For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంత తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తున్నదా...కారణం ఏమై ఉంటుంది..?

By Super
|

కొంత మంది ఎంత తిన్నా ఇంకా ఆకలిగానే ఉన్నదన్న ఫీలింగ్ ను వ్యక్తపరుస్తుంటారు. ఆకలి అనేది మానవ సహజం ఐతే తిన్న తర్వాత కూడా మళ్ళీ ఆకలిగా అనిపించడం అది తిండిపోతుల లక్షణం. అయితే ఒక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొన్న తర్వాత కూడా తిరిగి తినాలనే కోరిక లేదా మళ్ళీ ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎంత తిన్నా తిరిగి ఆకలేస్తుందంటే మీ జీర్ణాశయంలో ఏదో సమస్య ఉన్నట్లే....

ఆహారం తీసుకొన్న తర్వాత కూడా తిరిగి ఇలా ఆకలి అవ్వడానికి ఒక ముఖ్య కారణం కూడా లేకపోలేదు. ఆహారం తినేటప్పుడు బాగా నమిలి నిధానంగా తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. అదే ఆహారాన్ని నమలకుండా నోట్లో పెట్టుకోగానే మ్రింగడం వల్ల ఆకలి మరింత పెంచచుతంది. అలా మింగిన ఆహారం చాలా వేగంగా జీర్ణం అవుతుంది.

READ MORE:ఆకలిని కంట్రోల్ చేసి,బరువు తగ్గించే 20 సూపర్ ఫుడ్స్

మంచి భోజనం చేసిన తర్వత కూడా తిరిగి ఆకలి వేయడానికి మరోకారణం కూడా ఉంది. మీరు తీసుకొనే ఆహారం మీ మెటబాలిజం రేటు కంటే చాలా తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆకలి పెరుగుతుంది. మరి ఈ అనుమాలు మరియు అపోహలన్నింటికి సమాధానం కావాలంటే మీరు ఆహారం తీసుకొన్న తర్వాత కూడా మీకు ఆకలి అగుపించడానికి ఈ క్రింది కొన్ని కారణాలున్నాయి...వీటిని తెలుసుకోవడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

శరీరంలో తగినన్నినీరు లేకపోవడం :

శరీరంలో తగినన్నినీరు లేకపోవడం :

మన శరీరంలో 70శాతం వరకూ నీరు నిండి ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కూడా తిరిగి ఆకలేస్తుందంటే అందుకు శరీరంలో నీరు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి మీరు తగినన్ని నీరు తీసుకోవడం వల్ల మీ ఆకలి కోరికలను క్రమంగా తగ్గించుకోవచ్చు.

మీ ఫేవరెట్ డ్రింక్ సోడా?

మీ ఫేవరెట్ డ్రింక్ సోడా?

మీకు ఇష్టమైన డ్రింక్స్ లో సోడా ఒకటైతే, దీని వల్ల శరీరంలో రక్తప్రవాహం తగ్గుతుంది మరియు దాంతో మీ జీవక్రియలు ఆలస్యం అవుతుంది. దాంతో మీరు భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి అనిపించడం సహజం

హోం మేడ్ ఫుడ్స్:

హోం మేడ్ ఫుడ్స్:

ఎప్పుడూ బయటి ఆహారాలు, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కు అలవాటు పడటం వల్ల ఒక్క సారి ఇంట్లో తయారుచేసే ఆహారాలకు అలవాటు చేసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. అవి మీ శరీరంలో జీర్ణంచుకోవడం కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది . బయట తినే ఆహారాల్లో ప్రిజర్వేటివ్ లో కెమికల్స్ షుగర్స్ కోల్పోయేలా చేసి మరింత ఆకలి పెంచుతుంది.

