For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనకు తెలియకుండా బరువును పెంచేసే ఆహారాలేంటో తెలుసా ?

By Nutheti
|

కొన్ని సందర్భాల్లో బరువు తగ్గలేకపోతాం. తక్కువగా ఆహారం తీసుకున్నా.. శారీరకంగా కష్టపడినా, యాక్టివ్ గా ఉన్నా.. అనవసరంగా బరువు పెరిగిపోతుంటాం. ఎన్ని రకాలుగా డైట్ మార్చినా, వ్యాయామాలు చేసినా బరువు మాత్రం అదుపులో ఉంచుకోలేకపోతుంటారు. అయితే ఇప్పుడు ఇక ఆ బెంగ అవసరం లేదు. ఎందుకంటే అనవసరంగా ఎందుకు బరువు పెరగడానికి కారణాలేంటో రిలీవ్ అయ్యాయి.

READ MORE: ఆరోగ్యంగా బరువు పెరగడానికి 20 ఉత్తమ మార్గాలు

మనం తరచుగా తీసుకునే ఆహారాలే బరువు పెరగడానికి, కడుపులో మంటకి, శరీరంలో వాపుకి, గుండె సమస్యలకు, మధుమేహానికి, అలర్జీలకు, క్యాన్సర్ కి కారణమవుతున్నాయి. ఇన్ల్ఫమేషన్ చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. వాపులకు కారణమయ్యే ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండటం మంచిది.

పెళ్ళి తర్వత బరువు పెరుగకుండా ఎలాంటి నియమాలు పాటించాలి ? పెళ్ళి తర్వత బరువు పెరుగకుండా ఎలాంటి నియమాలు పాటించాలి ?

నిత్యం తీసుకునే ఆహారాలే బరువు పెరగడానికి, అలర్జీ, వాపులకు కారణమవుతున్నాయి. కాబట్టి అలాంటి ఆహారాలేంటో తెలుసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని, బరువు పెరగడాన్ని మన కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఇంతకీ అలాంటి ఆహారాలేంటో ఒకసారి చూద్దాం..

వంట నూనెలు

వంట నూనెలు

చాలావరకు వంటకు ఉపయోగించే ఆయిల్స్ లో ఎక్కువ మోతాదులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, తక్కువ మోతాదులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఇంబ్యాలెన్స్ కారణంగా తీసుకునే ఆహారం ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతోంది. ఫ్యాటీ యాసిడ్స్ సమానంగా ఉండే ఆయిల్స్ అయిన ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించడం వల్ల బరువు పెరగడాన్ని, ఇన్ల్ఫమేషన్ ని అదుపుచేయవచ్చు.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

60 శాతం మందికి పాలు పడవు. ఇవి అలర్జీ క్రియేట్ చేస్తాయి. ఇవి జీర్ణమవడానికి కష్టంగా మారుతోంది. పాలంటే ఎవరికైతే అలర్జీ ఉంటుందో వాళ్లు ఇవి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్, డైయేరియా, చర్మంపై దద్దుర్లు, పొట్టలో సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి.

ఫ్యాట్స్

ఫ్యాట్స్

కొవ్వు ఆమ్లాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొలెస్ర్టాల్ పెరుగుతుంది. అలాగే బరువు పెరగడానికి, మధుమేహం రావడానికి, వాపు సమస్యలు రావడానికి, బీపీ పెరగడానికి కారణమవుతాయి. ఈ ఫ్యాట్స్ డీప్ ఫ్రై ఫుడ్స్ లోనూ, ఫాస్ట్ ఫుడ్స్ లోనూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.

ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్

ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్

రెడ్ మీట్ లో ఇన్ఫ్లమేటరీకి కారణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుట్ వల్ల హార్ట్ డిసీజ్ లు రావడానికి అవకాశముంది. అలాగే క్యాన్సర్ కి ఇది కారణమవుతుంది. అలాగే బరువు పెరగడానికి కారణమయ్యే ఆహారాల్లో ఇది కూడా ఒకటి.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల ఆహారనాళంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే బాడీలో వాపులు ఏర్పడటానికి కారణమవుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్ కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు, లివర్ డ్యామేజ్ కి కూడా అవకాశముంది.

చక్కెర

చక్కెర

మోతాదుకు మించి చక్కెర తీసుకోవడం వల్ల మధుమేహం, పంటి సమస్యలు, ఒబేసిటీకి కారణమవుతాయి. సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ లు, పేస్ర్టీలు, కేక్స్, క్యాండీస్ వంటి వాటి ద్వారా చక్కెర ఎక్కువ మోతాదులో శరీరానికి అందుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

మైదా

మైదా

మైదా పిండి సాధారణంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. స్నాక్స్ రూపంలో మైదా ఎక్కువగా వాడుతాం. అయితే ఇందులో ఫైబర్స్, విటమిన్ బి కాంప్లెక్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి, మధుమేహానికి, క్యాన్సర్ కి కారణమవుతాయి. కాబట్టి వైట్ బ్రెడ్, పాస్తా, బిస్కెట్స్, పేస్ర్టీలు తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది.

English summary

Foods That Silently Cause Inflammation & Weight Gain: Foods that causes Weight gain

Sometimes, we wonder why we are unable to reduce weight, despite of eating less and being physically active. Skipping the main meals and still finding an abdominal bulge can really disappoint many.
Story first published: Wednesday, December 9, 2015, 10:14 [IST]
Desktop Bottom Promotion