For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిపూట నిద్రకు భంగం కలిగించే చెమటకు చెక్ పెట్టే రెమిడీస్

|

రాత్రుల్లో నిద్రకు అంతరాయం కలిగిస్తూ రోజు మిడ్ నైట్లో చెమటలు పడుతున్నాయా? విశ్రాంతి లేకున్నా చేస్తున్నదా? నైట్ స్వెట్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఏదో అనారోగ్యానికి చిహ్నంగా గుర్తించాలి. ముఖ్యంగా మోనోపాజ్ లక్షణాలలో అత్యంత ముఖ్యమైన లక్షణం ఇది.

ఎంత బాగా చెమటలు పట్టిస్తే ఆరోగ్యానికి అంత మంచిది....

మద్యరాత్రిలో చెమటలతో నిద్రలేవడం వల్ల హాపీ ఫీలింగ్ ఉండదు మరియు చికాకు కలిగిస్తూ...అసౌకర్యానికి గురిచేస్తుంది. ఇది మెడికల్ ప్రాబ్లెమ్ కాకపోయినా మహిళల్లో ఇలాంటి లక్షణాలను మోనోపాజ్ ను సూచిస్తాయి. నైట్ స్వెట్ చాల మందిలో చూస్తుంటాము. మద్యరాత్రిలో చెమటతో తడిచిన జుట్టు, బెడ్ షీట్స్ తేమగా ఉండటం గమనిస్తుంటారు. రూమ్ టెంపరేచర్ నార్మల్ గా ఉన్నా.,.ఇలా రాత్రుల్లో చెమటలు పట్టడం మోనోపాజ్ ప్రధానకారణం అవుతుంది .

ఈ ఆహారాలు తీసుకొంటే ఖచ్చితంగా మీ నుండి 'చెమటలు’ బలాదూర్..!

ఇంకా వీటితో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్, ఆందోళనతో, కోపంతో నిద్రపోయినప్పుడు, యాంటీడిప్రెజెంట్, యాంటీ పైరికెట్సి, బ్లడ్ షుగర్స్ లో హైపోగ్లిజిమిక్స్ ఏజెంట్ తగ్గడం , మోనోపాజ్ హాట్ ఫ్లాష్ వల్ల నైట్ స్వెట్ కు గురికావల్సి వస్తుంది. ప్రీమోనోపాజ్ లో ప్రొజెస్ట్రిరాన్ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఈస్ట్రోజెన్ వాల్యూమ్ తగ్గడం వల్ల కూడా రాత్రుల్లో చెమటలు పడుతాయి . మరి ఈ సమస్యను నివారించుకోవడం ఎలా? కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేసి, నైట్ స్వెట్ ను విముక్తి చేసి, రాత్రుల్లో బాగా నిద్రపట్టేలా చేస్తాయి...

బ్లాక్ కోహోస్:

బ్లాక్ కోహోస్:

ఈ పాపులర్ నేచురల్ హెర్బ్ రాత్రుల్లో చెమటలు నివారించడానికి పాపులర్ గా ఉపయోగిస్తుంటారు . ఇది చూడటానికి బట్టర్ కప్ లా ఉంటుంది. ఇది బాడీలో హాట్ ఫ్లాషెస్ మరియు నైట్ స్వెట్స్ ను నివారిస్తుంది. దీన్నిఉపయోగించాలంటే కొద్దిపాటి వ్యాయామాలు చేయాలి. బ్రెస్ట్ క్యాన్సర్ లేదా గర్భిణీలు దీన్ని ఉపయోగించడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. దీన్ని ఉపయోగించడం వల్ల తలనొప్పి, మరియు బ్రెస్ట్ టిష్యుష్ పెరుగుతాయి.

జెన్సెంగ్ :

జెన్సెంగ్ :

తలనొప్పి, స్ట్రెస్ మరియు వీక్ ఇమ్యూన్ సిప్టమ్ కు జిన్సెంగ్ పాపురల్ రెమెడీ . దీన్ని గతంలో మోనాపాజ్ లక్షణాలను ఆలస్యం చేయడానికి మరియు నైట్ స్వెట్ ను నివారించుకోవడానికి సహాయపడుతాయి. అయితే ఈ జిన్సెంగ్ హెర్బ్ ను మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. జిన్సెంగ్ వల్ల వికారం, నిద్రలేమి మరియు డయోరియా వంటివి కూడా ఉన్నాయి.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

నైట్ స్వెట్ మరియు హాట్ ఫ్లాషెస్ నివారించుకోవడానికి ఇది మరో పాపులర్ హోం రెమెడీ. ఫ్లాక్స్ సీడ్స్ లోఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. హాట్ ఫ్లాషెస్ మరియు నైట్ స్వెట్స్ ను నివారిస్తుంది. కాబట్టి, ఫ్లాక్స్ సీడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . వీటిని సలాడ్స్, ఫుడ్స్, మరియు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సెరెల్స్ తో కలిపి తీసుకోవచ్చు.

