Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మీ భాగస్వామితో మస్తు మజా చేయాలంటే, ఈ ఆహారాల పట్ల జాగ్రత్త సుమా.!
జంటల వివాహ జీవితంలో కామేచ్ఛ తగ్గిందంటే ఎన్నో సమస్యలు వచ్చిపడతాయి. నాలో కామేచ్ఛ తగ్గిపోయింది డార్లింగ్...అంటూ తన పార్టనర్ కు ఎవరూ చెప్పుకోలేరు. అది వారి అహాన్ని దెబ్బతీస్తుంది. కాని కోరిక తగ్గిపోవటం అనే సమస్య తీవ్ర శారీరక మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది.
మనకు తెలియకుండానే ఎన్నో ఆహారాలు ఇంటిలో తినేస్తూ వుంటాం. వాటిలో కొన్ని మనలోని కోరిక తగ్గించేవిగా వుంటాయి. ఆ ఆహారాలు మీ పార్టనర్ తో సంభోగం చేయాలనే వాంఛను తగ్గించేస్తాయి. కనుక వాటిని మీరు తినటం తగ్గించాలి. అంటే, మీ ఆహారంనుండి వాటిని పూర్తిగా తొలగించేయమని కాదు. మీకు తినాలనుంటే, కొద్ది మొత్తాలలో తినండి.


సోపు విత్తనాలు -
ప్రతివారికి భోజనం తర్వాత నోటి రుచి మారాలంటూ సోపు వేయటం అలవాటుగా వుంటుంది. ఈ సోపు విత్తనాలు కనుక అధికం అయితే, ఎంతో హాని. అవి మీ కామ వాంఛను కుదించేస్తాయి. ఇవి మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయి తగ్గిస్తాయి.

కార్న్ ఫ్లేక్స్ -
కార్న్ ఫ్లేక్స్ లేదా మొక్క జొన్న పొత్తులు రెగ్యులర్ గా తింటూ వుంటే కూడా మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయిలు పడిపోతాయి. మొదటగా జొన్న పొత్తులను ఆహారంలో ప్రవేశ పెట్టేటపుడే, ఈ విషయాన్ని అది కనిపెట్టిన జాన్ హార్వే కెల్లాగ్ ప్రచారం చేశారు. ఈ ఆహారాన్ని కామ వాంఛ తగ్గించేందుకే ప్రవేశ పెట్టారు. అతని మేరకు, తమ కామవాంఛలు అధికంగా వుండి, మానసిక, శారీరక సమస్యలు తగ్గాలని కోరే వారికి ఈ ఆహారం ఎంతో సహకరిస్తుంది.

కూల్ డ్రింకులు,
కూల్ డ్రింకులు, టానిక్ లు - కొన్ని కూల్ డ్రింక్ లలో క్వినైన్ ఉంటుంది. ఈ క్వినైన్ అనే పదార్ధాన్ని సింకోనా చెట్టు బెరడునుండి తీస్తారు. దీనిని మలేరియా వ్యాధి నివారణలో వాడతారు. అది మీ కామ కోర్కెలను కూడా తగ్గిస్తుంది. కనుక ఏదేని పానీయం లేదా క్వినైన్ కల టానిక్ తాగేముందు ఆలోచించండి.

ఆల్కహాల్ -
ఆల్కహాల్ తాగితే, ఆనందం మరియు నొప్పి రెండూ ఉంటాయి.ఆల్కహాల్ అధికమైతే, కామవాంఛ నశిస్తుంది. అంతేకాదు, ఆల్కహాల్ అధికమైతే, తలనొప్పి మరియు హేంగోవరు మూడ్ వచ్చేసి మీ రతివాంఛలు వెనుకపడతాయి.

మింట్
ధనియాలు మరియు మింట్ (పుదీనా) - ధనియం మరియు, కొత్తిమీర వంటివి ప్రధానంగా మసాలాలో వాడతారు. కాని ఇది టెస్టోస్టిరోన్ హార్మోన్ బాగా తగ్గించేస్తుంది. అయితే, తక్కువ మొత్తాలలో వాడితే ఈ సమస్య ఉండబోదని చెప్పవచ్చు.

చిప్స్
మీరు కనుక బెడ్ టైమ్ చిప్స్ , వేయించిన పదార్థాలు తీసుకొన్నట్టైతే అవి మీ శరీరంలోని కణజాలాన్ని మరియు కణాలు దెబ్బతీస్తాయి. పొటాటో చిప్స్ మరియు కొన్ని క్రిస్పీ స్నాక్స్ వంటివి పులిసిపోయిన నూనెలుతో తయారు చేస్తారు. మరియు వీటిని ఎక్కువ ఉష్ణోగ్రతలో వండటం వల్ల పులిసిపోయిన నూనెల నుండి చెడు క్రొవ్వులు మరియు అధిక ఉష్టోగ్రత మీ లైగింక వాంఛను తగ్గించడంతో పాటు , మీ లైంగిక జీవితానికి అంతారయం కలిగిస్తుంది.

రెడ్ మీట్(మాంసాహారం):
మాంసాహార ప్రియులు బయట అందంగా అలంకరించిన నాన్ వెజ్ ఐటమ్స్ ను చూసి ఆకర్షింపబడి రాత్రి డిన్నర్ కి కొంచెం ఎక్కువగా లాగించేస్తారు. దాంతో ఏమవుతుంది? మాంసాహారంలో అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయంలో జీర్ణం అవడానికి కష్టం అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో అతి తక్కువగా తినడం లేదా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా డిన్నర్ బెగ్గర్ లా తినాలి. బ్రేక్ ఫాస్ట్ కింగ్ లా తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది.

కాఫీ:
ఉదయం ఒక కప్పు కాఫీ తీసుకోవడం వల్ల సంతోషకరమై మూడ్ ను ప్రేరేపిస్తుంది. కానీ, ఎక్కువగా తీసుకోవడం వల్లకాఫీలో ఉండే కెఫిన్ వల్ల స్ట్రెస్ మార్మోన్ల కార్టిసాల్ వంటి స్ట్రెస్ మరియు హార్మోన్ల అసమతౌల్యానికి కారణం కావచ్చు. కాబట్టి మీ అందమైన, సంతోషకరమైన లైంగిక జీవితం పొందడం కోసం మీరు మరియు మీ పాట్నర్ కాఫీకి దూరంగా ఉండాలి.

చీజ్(జున్ను):
అధిక క్రొవ్వు ఉన్న డైరీ ప్రొడక్ట్స్(పాల ఉత్పత్తులు) మీ శరీరానికి హాని కలుగజేయడంలో చాలా కారణాలున్నాయి. ఈ ప్రొడక్ట్స్ ను అత్యధికంగా తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ మరియు టెస్టొస్టెరాన్ వంటి సహజ ఉత్పత్తులకు అంతరాయం కలిగించి టాక్సిన్స్ (శరీరంలో విషాలను)ప్రేరేపించడానికి కారణం అవుతుంది.

యాంటీ డిప్రెసెంట్ మాత్రలు:
యాంటిడిప్రెసెంట్ మాత్రలు తినడం వల్ల మీ లైంగిక కోరికను తగ్గిస్తుంది. ఇటువంటి మాత్రలు మీరు తీసుకోవాలనుకుంటే ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించండం మంచిది.



Click it and Unblock the Notifications
