For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బార్లీ గంజి: ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది

|

బార్లీ గింజలు పేరు వినే ఉంటారు. మన చిన్నప్పుడు అమ్మ లేదా అమ్మమ్మో జ్వరం వచ్చినప్పుడు బార్లీ గంజి ఇచ్చే వారు. ఎందుకంటే ఇది శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు తగిన శక్తిని అందిస్తుంది. అయితే బార్లీ గింజలంటే ఈ తరం వారికి చాలామందికి తెలిసే అవకాశం లేదు. అందువల్ల వాటి ప్రయోజనాలూ చాలా మందికి తెలియదనే చెప్పుకోవాలి.

ఈ చిరు ధాన్యంలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, జింక్, కాపర్, ప్రోటీన్, అమినో యాసిడ్స్, డైటరీ ఫ్రైబర్, బీటా గ్లూకాన్స్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

చిరుధాన్యంగా పిలుచుకొనే బార్లీ గింజలతో తయారుచేసే గంజిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో, లివర్ ను శుభ్రం చేసి, టాక్సిన్ ను బయటకు నెట్టివేయడంలో, వేసవిలో శరీరంకు అవసరం అయ్యే పోషకాలను అందివ్వడం మరియు శరీరాన్ని చల్లబరుచడంలో బార్లీ గింజలు అద్భుతంగా తోడ్పడతాయి.

బార్లీ నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తే.. ఆ గింజలు అందాన్ని పెంచుతాయి. బార్లీ వాటర్ కు కొద్దిగా నిమ్మరసం చేర్చి తీసుకోవడం, మరియు సలాడ్స్ మరియు ఉడికించిన వెజిటేబుల్స్ లో బార్లి గార్నిష్ చేసి తీసుకుంటో ఆరోగ్యానికి చాలా మేలు జరగుతుంది.

బార్లీ వాటర్, సలాడ్స్ ఇలా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా...

1. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్:

1. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్:

బార్లీ వాటర్ త్రాగడం వల్ల యూటీఐ ఇన్ఫెక్షన్ నివారించుకోవచ్చు . ఇది ఒన నేచురల్ డ్యూరియాటిక్ కాబట్టి, యూరినరీ ట్రాక్ లోని టాక్సిన్ ను బయటకు నెట్టివేస్తుంది.

2. బరువు తగ్గిస్తుంది:

2. బరువు తగ్గిస్తుంది:

బార్లీ వాటర్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ముఖ్యంగా బీటా గ్లూకాన్ అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి అనిపించదు మరియు మీకు ఇతర ఆహారాల మీద మనస్సు పోదు కాబట్టి, బరువును క్రమంగా తగ్గించుకోవచ్చు.

3. కొలెస్ట్రాల్:

3. కొలెస్ట్రాల్:

లెమన్ బార్లీ వాటర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా మంచిది ఇందులో కరగని ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఉదయంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది హై కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి చాలా ప్రయోజనం.

4.హార్ట్ కు మంచిది:

4.హార్ట్ కు మంచిది:

బార్లీ వాటర్ హార్ట్ హెల్తీ ఫుడ్ మరియు అథిలోక్లియరోసిస్ ను నివారించి రక్తం ప్రసరించే రక్తకణాల గోడలు మందగా మార్చుతుంది. బార్లీ వాటర్ త్రాగుతుంటే, కార్డియో వాస్కులర్ వ్యాధులు ధరిచేరదు.

5. డయాబెటిస్:

5. డయాబెటిస్:

బార్లీ వాటర్ వల్ల మరో సాధారణ జబ్బు, డయాబెటిస్ నివారించబడుతుంది. బార్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

6. బాడీ హీట్ తగ్గిస్తుంది:

6. బాడీ హీట్ తగ్గిస్తుంది:

వేసవి సీజన్ లో బార్లీ వాటర్ ను తప్పనిసరిగా తీసుకోవాలి . త్రాగడం వల్ల క్రమంగా బాడీ హీట్ ను తగ్గిస్తుంది . లెమన్ బార్లీ వాటర్ ను తీసుకోవడం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది.

7. లివర్ ఆరోగ్యం:

7. లివర్ ఆరోగ్యం:

బార్లీ వాటర్ కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు డయాలసిస్ చేయించుకుంటున్నట్లైతే మీలో వ్యాధినిరోధకత పెంచుతంది అవయవాలు చురుగా ఉంచి జీవక్రియల పని వేగవంతంగా చేస్తుంది.

8. వ్యాధినిరోధకపెంచుతుంది:

8. వ్యాధినిరోధకపెంచుతుంది:

బార్లీ వాటర్ లో ఉండే బీటా గ్లూకాన్ ను వ్యాధినిరోధక శక్తి పెంచి ఎనర్జీని అందిస్తుంది. వేసవి సీజన్ లో వచ్చే కామన్ కోల్డ్, ముఖ్యంగా సమ్మర్ కోల్డ్ ను తగ్గిస్తుంది.

9. హార్మోన్ చికిత్స:

9. హార్మోన్ చికిత్స:

హార్మోన్లకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నవారు బార్లీ నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. అజీర్తి, కడుపు మంట, తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుండే వారికి బార్లీ నీరు మంచి ఫలితాలనిస్తుంది.

10. జ్వరం:

10. జ్వరం:

వాపులతో కూడిన జ్వరాల్లో బార్లీని ఆహారౌషధంగా వాడవచ్చు. చిన్న పిల్లలకు బార్లీని పాలతోగాని లేదా పండ్ల రసంతో గాని కలిపి ఇవ్వవచ్చు. జ్వరంలో నీరసం ఉంటే బార్లీ కషాయానికి గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది.

11. తల్లిపాలు పెరగటంకోసం:

11. తల్లిపాలు పెరగటంకోసం:

బాలింతల్లో తల్లిపాలు తక్కువగా పడితే బార్లీని పాలతో కలిపి తీసుకుంటే హితకరంగా ఉంటుంది.

English summary

Health Benefits Of Barley Water

There are a lot of healthy grains that you can consume to stay healthy. Barley is one of those versatile grains which should be included in your diet. This little grain contains vitamin B-complex, iron, calcium, magnesium, manganese, selenium, zinc, copper, protein, amino acids, dietary fiber, beta-glucans and various antioxidants.
Story first published: Thursday, April 23, 2015, 15:17 [IST]
Desktop Bottom Promotion