For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ హీట్ మరియు హీట్ స్ట్రెస్ ను తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...

|

బాడీ హీట్ అంటే హీట్ స్ట్రెస్. హై టెంపరేచర్లో ఉన్నప్పుడు శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది . అంతే కాదు ఒక్క సారి బాడీ హీట్ అయ్యిందంటే అంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడలేరు. ప్రస్తుత రోజుల్లో బాడీ హీట్ చాలా మందిలో ఉన్న కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ . బాడీ హీట్(శరీరంలో ఉష్ణోగ్రత)వల్ల కూడా హీట్ స్ట్రెస్ కు కారణం కావచ్చు . బాడీహీట్ దానంతట అదే తగ్గదు ఎందుకంటే శరీరంలోపల అనేక ఆరోగ్య సమస్యలు కారణమై ఉంటుంది. ఉదా : అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, మైకం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

వాతావరణంలో మార్పులు, వేడి వాతారవణం, హుమిడిటి, కఠనమైన సూర్యకిరణాలు టైట్ గా ఉండే దుస్తులు ధరించడంలో , కఠనమైన వ్యాయామలు, శారీరక వ్యాయాలు మరియు కొన్ని మెడికల్ కండీషన్స్ వల్ల బాడీ హీట్ ను మరింత తీవ్రం చేస్తుంది. వేడిలో పనిచేయడం, వేడి కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాడం ఇవన్నీ కూడా బాడీ హీట్ కు ప్రధాన కారణాలు.

బాడీ హీట్ ఇది వ్యాధి కాదు, కానీ ఈ సమస్యను వెంటనే తగ్గించుకోకపోతే, తగిన చికిత్స చేయించుకోకపోతే ఇది వడదెబ్బగా మారుతుంది. హీట్ స్ట్రెస్ ఏ వయస్సువారికైనా రావచ్చు కానీ 65ఏళ్ళ పైబడ్డ వారిలో, చిన్న పిల్లల్లో మరియు యంగ్ స్టర్స్ , గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లుల్లో వస్తే మాత్రం ప్రమాధం మరింత తీవ్రంగా ఉంటుంది. బాడీ హీట్ కు గురైనప్పుడు బలహీనంగా, శక్తిలేకుండా ఫీలవ్వడం, వికారం, తలనొప్పి, మజిల్ క్రాంప్స్, చెమటలు ఎక్కువగా పట్టడం, మరియు హార్ట్ బీట్ ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనబడుతాయి.

వేసవి కాంలో బాడీహీట్ లేదా వడదెబ్బను తట్టుకోవడానికి శరీరంలోని వేడి తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీలున్నాయి. ఇవి శరీరంలోని వేడిని నేచురల్ గా తగ్గిస్తాయి. శరీరంలో వేడి తగ్గించుకోవడానికి ఒక సాధారణ పానీయం నీళ్ళు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది.

అదేవిధంగా నీరు ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి . జ్యూసుల రూపంలో తీసుకోవాలి. ఇలా తీసుకొన్నప్పుడు శరీరంలో వేడిని కంట్రోల్ చేయవచ్చు. అలాంటి ఆహారాల్లో పుచ్చకాయ కూడా ఒకటి. ఇవి మాత్రమే కాదు, వేసవికాలంలో మన ఒంట్లో వేడి తగ్గించడానికి మార్కెట్లో వివిధ రకాల నేచురల్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల వేసవి వేడి నుండి ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం...

1. చల్లటి నీరు:

1. చల్లటి నీరు:

ఎప్పటికప్పడు చల్లటి నీరు త్రాగడం వల్ల శరీరం వేడి నుండి ఉపశమనం పొందుతుంది. వేడి వాతావరణం నుండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగకుండా నివారిస్తుంది. శరీరంలో వేడిగా అనిపించిన వెంటనే చల్లటి నీటిని ప్రతి 15నిముషాలకొక సారి తాగుతుండాలి . ఇలా తాగడం వల్ల డీహైడ్రేషన్ నివారిస్తుంది.

2. కోకనట్ వాటర్:

2. కోకనట్ వాటర్:

బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్ళు త్రాగడం అత్యంత శ్రేయస్కరం. అంతే కాదు సమ్మర్ లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కోకనట్ వాటర్ లో ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీని రీహైడ్రేషన్ కు తీసుకురావడంలో అద్భుతంగా పనిచేస్తుంది . ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ శరీరానికి ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. . రోజులో రెండు మూడు సార్లు కోకనట్ వాటర్ తాగడం వల్ల బాడీ హీట్, హీట్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.

