For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాదాలను గమనిస్తే శరీర ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చా ?

By Nutheti
|

పాదాలు మన ఆరోగ్యాన్ని తెలుపుతాయా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఆశ్చర్యకరమైన విషయమే అయినా.. పాదాలు శరీర ఆరోగ్య పరిస్థితిని తెలుపుతాయని..

అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే చాలామంది పాదాల విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటారు. పాదం వాపు వచ్చినా.. చిన్న చిన్న దెబ్బలు తగిలినా.. పట్టటించుకోరు. కానీ అది మంచిది కాదంటున్నారు వైద్యులు.

foot

మీ శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా అని పాదాల ద్వారానే తెలిసిపోతుందట. కాబట్టి ఇకపై మీ పాదాలను బాగా గమనిస్తూ ఉండండి. ఏమాత్రం తేడా కనిపించినా.. అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయండి లేదా డాక్టర్ ని సంప్రదించండి. పాదాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి.. అవి వేటికి సంకేతాలో తెలుసుకుందాం.

కాలి బొటనవేలు సాగినట్లు కనిపిస్తే

కాలి బొటనవేలు సాగినట్లు కనిపిస్తే

కాలి బొటనవేలు సాగినట్లు కనిపించడం, వేళి మధ్యలో పుండ్లు ఏర్పడటం సాధారణంగా గమనిస్తుంటాం. మంచినీళ్లు సరిగ్గా తాగని వాళ్లకు, బరువు ఎక్కువగా ఉన్నవాళ్లుకు ఈ సమస్య వస్తుంది. దీనికి ఆహారం, వ్యాయామాలు పరిష్కారం.

పాదాలకు చల్లగా అనిపిస్తే

పాదాలకు చల్లగా అనిపిస్తే

పాదాలు ఎక్కువగా చల్లగా అనిపిస్తుంటే.. మీకు థైరాయిడ్ సమస్య పొంచి ఉందని అర్థం. ఇలాంటి ఫీలింగ్ మీ పాదాలలో కనిపిస్తే.. మీరు హైపోథైరాయిడిజమ్ తో బాధపడుతున్నారని.. పాదాలకు రక్తప్రసరణ సరిగా అందడంలేదని సూచిస్తుంది.

MOST READ:ఏ రాశి అబ్బాయితో మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉంటుంది ?MOST READ:ఏ రాశి అబ్బాయితో మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉంటుంది ?

పాదాలలో అల్సర్స్

పాదాలలో అల్సర్స్

పాదాలలో అల్సర్స్ ఏర్పడితే.. మధుమేహం ఉందని అర్థం. పాదాల్లో తిమ్మిరిగా ఉండటం, ఎర్రని చారలు ఏర్పడటం.. టైప్ టు డైయాబెటీస్ కి సంకేతాలు. కాబట్టి అలాంటి లక్షణాలు కనపడగానే డాక్టర్ ని సంప్రదించాలి.

మీ పాదాల గోళ్ల షేప్ మారితే

మీ పాదాల గోళ్ల షేప్ మారితే

పాదాల గోళ్ల ఆకారం మారితే అశ్రద్ధ చేయకూడదు. అలాంటి సంకేతాలు కనిపించిన వెంటనే హార్ట్ టెస్ట్ చేయించుకోవాలి. గోళ్ల షేప్ చేంజ్ అయిందంటే.. హృద్రోగ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమని గమనించాలి.

కాళ్లపై రోమాలు లేకపోతే

కాళ్లపై రోమాలు లేకపోతే

కాళ్లపై రోమాలు లేకుండా.. నిగనిగలాడుతుంటే.. ఫెరిఫెరల్ వ్యాస్కులర్ డిజీస్ కి సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

కాలి గోళ్లు మెరుస్తుంటే

కాలి గోళ్లు మెరుస్తుంటే

కాలి గోళ్లు మెరుస్తున్నట్లు అనిపిస్తే.. సొరియాసిస్, చర్మ సంబంధిత సమస్యలకు కారణమని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. క్రీమ్ బేస్డ్ మెడిసిన్స్ వాడటం మంచిది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. తెల్ల మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.

MOST READ:కొబ్బరి నూనెలో దాగి ఉన్న సౌందర్య రహస్యాలుMOST READ:కొబ్బరి నూనెలో దాగి ఉన్న సౌందర్య రహస్యాలు

పాదాల జాయింట్స్ లో గాయాలు గమనిస్తే

పాదాల జాయింట్స్ లో గాయాలు గమనిస్తే

పాదాలు గాయపడినట్లు కనిపిస్తే.. త్వరలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య వస్తుందని సంకేతం. జాయింట్స్ లో వాపులు, చీము కారడం వంటివి కూడా ఎక్కువగా కనిపిస్తాయి.

English summary

Look At Your Feet To Check If Your Healthy: health tips in telugu

Experts say the state of our feet might tell us if we have serious health problems. There is a recent study which shows that the feet actually bring out the real reason why we are unwell in the first place. It is said that most of the time people choose to ignore a swollen foot as they think it might be due to an increase of pressure, they also choose to neglect a small cut too which is not at all advisable.
Desktop Bottom Promotion