For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించుకోవడానికి సహజ మార్గాలు

|

ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది యువత తమ శరీర సౌష్టం కోసమని జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సుందరమైన శరీర సౌష్టం పొందడానికి, ఆకర్షణీయంగా కనబడటానికి వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఫలితం కనిపించినా, తర్వాత తర్వాత తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటారు.

దాంతో ఒక్కోక్కో సారి విసిగు చెంది, అసలు డైయట్ చేయడమే మానేస్తారు. కాబట్టి కృత్రిమంగా కాకుండా సహజంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుంది. దాంతో అధిక బరువును తగ్గించుకోవడం ద్వారా సౌందర్యం మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.

READ MORE: వేగంగా బరువు తగ్గాలంటే వెంటనే వీటిని ప్రారంభించండి...

అధిక బరువు పెరిగితే ఒబేసిటి, కొలెస్ట్రాల్, అధిక బ్లడ్ ప్రెజర్ వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం...

వ్యాయామం

వ్యాయామం

వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా దృష్టిపెట్టరు. బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం. అలాంటి కొన్ని వివరాలు ..

వారానికి కనీసం 5-6 రోజులు వ్యాయామం చేయటం తప్పనిసరి. అదీ 30-45 నిమిషాల పాటు వేగంగానూ చేయాలి. ముందు నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవటమూ ముఖ్యమే. దీనివల్ల వ్యాయామం ఆపేసిన తర్వాత కూడా కేలరీలు ఖర్చు అవుతాయి.

నిద్రలేమీ కారణమే

నిద్రలేమీ కారణమే

నిద్రలేమి కూడా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినటానికి, స్థూలకాయానికి దారి తీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడీ బరువు పెరగటానికి కారణమవుతుంది.

ఆరోగ్య సమస్యలతో

ఆరోగ్య సమస్యలతో

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు.. ముఖ్యంగా థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. ఇది బరువు పెరగటానికి బీజం వేస్తుంది. అధిక బరువు గలవారు నిపుణులతో థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే తగు చికిత్స తీసుకోవాలి.

మితాహారం మేలు

మితాహారం మేలు

బరువు తగ్గకపోవటానికి ఎక్కువగా తినటమూ ఒక కారణమే. అందువల్ల మితంగా ఆహారం తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు చేసే పనిని బట్టి శరీరానికి రోజుకు అవసరమైన పోషకాలు, కేలరీల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి.

ఒత్తిడి ముప్పు

ఒత్తిడి ముప్పు

అధిక బరువు, ఒత్తిడి ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నాయని మరవరాదు. నిరంతరం ఒత్తిడితో బాధపడేవారిలో కార్టిజోల్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఇది ఆకలి పెరగటానికే కాదు కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికీ దోహదం చేస్తుంది. రోజులో కొద్దిసేపు విశ్రాంతి పొందేలా చూసుకుంటూ ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.

క్రమం తప్పరాదు

క్రమం తప్పరాదు

వ్యాయామం నుంచి చేసే పని వరకూ ఏదైనా క్రమం తప్పకుండా చూసుకోవాలి. చాలాసార్లు వ్యాయామం చేయటం మానుకుంటే తిరిగి పరిస్థితి మొదటికి చేరుకుంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లటం, ఆటలు ఆడుతూ హాయిగా గడపటం అలవాటు చేసుకోవాలి.

మద్యానికి దూరం

మద్యానికి దూరం

ఏ రకం మద్యంలో నైనా కొవ్వు ఉండదు కానీ కేలరీలు మాత్రం ఉంటాయి. కాబట్టి మద్యం తాగినవెంటనే కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవటం మంచిది. లేకపోతే అవి బరువు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకులు, సోడాలనూ అతిగా తాగరాదు. ఇవి రక్తంలోని చక్కెర మోతాదును కూడా పెంచుతాయి. వీటికి బదులుగా నీళ్లను తాగటం మేలు.

