిద్ర కరువవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతి ఒక్కరు రోజుకి 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ రాత్రిళ్లు ఎక్కువగా మెలుకువ రావడం, సరైన క్రమంలో నిద్రపోవడం లేదు అంటే.. మీ మైండ్ చాలా డిస్టర్బ్ గా ఉందని అర్థం.

దీర్ఘకాలిక వ్యాధులు

దీర్ఘకాలిక వ్యాధులు

డయాబెటీస్, హైబీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆందోళన ప్రధాన కారణం. ఆందోళన వల్ల ఈ వ్యాధుల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

ఫోబియా

ఫోబియా

ఎక్కువ ఆందోళనకు గురయ్యే వాళ్లు మానసిక సమస్యలకు గురవడమే కాదు, ఫోబియా ఫీలవుతూ ఉంటారు. చుట్టూ చాలా మంది ఉన్నా.. ఏదో జరుగుతుందని.. అనవసరంగా నెగటివ్ గా ఆలోచిస్తూ, భయపడుతూ ఆందోళనకు లోనవుతారు.

కండరాల నొప్పులు

కండరాల నొప్పులు

మీరు ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటే.. మీరు తరచుగా భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీర్ణక్రియ సమస్యలు

జీర్ణక్రియ సమస్యలు

ఆందోళన మనసుకి సంబంధించినదే అయినా.. శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ సరిగా జరగకపోవడానికి కొన్ని సందర్భాల్లో ఆందోళన కూడా కారణమవుతుంది. అంతేకాదు ఒక్కోసారి కడుపునొప్పి, గ్యాస్, కాన్ట్సిపేషన్, డైయేరియా వంటి సమస్యలు కూడా వేధిస్తాయి.

కంపల్సివ్ డిజార్డర్

కంపల్సివ్ డిజార్డర్

కంపల్సివ్ ఆటిట్యూడ్ వల్ల మనుషుల్లో ఆందోళన పెరుగుతుందని.. సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు ఆందోళన నుంచి బయటపడటం అంత తేలిక కాదు.

English summary

Disorders That Anxiety Might Lead To in telugu

Physical illnesses can be treated with medicines. But, to calm down an anxious mind, you need to have mental strength and patience. Why does a person get anxious? There is no specific reason for this. The reasons can vary from person to person.
Story first published: Monday, November 23, 2015, 10:59 [IST]
Desktop Bottom Promotion