For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆందోళను..ఆత్రుత తగ్గించుకోవడానికి నేచురల్ మార్గాలు

By Super
|

మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆందోళన అందరికీ కలుగుతుంది. ఉద్యోగం, పనీపాటా, డబ్బూ, కుటుంబ జీవితం, మానవ సంబంధాలూ, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందొళన కలిగిస్తాయి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ మనిషికి కష్టాలు అనేవి ఉంటూనే వుంటాయి. కష్టాలు వచ్చాయి కదా అని వాటినే తలచుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసు కుంటారు. వాటి గురించే ఆలోచించు కుంటూ ఆందోళనకు గురి అవుతారు. జీవితాన్ని అంధకారమయం చేసుకుంటారు. అందోళన అనేది మనిషికి మానసిక వ్యాధి లాంటిది. మానసిక వ్యాధి మనిషిని బాగా కృంగదీస్తుంది. మనిషికి మనఃశ్శాంతి లేకుండా చేస్తుంది.

READ MORE: ఆందోళన చెందితే మనిషికి ఎంత నష్టం.?

భయము మరియు బాధ ఈ రెండూ కూడా ఆందోళకు ముఖ్య లక్షణాలు. ఆందోళన మనలను ఏపనీ చేయనీయదు. మనసును గాభరా పెట్టేస్తుంది. మనుష్యులను దుఃఖంలోను, విచారంలోను ముంచేస్తుంది. నోరు తడి ఆరిపోతుంది, చెమటలు పట్టడం మరియు గుండె దడ, దీనికి ఆదుర్ధా తోడవుతుంది. పొట్ట కూడా ఆదోళనకు గురిచేస్తుంది. ఏ పనీ చేయనీయదు. మనస్సును కంగారుకు గురిచేస్తుంది. మనసును తొలిచేస్తుంది. అందుకే మనం ఆందోళనలను మరి దరిచేరనీయరాదు. మన కోరికలను అవసరాలను అతిశయోక్తిగా పెంచుకున్నా మనే వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఆందోళన దూరం అవుతుంది.

READ MORE: ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించుట కొరకు 17 సహజ నివారణలు

రైలు ప్రయాణం చేస్తూ త్వరగా చేరాలనే ఆదుర్ధా పడ్డా రైలు త్వరగా వెళ్ళదు. అందువల్ల అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకోవాలి. సమస్యను మనస్సులో పెట్టుకొని ఆలోచిస్తూ ఆందోళన పడిపోకూడదు. ఆందోళన పడిపోవడంవల్ల లాభం ఉండక పోగా సమస్య మరింత జఠిలం అవు తుంది. ఆందోళనలను ఎదుర్కొని జీవించటం అలవాటు చేసుకోవాలి. ఆందోళనలను జయించి జీవించగలిగి నప్పుడే మనం జీవితంలో దేనినైనా సాధించగలుగుతాము. ఆందోళనల చెందకుండా ఉండటానికి కొన్ని నేచులర్ ట్రీట్మెంట్స్ ఈ క్రింది విధంగా ఇవ్వబడ్డాయి....

ఆందోళనలో ఉన్నప్పుడు మీ దైనందిన జీవితాన్ని తొలచివేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మెంటల్ హెల్త్ కేర్ ప్రొఫిషినల్స్ ను కలవాల్సి ఉంటుంది. మీరు చాలా తక్కువగా లేదా చిన్న విషయాలకు ఆందోళన చెందుతుంటే మాత్రం ఈ క్రింది సూచించిన నేచురల్ పద్దతులను అనుసరించాల్సిందే...

How to Treat Anxiety Using Natural Methods: Health Tips in Telugu

1. బ్రీతింగ్ టెక్నిక్
ప్రతి రోజూ 15నిముషాలు మెడిటేషన్ చేయడం వల్ల అది మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఆందోళనకు ఒక నేచురల్ రెమెడీ. ఇది ఆందోళనను తగ్గిస్తుంది మరియు ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రశాంతతను పొందుతారు. శ్వాసను పీల్చి వదలడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీకు సౌకర్యవంతంగా కూర్చొని శ్వాసను గట్టిగా పీల్చి, తర్వాత నిధాణంగా వదలాలి. గాలి మొత్తం మీ ఊపిరితిత్తులను చేరేలా చూడాలి. ఈ బ్రీతింగ్ టెక్కిన్ మిమ్మల్ని ప్రశాతం పరుస్తుంది మరయు ఒత్తిడి తగ్గిస్తుంది.

READ MORE: మొదటి త్రైమాసికంలో ఆమెకు ఆందోళన తగ్గించడానికి కొన్ని చిట్కాలు

2. చామంతి టీ త్రాగాలి
చామంతి టీ ఆందోళను తగ్గించడాినకి సహాయపడుతుంది . చామంతి టీలో ఉండే విశ్రాంతి పొందడానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు మనస్సు విశ్రాంతి పరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఆందోళను క్రమంగా తగ్గుతుంది.

3.ల్యావెండర్ వాసనను పీల్చాలి:
ల్యావెండర్ మనస్సును ప్రశాంత పరుస్తుంది . మరియు ల్యావెండర్ ఆయిల్, రెగ్యులర్ నూనెలో వేసి శరీరం మరియు తలకు పట్టించి సున్నితమైన మసాజ్ చేసి స్నానం చేయాలి. ఇలా రాత్రుల్లో చేస్తే మరింత మంచిది

4. యోగ చేయాలి
ఎప్పుడైతే మీరు బాధపడుతుంటారో, వారు ఏదోఒక విషయంలో ఆందోళన కలిగి ఉంటారు . లోతైనశ్వాస పీల్చడం ద్వారా మీ మనస్సు విశ్రాంతి పొందుతుంది . అందుకు యోగా మరియు యోగా టెక్నిక్స్ ఒక నేచురల్ రెమెడీస్ గా ఆందోళనలును తగ్గిస్తాయి. ఈ యోగా బ్రీథింగ్ ఎక్సర్ సైజ్ ను ప్రాణాయం అని కూడా అంటారు.

READ MORE: ప్రసవం తర్వాత ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవడానికి చిట్కాలు

5. స్నానం చేసే నీటిలో ఎప్సమ్ సాల్ట్ ను వేయాలి
ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం పల్ఫేట్ ఉంటుంది . ఇది బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది మరియు ఒత్తిడిని అరికడుతుంది . ఎప్సమ్ సాల్ట్ ఆందోళనను తగ్గించి మరియు మనస్సును రెగ్యులేట్ చేస్తుంది. మనస్సును ప్రశాంత పరుస్తుంది . గోరువెచ్చనీ నీటిలోఎప్సమ్ సాల్ట్ వేసి స్నానం చేస్తే ఆందోళను కొద్దిగా ఉపశమనం కలుగుతుంది.

English summary

How to Treat Anxiety Using Natural Methods: Health Tips in Telugu

Mild anxiety is common in men, women and young adults who undergo significant stress in their day-to-day life. If it occurs repeatedly or the anxiety episodes are severe, it obstructs the normal functioning and well-being of a person.
Desktop Bottom Promotion