For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవికాలంలో ఒంట్లో వేడి తగ్గించే సులభమైన చిట్కాలు...

|

ఎండాకాలం వచ్చిందంటే చాలు. వేడికి తటుకోలేక మనకు వడ దెబ్బ తగులుతుంది. పసివాళ్ళు, ముసలివాళ్ళు, తాగుబోతులు దీనికి గురవుతారు. కొందరు చచ్చి పోతారు కూడా. మన శరీరంలో చాలా నీరుంటుంది, ఇది చెమటగా ఎండాకాలం బయటకు పోతుంది. కాబట్టి ఒంటిలో నీరు తగ్గి పోతుంది. చెమటతో పాటు ఉప్పు కూడా పోతుంది. అందుచేత శరీరంలో వేడి పెరుగుతుంది. ఒళ్ళు పట్టుకుంటే కాలి పోతుంటుంది. తెలివి తప్పి పడిపోతాం. దీనినే వడ దెబ్బ అంటారు.

సాధారణంగా ప్రతి వ్యక్తికి బాడీ(శరీరం)యొక్క ఉష్ణోగ్రత 98.6డిగ్రీలకు కొంచెం ఇటుఅటుగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వాతావరణంలో మార్పుల వల్ల కూడా సంభవిస్తుంది. శరీర ఉష్ణోగ్రత పడిపోవడం లేదా తగ్గడం లేదా పెరగడం వల్ల పలు ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి మన శరీర ఉష్ణోగ్రతను నిలకడాగా ఉంచుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుత రోజుల్లో బాడీ హీట్ చాలా మంది ఉన్న కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ . బాడీ హీట్(శరీరంలో ఉష్ణోగ్రత)వల్ల కూడా హీట్ స్ట్రెస్ కు కారణం కావచ్చు . బాడీహీట్ దానంతట అదే తగ్గదు ఎందుకంటే శరీరంలోపల అనేక ఆరోగ్య సమస్యలు, ఉదా : అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, మైకం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడి కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాడం ఇవన్నీ కూడా బాడీ హీట్ కు ప్రధాన కారణాలు.

READ MORE: బాడీ హీట్ ను మాయం చేసే హెల్తీ పుడ్స్.!

వేసవి కాంలో వడదెబ్బను తట్టుకోవడానికి శరీరంలోని వేడి తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీలున్నాయి. ఇవి శరీరంలోని వేడిని నేచురల్ గా తగ్గిస్తాయి. శరీరంలో వేడి తగ్గించుకోవడానికి ఒక సాధారణ పానీయం నీళ్ళు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది.

READ MORE: వేసవిలో చెమట-వివిధ చర్మ సమస్యలకు: పరిష్కార మార్గం

అదేవిధంగా నీరు ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి . జ్యూసుల రూపంలో తీసుకోవాలి. ఇలా తీసుకొన్నప్పుడు శరీరంలో వేడిని కంట్రోల్ చేయవచ్చు. అలాంటి ఆహారాల్లో పుచ్చకాయ కూడా ఒకటి. ఇవి మాత్రమే కాదు, వేసవికాలంలో మన ఒంట్లో వేడి తగ్గించడానికి మార్కెట్లో వివిధ రకాల నేచురల్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల వేసవి వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.

మరి బాడీ హీట్ ను తగ్గించే హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

సాధ్యమైనంత ఎక్కువ నీరు:

సాధ్యమైనంత ఎక్కువ నీరు:

శరీరంలో వేడి తగ్గించడానికి ఎక్కువగా సహాయపడేది నీళ్ళు. వేసవిలో సాధారణంగా తీసుకొనే దానికంటే మరింత ఎక్కువగా తీసుకోవాలి.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతే కాదు వీటిలో వాటర్ కంటెంట్ కూడా అధికమే. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

పెరుగు అన్నం:

పెరుగు అన్నం:

వేసవిలో బాడీ హీట్ ను తగ్గించే మరో ఉత్తమ హోం రెమెడీ పెరుగు అన్నం. ఇది వేసవిలో పెరుగుఅన్నం ఎక్కువగా తీసుకోవాలి. తినే ముందు కొద్దిగా నీళ్ళు మిక్స్ చేస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది.

వెన్న తీసిన మజ్జిగ:

వెన్న తీసిన మజ్జిగ:

వెన్న తీసిన మజ్జిగను ప్రతి రోజూ త్రాగడం వల్ల వేసవి తాపం తీర్చడంతో పాటు శరీరంలో వేడి మటుమాయం అవుతుంది.

బాదం మిల్క్:

బాదం మిల్క్:

ఒక గ్లాసు చల్లటి పాలలో ఒకటి లేదా రెండు చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేసి, ఇంకా బాదం పౌడర్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు .

ఉప్పు తగ్గించాలి:

ఉప్పు తగ్గించాలి:

వేసవికాలంలో ఉప్పు తినడం తగ్గించడం ద్వారా ఒంట్లో వేడిని నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

వేసవిలో వెజిటేరియన్ ఫుడ్స్ మంచిది:

వేసవిలో వెజిటేరియన్ ఫుడ్స్ మంచిది:

వెజిటేరియన్ ఫుడ్స్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే కాదు మాంసాహారాలతో పోల్చితే వెజిటేరియన్ ఫుడ్స్ లో విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి.

యాలకలతో తయారుచేసిన టీ:

యాలకలతో తయారుచేసిన టీ:

మీకు టీ త్రాగాలనిపించినప్పుడు, యాలకలతో తయారుచేసిన టీ తీసుకోవడం వల్ల బాడీ మీట్ ను నేచురల్ గా తగ్గిస్తుంది .

. కీరదోస సలాడ్:

. కీరదోస సలాడ్:

వేసవిలో బాడీ హీట్ ను తగ్గించే వెజిటేబుల్స్ కీరదోస, ముల్లంగి, టమోటోలు. వీటితో తయారుచేసిన సలాడ్స్ తీసుకోవడం ద్వారా ఎనర్జీని అందిస్తాయి . మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది.

షుగర్ వాటర్:

షుగర్ వాటర్:

బాడీ హీట్ ను తగ్గించే వాటిలో షుగర్ వాటర్ కూడా ఒకటి. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా షుగర్ మిక్స్ చేసి, ఖాలీ పొట్టతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్ళు:

బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్ళు త్రాగడం అత్యంత శ్రేయస్కరం. అంతే కాదు సమ్మర్ లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

వేసవిలో అందరూ తాగేది నిమ్మరసం. దీనిలో అధికశాతం 'సి' విటమిన్ వుంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక చెంచాడు నిమ్మరసం పరగడుపున తాగితే పైత్యం తగ్గుతుంది. అరుగుదల కూడా బాగా ఉంటుంది

వాటర్ మెలోన్(పుచ్చకాయ):

వాటర్ మెలోన్(పుచ్చకాయ):

పుచ్చకాయ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో వేడి తగ్గించడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో అధికంగా నీరు ఉండి మిమ్మల్ని చల్లగా మరియు హైడ్రేట్ (శరీరాన్నితేమగా) ఉంచుతుంది.

సీడ్స్ :

సీడ్స్ :

వేసివి కాలంలో కొన్ని చిరుధాన్యాలు బాడీ హీట్ ను తగ్గిస్తాయి. గసగసాలు వంటివి బాడీహీట్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

14 Home Remedies To Reduce Body Heat In Summer

In summer, the body heat generated can make one feel famished. Therefore there are some home remedies for reducing the body heat in natural ways. The common home remedy to reduce the heat in one's body is with the help of water.
Story first published: Saturday, April 11, 2015, 16:55 [IST]
Desktop Bottom Promotion