ఛాయ్ బ్రేక్ తీసుకోవడం

ఛాయ్ బ్రేక్ తీసుకోవడం

అప్పుడప్పుడు టీ లేదా ఛాయ్ బ్రేక్ తీసుకోవడం మంచిది. ఒక కప్పు కాఫీ కంటే ఒక కప్పు ఛాయ్ హెల్తీ బెవరేజ్ అని నిపుణులు చెబుతున్నారు. టీ త్రాగడం వల్ల మీ పొట్ట ఫుల్ ఫిల్ గా భావిస్తారు. కాబట్టి, మీరు టీ బ్రేక్స్ ను రీసెట్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి మరియు ఆహారం తిన్న తర్వాత స్నాక్స్ తీసుకోవడం తగ్గిస్తారు.

రోజులో మొదట తీసుకొనే ఆహారం:

రోజులో మొదట తీసుకొనే ఆహారం:

దినచర్య ప్రారంభించడానికి ముందు , మొదటగా తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. ఒక వేళ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మర్చి పోతే ఎక్కువగా స్నాక్స్ మీదకు ద్రుష్టిమళ్ళుతుంది . భోజనం చేసినా కూడా ఆకలి అగుపిస్తూనే ఉంటుంది. కాబట్టి, డోన్ట్ మిస్ బ్రేక్ ఫాస్ట్

మందుల ప్రభావం

మందుల ప్రభావం

మంచి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అగుపిస్తుంటే, అందుకు ముఖ్య కారణం మెడిసిన్స్. రసాయనాలతో తయారుచేసే మెడిసిన్స్ లో స్టెరాయిడ్స్, ప్రిడ్నోసోన్స్, కార్టికాస్టెరాయిడ్ వంటివి ఆకలిని మరింత పెంచేస్తాయి.

వర్కౌట్ ట్రబుల్స్

వర్కౌట్ ట్రబుల్స్

భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి ఎందుకేస్తుంది, ముఖ్యంగా వర్కౌట్స్ తర్వాత ఎక్కువ క్యాలరీలను కోల్పోతారు అలాంటి వారిలో అలాగే తిన్న ఆహారం నుండి శరీరం పొందే కార్పోహైడ్రేట్స్ ఎనర్జీని అందిస్తాయి . ఈ కారణం వల్ల, భోజనం తిన్నాక కూడా మరింత ఎక్కువ ఫుడ్స్ తీసుకోవాలనే కోరికలు మొదలవుతాయి

ఒత్తిడి కూడా కారణమే

ఒత్తిడి కూడా కారణమే

ఆరోగ్యానికి అత్యంత ప్రమాధకారి ఒత్తిడి. ఒత్తిడి వల్ల మిమ్మల్ని బరువు తగ్గడానికి కారణం అవుతుంది. అదే సమయంలో మరింత ఎక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది . ఇది మీళ్లీ అనారోగ్యకరమైన అలవాటుగా మారుతుంది

ఆరోమా ప్రభావం:

ఆరోమా ప్రభావం:

మన పొట్టకు ఎంత అవసరం అవుతుందో అంతే పరిమాణంలో తీసుకోవాలి. అంతే కానీ, సువాసనలు, ఘుమఘమలాడే వంటలకు ఫీదా అయి తినేస్తే పరిస్థితి మళ్లీ మొదటకు వస్తుంది. హెల్తీ ఫుడ్స్ తీన్నా కూడా ఆరోమా వాసనల వల్ల మళ్లీ తినాలనిపిస్తుంది.!

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఎక్కువ ఆల్కహాల్ తీసుకొన్నా ఎక్కువ ఆకలి కలుగుతుంది . కాబట్టి, ఆల్కహాల్ తాగడం కూడా ఒక చెడు అలవాటు, దీనివల్ల ఆరోగ్యానికి హాని కలగడంతో పాటు, ఆకలి కోరికలు అమాంతం పెరగుతాయి.

English summary

Reasons Why You Feel Hungry After Eating Healthy!:Health Tips in Telugu

Reasons Why You Feel Hungry After Eating Healthy!It is human tendency to stuff our faces galore when we are hungry. Some of us even gulp food right after a healthy meal. This consistent habit of eating again after a healthy meal is not good. Experts state that if you feel hungry right after eating a good meal
Desktop Bottom Promotion