తిండి మానేస్తే చేటు

తిండి మానేస్తే చేటు

బరువు తగ్గటానికి చాలామంది మధ్యమధ్యలో తిండి తినటం మానేస్తుంటారు. దీనివల్ల కీడే ఎక్కువ. ఈ సమయంలో శరీరంలో అమైనో ఆమ్లం మోతాదును నియంత్రించుకోవటానికి కండరాలు క్షీణించటం ఆరంభిస్తాయి. దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, తక్కువ మోతాదులో రోజుకి 5-6 సార్లు తినటం మంచిది. మంచి ప్రోటీన్లు గల అల్పాహారంతో రోజుని

ప్రారంభించటం మేలు.

పోషకమిళితమైన పదార్థాలను

పోషకమిళితమైన పదార్థాలను

అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవడం చాలా సులువనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజూ అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెబుతోందో అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజులో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గానూ ఉండటం వల్ల శరీరానికీ వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలో

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలో

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలోనే ఉందని తేలిగ్గా తీసుకుంటారు కొందరు. కానీ మనసు పెడితే సన్నగా మారడం మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి. తీసుకునే కెలొరీలను గమనించుకుంటూ.. వాటిని ఖర్చుచేసేందుకు సరైన వ్యాయామం చేయాలి. శరీరానికి శక్తినందిస్తూ.. అదేసమయంలో తక్కువ కెలొరీలనిచ్చే పదార్థాలను తీసుకోవడం కూడా సులువుగా బరువు తగ్గగలుగుతాం.

అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు.

అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు.

అతి ఎప్పుడూ అనర్థమే అవుతుంది. సన్నగా మారే క్రమంలో మితిమీరి పాటించే కొన్ని నియమాల వల్ల లాభం కన్నా ఇతర సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమతులాహారానికి ప్రాధాన్యం ఇస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు. రోజులో ఓ గంటన్నరకు మించి వ్యాయామం చేయకూడదు.

పోషకాలందించే ఆహారం

పోషకాలందించే ఆహారం

కొన్ని రకాల ప్రత్యేకమైన పదార్థాలు బరువును తగ్గించేలా చేస్తాయి. మిల్క్‌షేక్‌లు, చాక్లెట్లు, శరీరంలో కొవ్వును పెంచే సూప్‌లకు బదులుగా క్యాబేజీ సూప్‌డైట్‌, గ్రేప్‌ ఫ్రూట్‌డైట్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువకాలం కొనసాగించలేం. ఖరీదెక్కువ కావడం, కోరుకున్న రుచినివ్వకపోవడం వంటి కారణాలతో ఇతర పదార్థాలనూ తీసుకోవడం మొదలుపెడతాం. అందుకే శరీరారనికి అవసరమైన పోషకాలందించే ఆహారాన్ని తీసుకుంటూనే మెరుపుతీగలా మారాలి.

వేళపట్టున భోంచేయాలి

వేళపట్టున భోంచేయాలి

బరువు తగ్గాలనుకునేవారు ముందుగా వేళపట్టున భోంచేయాలి. ప్రతి రెండుగంటలకోసారి కొద్దికొద్దిగా తినాలి. వేళపట్టున నిద్రపోవడం వల్ల కూడా స్థూలకాయం బాధించదని ఓ అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి రాత్రిళ్లు త్వరగా భోంచేసి రెండు గంటల తరవాత నిద్రపోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి.

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది.

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది.

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. త్వరగా జీర్ణమవుతాయి. అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. బాగా నమిలి తినడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, మిఠాయిలను మితంగాతినడం వంటి జాగ్రత్తలను పాటించడం ఎంతయినా మంచిది.

English summary

How to Lose Weight Naturally : Health Tips in Telugu

How to Lose Weight Naturally , seems it's natural to want to lose weight in summer, after all, that's when you want to look your best, right? For some, it is entirely too easy to lose weight, whether it be summer or winter, while others, like me, tend to battle weight gain as a constant enemy.
Story first published: Monday, August 17, 2015, 18:24 [IST]
Desktop Bottom Promotion