For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో విటమిన్ సి ఆహారాలు తీసుకోవడానికి గల కారణాలు

|

మన ఆరోగ్య సంరక్షణలో విటమిన్ సి కున్న ప్రాధాన్యత ఏంటో మనకు తెలిసిందే! మన శరీరానికి అత్యవసరం అయ్యే విటమిన్లలో విటమిన్ సి ఒకటి, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది. ఈ వేసవి సీజన్ లో మన ఆరోగ్యం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది . వేసవి వేడి నుండి మన శరీరానికి తగినంత రక్షణ అవసరం అవుతుంది.

ముఖ్యంగా వేసవిలో మనం ఎండకు తిరగడం వల్ల వాతావరణంలో అధిక వేడి వల్ల మన ఆరోగ్యంతో పాటు చర్మం కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి, ఎండలకు బయట తిరగకుండా శరీరానికి రక్షణ కల్పించడంతో పాటు, ఆరోగ్యంగా ఉండటానికి అవసరం అయ్యే సమ్మర్ ఫుడ్స్ ను విటమిన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

READ MORE: సంపూర్ణ ఆరోగ్యానికి కేరాఫ్ ‘విటమిన్ ఇ'ఆహారాలు..!

వేసవి కాలంలో సన్ స్ట్రోక్ వల్ల ప్రతి సంవత్సరం చాలా మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని కొన్ని పరిశోధనల ప్రకారం తెలిసింది. వేసవిలో తీసుకొనే ఆహారం వల్ల మన శరీరం వేడి నుండి రక్షణ పొందాలి. అంతే కాదు మనం తీసుకొనే ఆహారం సూర్య రశ్మి నుండి వెలువడే యూవి కిరణాల నుండి మరియు అదనపు వేడి నుండి రక్షింపబడుతుంది .

READ MORE: విటమిన్ రిచ్ ఫుడ్స్: జుట్టు రాలడం నివారించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

వేసవి సీజన్ లో తీసుకొనే విటమిన్ ఫుడ్స్ లో విటమిన్ సి కి ఎందుకంత ప్రాధాన్యత ఉన్నదో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

సన్ బర్న్ :

సన్ బర్న్ :

సన్ బర్న్ చాలా ప్రమాధకరం అని చాలా మంది గ్రహించరు. అందుకే వేసవిలో త్వరగా డీహైడ్రేషన్ కు గురిఅవుతుంటారు . సన్ బర్న్ చాలా ప్రమాధకారి. కొన్ని సందర్భాల్లో స్కిన్ క్యాన్సర్ కూడా కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పరిస్థితిని కంట్రోల్ చేయవచ్చు.

యాంటీఆక్సిడెంట్స్:

యాంటీఆక్సిడెంట్స్:

విటమిన్ సి యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటుంది . మన శరీరానికి ఫ్రీరాడికల్ డ్యామేజ్ కలగకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం అవుతాయి. సన్ రేస్ వల్ల మరియు వాతావరణంలో వేడి వల్ల చర్మం త్వరగా డ్యామేజ్ అవుతుంది . కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో విటమిన్ సి ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం.

కొల్లాజెన్:

కొల్లాజెన్:

శరీరానికి విటమిన్ సి చాలా అత్యవసరం. ముఖ్యంగా దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది . అందుకు నిపుణులు విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోమని సలహాలిస్తుంటారు.

చర్మం:

చర్మం:

చర్మం సౌందర్యాన్ని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ సి చాలా అవసరం అయినది . మీరు ఆరోగ్యకరమైన మరియు స్మూత్ స్కిన్ పొందాలని కోరుకుంటున్నట్లైతే, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం.

వేడి వాతావరణం:

వేడి వాతావరణం:

వాతావరణం వేడి వల్ల శరీరంను రక్షించుకోవడటానికి విటమిన్ సి చాలా అవసరం అవుతుంది. సన్ టాన్ లేదా సన్ స్ట్రోక్ లేదా డీహైడ్రేషన్ కు గురి అయినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

నయం చేస్తుంది:

నయం చేస్తుంది:

విటమిన్ సి ఫుడ్స్ లో హీలింగ్ పవర్స్ అధికంగా ఉంటుంది . ఇది నయం చేసే విధానంను వేగవంతంగా చేస్తుంది. సన్ బర్న్ మరియు ఇతర వేసవి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

హీట్ రాషెష్:

హీట్ రాషెష్:

విటమిన్ సి ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడి వేసవిలో హీట్ రాషెష్ రాకుండా నివారించుకోవచ్చు.

English summary

Reasons To Consume Vitamin C In Summer

Why is it important to consume vitamin C in summer? Well, summer is a hot season. The heat affects your health in many ways. Your body needs protection from the heat. Food can also protect your body from the UV rays and also excess heat. Now, let us discuss why Vitamin C is one of the important vitamins for summer.
Story first published: Monday, May 4, 2015, 18:09 [IST]
Desktop Bottom Promotion