For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన శనగలతో పొందే వండర్ హెల్త్ ఫుల్ బెన్ఫిట్స్

By Nutheti
|

శనగలు.. సంప్రదాయానికి, పూజలకు పెట్టింది పేరు. ఏ ఆలయంలోనైనా.. ఏ ఇంట్లోనైనా ప్రత్యేక పూజలు చేశారంటే శనగలు ప్రసాదంగా, నైవేద్యంగా సమర్పిస్తారు. ఉడికించి నైవేద్యంగా సమర్పించే ఈ శనగలంటే ఇష్టపడని వారుండరు. అంతేకాదు సాయంకాలం స్నాక్స్ రూపంలో ఇస్తే పిల్లలు గంతులేస్తూ తినేస్తారు.

ఉడికించుకుని తీసుకున్నా, కూర్మాలో వేసుకున్నా.. ఫ్రై రూపంలో తీసుకున్నా.. సలాడ్ రూపంలో లాగించినా.. శనగల రుచే వేరు. అంతేకాదు మొలకెత్తిన శనగలతో గారెలు వేసుకున్నా భలే రుచికరంగా ఉంటాయి. ఇవి రుచినే కాదు.. ఎన్నో పోషక విలువలను కలిగి ఉన్నాయి.

శనగల్లో మెగ్నీషియం, థయామిన్, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటితో పాటు పీచు, ఫైథో నూట్రియంట్స్ కలిగి ఉన్నాయి. బెంగాల్‌గ్రామ్‌గా పిలవబడే ఈ శనగలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయి.

శనగలు

శనగలు

వంద గ్రాముల శనగలలో 61.2 శాతం పిండిపదార్ధాలు, 5.3 శాతం కొవ్వు, 17.1 శాతం మాంసకృత్తులు, 190 మిల్లీగ్రాముల కాల్షియం, 168 గ్రాముల మెగ్నీషియం, 9.8 శాతం ఇనుము, 71 మిల్లీగ్రాముల సోడియం, 322 మి.గ్రా.పొటాషియం, 3.9 మి.గ్రా పీచుపదార్ధం, 361 కేలరీలు ఉంటాయి.

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి

శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడానికి సహాయపడతాయి.

మధుమేహానికి

మధుమేహానికి

మధుమేహం ఉన్నవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే రక్తంలో తగినంత గ్లూకోజ్, చక్కర స్థాయిలని అదుపులో ఉంచటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ఉండే పీచు చక్కెరను నియంత్రిస్తుంది.

క్యాన్సర్

క్యాన్సర్

శనగల్లో ఉండే పైథో న్యూట్రియంట్స్, ఆస్టియో ఫ్లోరోసిస్ తో పోరాడతాయి. అంతేకాకుండా క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.

రక్తహీనత

రక్తహీనత

శనగలు స్ర్తీలకు చాలా అవసరం. ఇందులో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఇనుము అందుతుంది. దీనివల్ల రక్త హీనతకు దూరంగా ఉండవచ్చు.

రక్తపోటు

రక్తపోటు

రక్తపోటు తో బాధపడే వాళ్లు రెగ్యులర్ డైట్ లో శనగలు చేర్చుకోవడం మంచిది. ఇవి రక్త పోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

జీర్ణవ్యవస్థ పనితీరుకు

జీర్ణవ్యవస్థ పనితీరుకు

నానబెట్టి మొలకలు వచ్చిన శనగలలో పీచుపదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఏ వయస్సు వారు శనగలు తీసుకున్నా.. త్వరగా అరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

సహజ ప్రయోజనాలు పొందాలంటే.. శనగలు డైట్ లో చేర్చుకోవాలి. శనగల్లో గుండెకు అధిక బలం చేకూర్చే గుణం ఉంది. అంతేకాదు ఇవి గుండెకు రక్తం సక్రమంగా సరఫరా అవటానికి కూడా తోడ్పడతాయి.

కొలెస్ర్టాల్ తగ్గించడానికి

కొలెస్ర్టాల్ తగ్గించడానికి

శనగల్లో ఫ్యాట్ కరిగించే గుణం కూడా మెండుగా ఉంది. వీటిల్లో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ర్టాల్ ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

పోషక విలువలు

పోషక విలువలు

శనగలను నానబెట్టి ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మంచి ప్రొటీన్లుగా ఉపయోగపడతాయి.

చర్మ సంరక్షణకు

చర్మ సంరక్షణకు

శనగలు చర్మ సంరక్షణలో పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. ఇవి యాక్నే, పింపుల్స్, ఎగ్జిమా, డెమ్మటైటిస్ వంటి రకరకాల సమస్యలను మాయం చేస్తాయి. శనగ పిండికి పాలు కలిపి ముఖానికి అప్లై చేస్తే ఎలాంటి చర్మ సమస్య అయినా దూరమవుతుంది.

ఎనర్జీ బూస్టర్

ఎనర్జీ బూస్టర్

శరీరం మొత్తానికి బలాన్ని ఇవ్వడానికి శనగలు సహాయపడతాయి. ఇందులో పుష్కలంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. శనగల్లో ఉండే ఎమినో యాసిడ్స్ బ్లడ్ సెల్స్ పనితీరుకి సహాయపడతాయి.

రుతుక్రమం సమయంలో నొప్పి

రుతుక్రమం సమయంలో నొప్పి

రుతుక్రమం సమయంలో స్ర్తీలకు వచ్చే కడుపు నొప్పి వంటి సమస్యలకు మంచి పరిష్కారం ఇది. ఈ శనగల కొమ్మను తీసుకుని వేడి నీళ్లలో వేసి స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

Great Health Benefits of Bengal Gram or Chana

Chana dal or Bengal gram dal is one of the richest vegan source of dietary proteins. It is also rich in trace minerals like copper, manganese etc. Having this dal helps keep diabetes at bay.
Desktop Bottom Promotion