విటమిన్ ఇ :

విటమిన్ ఇ :

నైట్ స్వెట్ నివారించడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీస్ విటమిన్ ఇ. విటమిన్ ఇ శరీరంలో వివిధ రకాల జీవక్రియలు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది . విటమిన్ ఇ వెజిటేబుల్ ఆయిల్స్ మరియు నట్స్ లో పుష్కలంగా రెడిమేడ్ గా అందుతుంది. విటమిన్ ఇని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రాత్రుల్లో తరచూగా మరియు ఎక్కువగా చెమటలు పట్టడాన్ని నివారిస్తుంది.

కెఫిన్ తగ్గించాలి:

కెఫిన్ తగ్గించాలి:

నికోటిన్ లాగే కెఫిన్ కూడా హాట్ ఫ్లాషెస్ కు కారణం అవుతుంది మరియు నైట్ స్వెట్ కు కారణం అవుతుంది. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ ఓకే. దీనికంటే మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్:

ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్:

ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఈ ప్రైమ్ రోజ్ ఆయిల్ సప్లిమెంట్ నైట్ స్వెట్ ను మరియు హాట్ ఫ్లాషెస్ ను తగ్గించుకోవడానికి చాలా మంది మహిళలు దీన్ని తీసుకుంటారు . ప్రైమ్ రోజ్ ఆయిల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యమైనది . ప్రైమ్ రోజ్ ఆయిల్ అందరికి ఎఫెక్టివ్ గా పనిచేయకపోవచ్చు. ఇతర పద్దతులు పనిచేయనప్పుడు ఈ పద్దతిని ఫాలోకావచ్చు.

లైట్ క్లోత్స్:

లైట్ క్లోత్స్:

మరో సులభమైన మరియు నేచురల్ రెమెడీ. నైట్ స్వెట్ నివారించాలంటే లైట్ గా ఉండే దుస్తులు ధరించాలి టైట్ గా , సౌకర్యంగా లేని దుస్తులు ధరించడం వల్ల హాట్ ఫ్లాషెస్ మరియు నైట్ స్వెట్ కు గురికావల్సి వస్తుంది.

వార్మ్ వాటర్ బాత్:

వార్మ్ వాటర్ బాత్:

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. నైట్ స్వెట్ తగ్గించుకోవడానికి గోరువెచ్చని నీటితో 20నిముషాలు స్నానం చేయడం వల్ల నైట్ స్వెట్ ను తగ్గించుకోవచ్చు.

 వ్యాయామం:

వ్యాయామం:

మోనోపాజ్ లక్షనాలతో పాటు వచ్చే నైట్ స్వెట్ తగ్గించుకోవడానికి ఏరోబిక్ మరియు యోగ వంటి వ్యాయామాలు ప్రత్యేకంగా శరీర ఆరోగ్యానికి మంచిది. రెగ్యులర్ వ్యాయామం చేయడం వల్ల నైట్ స్వెట్ మరియు హాట్ ఫ్లాషెస్ ను కంట్రోల్ చేసుకోవచ్చని చాలా స్టడీస్ నిర్ధారించాయి.

నికోటిన్ కి స్వస్తి చెప్పాలి:

నికోటిన్ కి స్వస్తి చెప్పాలి:

హాట్ ఫ్లాషెస్ మరయిు నైట్ స్వెట్ కు నికోటిన్ ముఖ్యకారం. స్మోక్ చేసే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ నికోటిన్ కు దూరంగా ఉండటం మంచిది.

English summary

10 Effective Home Remedies To Treat Night Sweats

Have you ever woken up sweating in the middle of the night? And has this been robbing your peace? Night sweat can be an irksome condition and it usually is regarded as an aggressive symptom of menopause. Waking up in the middle of the night drenched in sweat is not a happy feeling at all, right?
Story first published: Saturday, March 5, 2016, 14:46 [IST]
Desktop Bottom Promotion