For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఒక్క టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ తీసుకుంటే పొంద అద్భుత ప్రయోజనాలు.!

|

దాల్చిన చెక్క రుచిలో అద్భుతంగా ఉంటుంది. తీపి తగులుతూ అంతలో మంటనిపించే ఘాటు నషాళానికి అంటుతుంది. కోసం అనారోగ్య సమస్యలు నయం చేసేందుకు వంటలలో వాడుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్లలో ఇది ఒకటి. దీనిలో మాంగనీసు చాలా ఎక్కవ స్ధాయిలో ఉంది. పీచు క్యాల్షియం కూడా లభిస్తాయి. రోజూ ఏ రూపంలో నైనా ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్ తీసుకుంటే ఆర్ డి ఏ విలువ ప్రపకారం 22% మాంగనీస్ మనకు లభిస్తుంది.

1 Teaspoon Of Cinnamon Every Day Can Do These; Leaves Doctors Shocked!

దాల్చిన చెక్క పౌడర్ ను ఇది వరకూ తేనె మరియు వేడి నీళ్ళతో, పాలతో కలిపి తీసుకోవడం మనకు తెలుసు. అలాగే ఉదయం దీన్ని నేరుగా తీసుకోవడం మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో ఉండే సినామిన్ డీహైడ్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి ఇది అనేక వ్యాధులను నివారించడలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఇందులో ఉండే ఔషధ గుణాలు ప్రభావం వల్ల ఇందులో మాంగనీస్, ఫైబర్ , క్యాల్షియంలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని ప్రిజర్వేటివ్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. జెర్మ్స్ అండ్ బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రిజర్వేటివ్ ఫుడ్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

కాలేయ వ్యాధులతో భాదపడే వారు కొద్దిగా కేర్ ఫుల్ గా ఉండటం మంచిది. అయితే దీన్ని ఎవరైనా సరే పరిమితంగా తీసుకోవడం మంచిది...

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

దాల్చిన చెక్క పొడిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ దాల్చిన చెక్క పౌడర్ ను ఉదయం పరడగపున ఒక టీస్పూన్ తీసుకుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది.

బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది:

బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది:

దాల్చిన చెక్క పౌడర్ ను ఒక టీస్పూన్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

కీళ్ళ నొప్పులను నివారిస్తుంది:

కీళ్ళ నొప్పులను నివారిస్తుంది:

దాల్చిన చెక్క మరియు తేనె కాంబినేషన్ ఆర్థరైటిస్ ఒక ఉత్తమ చికిత్స వంటింది. రెండు బాగాల గోరువెచ్చని నీళ్ళలో ఒక బాగం తేనె మరియు ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్ వేసి, బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. శరీరంలో నొప్పి, వాపు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది . అలాగే ఆర్థరైటిస్ పేషంట్స్ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్కపౌడర్ మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే క్రోనిక్ ఆర్ధరైటిస్ నివారించబడుతుంది.

ఎనర్జీ ఇస్తుంది:

ఎనర్జీ ఇస్తుంది:

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ను టీ లేదా పాలలో మిక్స్ చేసి తాగడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు.

 హార్ట్ డిసీజ్ నివారిస్తుంది:

హార్ట్ డిసీజ్ నివారిస్తుంది:

తేనె, దాల్చిన చెక్కను బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. డైరెక్ట్ తీసుకోవడం ఇష్టపడని వాళ్లు.. బ్రెడ్ పై జామ్ కి బదులు ఈ పేస్ట్ చేర్చుకుని తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. కొలెస్ర్టాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇప్పటికే హార్ట్ ఎటాక్ సమస్యతో బాధపడుతున్నవాళ్లు కూడా రెగ్యులర్ గా ఈ మిశ్రమాన్ని తీసుకోవం వల్ల గుండె కండరాలను బలంగా చేస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

ఒక టీస్పూన్ తేనె, చిటికెడు చెక్క పొడి తీసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు తినాలి. అంతే.. దగ్గు, జలుబుని తేలికగా తగ్గిస్తుంది. తేనెలో నేచురల్ పదార్థాలు ఉండటం వల్ల , ఇది ఇన్ఫ్లూయాంజాకు సంబంధించన క్రిములను నాశనం చేసి, ఫ్లూ నుండి పేషంట్ ను రక్షిస్తుంది. తేనెను దాల్చిన చెక్కతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లూయాంజాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లక్షణాలను మరియు జర్మ్స్ ను నాశనం చేస్తుంది.

బరువు తగ్గిస్తుంది :

బరువు తగ్గిస్తుంది :

దాల్చిన చెక్క, తేనె మిశ్రమంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

1 Teaspoon Of Cinnamon Every Day Can Do These; Leaves Doctors Shocked!

For those of you who think that cinnamon is just a spice, then you are wrong. This wonder spice not just brings in that aroma in your cuisines but at the same time it is known for its innumerable health benefits.
Story first published: Saturday, December 24, 2016, 13:08 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more