For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాఖాహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

|

2015 శాఖాహార దినోత్సవాన్ని కొత్తగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ రోజు మాత్రమే కాదు.. ఈ నెలంతా.. వెజిటేరియన్స్ గా మారిపోండి. అలా అంటే కష్టమని ఫీలవుతున్నారా ? అయితే వెజిటేరియన్ గా ఎందుగా మారాలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి.

ప్రస్తుత టెక్నికల్ యుగంలో.. ఆరోగ్యంగా ఉన్నవాళ్ల సంఖ్య చాలా తగ్గిపోయింది. యుక్తవయసులోనే రకరకాల అనారోగ్య సమస్యలతో అనేకమంది బాధపడుతున్నారు. హెల్తీ లైఫ్ సొంతం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆరోగ్యంగా జీవించాలంటే.. శాఖాహారమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

శాఖాహారులకు కాన్సర్ వంటి భయంకర వ్యాధులు దూరంగా ఉంటాయని మీకు తెలుసా ? నిజమే.. శాఖాహారుల్లో 90 శాతం మందికి ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు
చాలా తక్కువట. మాంసాహారులతో పోల్చితే.. శాఖాహారులు చాలా ఆరోగ్యంగా ఉంటారట. వెజిటేరియన్ ఫుడ్ లో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల.. అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం చాలా తక్కువ. వరల్డ్ వెజిటేరియన్ డే స్పెషల్ గా.. శాఖాహారం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం...

క్యాన్సర్ కు చెక్

క్యాన్సర్ కు చెక్

ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి కూరగాయల్లోనే ఉంది. శాఖాహారుల్లో క్యాన్సర్ రావడానికి అవకాశాలు చాలా తక్కువ. వెజిటేరియన్ గా మారితే.. ముందుగా మీకు కలిగే.. పెద్ద ఆరోగ్య సంపద ఇది. కాబట్టి కనీసం ఈ అక్టోబర్ నెలంతా వెజిటేరియన్లుగా మారిపోండి.

ఎక్కువకాలం జీవించవచ్చు

ఎక్కువకాలం జీవించవచ్చు

ఎవరైతే శాఖాహారులుగా ఉంటారో వాళ్లు ఖచ్చితంగా ఎక్కువకాలం సంతోషంగా బతుకుతారు. ఎందుకంటే.. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి.. ఎక్కువకాలం జీవిస్తారు.

సెక్స్ లైఫ్

సెక్స్ లైఫ్

వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్లకు సెక్స్ లైఫ్ బావుంటుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

మాంసాహారం తినేవాళ్లకంటే.. శాఖాహారులు స్లిమ్ గా ఉంటారని ఎప్పుడైనా గ్రహించారా ? నిజమే.. వెజిటేరియన్ ఫుడ్ లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందుకే.. వెజిటేరియన్ కు అలవాటు పడితే.. బరువు కూడా తగ్గిపోయి.. స్లిమ్ గా కనిపిస్తారు.

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యం

కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తప్రసరణ సరిగా జరిగి.. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కూరగాయల్లో ఐరన్, పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చు.

బీపీ కంట్రోల్

బీపీ కంట్రోల్

శాఖాహారం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ గా ఉంటుంది. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తపోటు అదుపులో ఉంటుంది.

మధుమేహం

మధుమేహం

వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మధుమేహం రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

ఆరోగ్యానికి మంచిది

ఆరోగ్యానికి మంచిది

సింపుల్ గా చెప్పాలంటే.. శాఖాహారం ఆరోగ్యానికి మంచిది. గుండె, ఊపిరితిత్తులు వంటి అన్ని అవయవాల పనితీరు సక్రమంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం మంచిది.

పోషకాలు

పోషకాలు

కూరగాయల్లో ఎక్కువ మోతాదులో పోషకాలుంటాయి. నాన్ వెజ్ తో పోల్చితే.. ఇందులో ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇన్ని ఆరోగ్య సూత్రాలు చెబుతున్న వెజిటేరియన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు కదూ. అందుకే.. ఈ అక్టోబర్ నెలంతా.. మీరు వెజిటేరియన్లుగా మారిపోయి ఆరోగ్యంగా జీవించండి.. గుడ్ లక్..

English summary

Healthy Reasons To Go Veg This October : health tips in telugu

Did you know that 90 percent of those who are vegetarians don't end up with cancer and other harmful diseases. Vegetarians are also healthier than non-vegetarians and guess what, when you turn veg there are a whole lot of food items which will provide you with a good amount of proteins.
Desktop Bottom Promotion