3. నిమ్మరసం:

3. నిమ్మరసం:

రెగ్యులర్ లెమన్ బాడీని కూల్ గా ఉంచుతుంది. మరియు హీట్ తో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వేసవిలో అందరూ తాగేది నిమ్మరసం. దీనిలో అధికశాతం 'సి' విటమిన్ వుంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక చెంచాడు నిమ్మరసం పరగడుపున తాగితే పైత్యం తగ్గుతుంది. అరుగుదల కూడా బాగా ఉంటుంది

4.సాండిల్ ఉడ్:

4.సాండిల్ ఉడ్:

గందంలో కూలింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉన్నాయి .ఇది బాడీ టెంపరేచర్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

రెండు చెంచాలా గందం పొడిని ఒక గ్లాసు నీరు లేదా పాలలో మిక్స్ చేసి, అందులోనే కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ఫోర్ హెడ్ మరియు చెస్ట్ కు అప్లై చేయాలి . నేచురల్ గా డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. పుదీనా:

5. పుదీనా:

పుదీనాలో కూలింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది బాడీ హీట్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులను కొన్నింటిని నీటిలో వేసి 20నిముషాలు బాయిల్ చేయాలి. తర్వాత ఈ నీటిని వడగట్టుకొని , ఈ నీటిని బాత్ టబ్ లో వేసి ఆనీటితో స్నానం చేయాలి . లేదా పిప్పర్మింట్ఎసెన్షియల్ ఆయిల్ ను చల్లటి నీటిలో వేసి స్నానం చేయాలి.

6. వాటర్ మెలోన్ :

6. వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ చాలా త్వరగా శరీరంలోని వేడి తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంతో పాటు, శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది , . అలాగే బాడీ హీట్ ను కంట్రోల్ చేస్తుంది . రెగ్యులర్ గా వాటర్ మెలోన్ తినడం వల్ల శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది.

7. అలోవెర:

7. అలోవెర:

బాడీ హీట్ ను తగ్గించడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ అలోవెర. ఇందులో స్మూతింగ్ అండ్ కూలింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి . శరీరం నార్మల్ బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది.

అలోవెర జెల్ ను బాడీ మొత్తం అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా బాడీ హీట్ తగ్గే వరకూ రోజూ అలోవెరతో స్నానం చేయండి.

8. ఆమ్లా:

8. ఆమ్లా:

ఆమ్లా పౌడర్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది బాడీ హీట్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నాలుగు బాగాలు నీరు, ఒక బాగం ఆమ్లా పౌడర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ మరియు షుగర్ జోడించి రోజుకు రెండు సార్లు తీసుకుంటే హీట్ స్ట్రెస్ నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

9. మజ్జిగ:

9. మజ్జిగ:

ఆయుర్వేదం ప్రకారం బాడీహీట్ తగ్గించడంలో మజ్జిగ ఒక గ్రేట్ హోం రెమెడీ. హాట్ ఫ్లాషెస్ తో బాధపడే మహిళలకు కూడా ఇది ప్రయోజనకారి. పురుషుల్లో ఎక్కు మెటబాలిజం ఉన్నవారు కూడా మజ్జిగ రెగ్యులర్ గా తీసుకోవచ్చు . ఇది ఎక్కువగా మినరల్స్ మరియు విటమిన్స్ ను అందిస్తుంది. దాంతో చెమటలు పట్టడం తగ్గుతాయి. బ్రెక్ ఫాస్ట్ లోని ఒక గ్లాస్ బట్టర్ మిల్క్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

10. గసగసాలు:

10. గసగసాలు:

గసగసాల్లో కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్నాయి . ఇది బాడీ టెంపరేచర్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఇది బాడీహీట్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

1చెంచా గసగసాలను మెత్తగా పొడి చేసి, అందులో పంచదార మిక్స్ చేసి రోజుకొక్క సారి తీసుకుంటే బాడీ హీట్ ను తగ్గించుకోవచ్చు. నిద్రించే ముందు కొన్ని నమిలి తిని కొద్దిగా నీళ్ళు తాగి పడుకోవడం వల్ల కూడా త్వరగా ఉపశమనం కలుగుతుంది.

English summary

10 Home Remedies to Reduce Body Heat

Body heat, also known as heat stress, is a common health problem caused by exposure to high temperatures. It occurs when the body is not able to cool itself enough to keep its temperature within the normal range of 36.5–37.5 degrees Celsius 97.7–99.5 degrees Fahrenheit. The body normally cools off by sweating, but sometimes sweating is not sufficient and the temperature keeps rising.
Story first published: Monday, May 16, 2016, 16:42 [IST]