For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుదీన ఆకుతో మేలైన ఆరోగ్య ప్రయోజనాలు

By Nutheti
|

ఘాటైన సువాసనతో పాటు.. కమ్మని రుచితో నోరూరించే పుదినలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. రుచితో పాటు ఔషధ గుణాలున్న పుదినా ఆకును డైట్ లో చేర్చుకుంటే.. రకరకాల సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు.

పోషకాలు పుష్కలంగా ఉన్న పుదిన ఆకు క్రిములను నాశనం చేస్తుంది. మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది. పుదినా ఆకును నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది.

పుదినలో పుష్కలంగా పోషకాలు

పుదినలో పుష్కలంగా పోషకాలు

పుదిన ఆకుల్లో సుమారు 5 వేల 480 మైక్రో గ్రాముల విటమిన్లు జిటా కెరోటిన్‌ రూపంలో వెలువడుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పుదినా ఆకుల్లో ఉండే ఖనిజ లవణాలు.. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్‌ సీ ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు. మాంసకృత్తులను సులభంగా జీర్ణం చేసేందుకు పుదినా ఆకు దోహదపడుతుంది.

పొట్టనొప్పికి

పొట్టనొప్పికి

పుదిన ఆకు పొట్టనొప్పిని పారద్రోలి.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదిన ఆకులను టీలో ఉడకపెట్టి తాగితే.. జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. కడుపునొప్పితో బాధపడుతున్న వారు మరిగించిన పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

మలబద్ధకం

మలబద్ధకం

పుదిన టీ తాగితే.. మలబద్ధకం మాయమవుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపి.. పొట్టను శుభ్రపరుస్తుంది.

చర్మ సమస్యలకు

చర్మ సమస్యలకు

చర్మానికి చల్లదనంతోపాటు.. చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పుదీనా శరీర రక్తాన్నిశుభ్రపరుస్తుంది. మొటిమలను నివారించే గుణం కూడా పుదిన ఆకుల్లో ఉంది.

నోటి సమస్యలకు

నోటి సమస్యలకు

పుదీనా ఆకులను నీటిలో కలిపి పుక్కిలించి ఉమ్మితే నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టి పడటమే కాదు.. చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ దూరమవుతాయి. పుదీనా ఆకులను పేస్ట్‌ చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. వేడివేడి పుదీనా టీ తాగితే గొంతులో ఇబ్బందిపెట్టే ఇన్‌ఫెక్షన్‌ ఇట్టే తగ్గిపోతుంది.

చిన్న పిల్లలకి

చిన్న పిల్లలకి

పుదీనా ఆకుల రసాన్ని రోజూ రెండు స్పూన్లు తేనెలో కలిపి పిల్లలకు ఇస్తే కడుపులో నులి పురుగులు చనిపోతాయి. పిల్లలకు జలుబు చేసినప్పుడు పుదినా ఆకులతో తయారుచేసే మెంథాల్ కు కర్పూరం, కొబ్బరి నూనెలను చేర్చి మిశ్రమం చేసుకోవాలి. దీన్ని పిల్లల ఛాతీకి, వీపు భాగంలోనూ మర్ధనా చేస్తే జలుపు నుంచి ఉపశమనం పొందవచ్చు.

కీళ్ల నొప్పులు, షుగర్ వ్యాధికి

కీళ్ల నొప్పులు, షుగర్ వ్యాధికి

కీళ్ళ నొప్పులతో బాధపడేవాళ్లు ఎన్ని మందులు తీసుకున్నా ఉపశమనం ఉండదు. అలాంటి వాళ్లు తమ డైట్ లో పుదినా ఆకులను చేర్చుకుంటే.. కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ గా ఉంటుంది. అలాగే షుగర్‌ తో బాధపడేవాళ్లు పుదీనా ఆకులను ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది.

English summary

Health Benefits Of Mint Leaves: health tips in telugu

Mint has one of the highest antioxidant capacities of any food. Learning how to use fresh herbs and spices like mint when cooking can also help to cut down on sodium intake.
Desktop Bottom Promotion