For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు!

|

యాపిల్ పండుతో తయారయ్యే పదార్ధమే యాపిల్ సైడర్ వినేగర్. ఈ వినేగర్ వలన ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి ఈ యాపిల్ సైడర్ వినేగర్ వాడకం ఆశ్చర్యకర ఫలితాలనిస్తూ మీలోని అదనపు కొవ్వును కరిగించేస్తుంది. అయితే, యాపిల్ సైడర్ వినేగర్ అనేది ఒక యాసిడ్ అని అధికంగా వాడితే హాని కలిగిస్తుందని కూడా మీరు గుర్తుంచుకోవాలి. రోజు మొత్తంలో ఏ భోజనానికి ముందైనా సరే ఒకటి లేదా రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వినేగర్ తీసుకుంటే చాలు. దానిని నీటితో కలిపికూడా తీసుకోవచ్చు. దీని వ్యయం అధికం కాదు ప్రతివారికి ఇది అందుబాటులోనే ఉంటుంది.

వివిధ రకాల వ్యాధుల చికిత్స కోసం కొన్ని వేల సంవత్సరాల నుండి ఆపిల్ సైడర్ వెనిగార్ ను వాడుతున్నారు. హిప్ప్రోకేటీస్(Hipprocates), ఆధునిక వైద్యంకు తండ్రి, 400BCకాలం నుండినే జులుబు మరియు ఫ్లూ వంటి జబ్బుల నివారణకు ఆపిల్ సైడర్ వెనిగార్ ను తేనెతో కల్పి ఇవ్వవొచ్చని సిఫారస్ చేశారు. అప్పటి నుండి, వివిధ రకాల వ్యాధులను నివారించడం కోసం ఈ యాపిల్ సైడర్ వెనిగార్ ను ఉపయోగించడం కొనసాగించారు. ఇంకా రొమన్స్ మరియు జపనీస్ సమురాయ్ యోధులు కూడా ఆరోగ్యం, బలం మరియు శక్తి కోసం ఆపిల్ సైడర్ వెనిగార్ ను ఉపయోగించారు .

ఆపిల్ సైడర్ వెనిగర్ లో హీలింగ్ ప్రొపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. అందుకోసం దీన్ని నేరుగా తీసుకోకూడదని, నీటీతో మిక్స్ చేసి తీసుకోవడం లేదా ఆహార పదార్థాలకు డ్రెస్సింగ్ గా అలంకరించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది . ఆపిల్ సైడర్ వెనిగర్ ను రెగ్యులర్ గా ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ముక్కు దిబ్బడ నివారిస్తుంది:

ముక్కు దిబ్బడ నివారిస్తుంది:

వర్షకాలంలో జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నివారించబడుతాయి.

జీర్ణ సమస్యలుండవు:

జీర్ణ సమస్యలుండవు:

ఆరోగ్య సమస్యల్లో అజీర్తి ఒకటి. ఆపిల్ సైడర్ వినెగార్ లో ఉన్న ఎసిటిక్ యాసిడ్, పిండిపదార్థాల జీర్ణాక్రియ వేగాన్ని తగ్గిస్తుంది, ఫలితంగా రక్తప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఆపిల్ సైడర్ వినెగార్ లో ఉన్న పెక్టిన్ , శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. కొందరు వ్యక్తుల్లో ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే పెక్టిన్ అలెర్జీని కలిగించవచ్చు. అటువంటి వారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.

హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

పొటాషియం, మెగ్నీషియం మరియు ఇతర ఖనిజాలు ఆపిల్ వినెగార్ పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం శరీరంలోని నీటిని సంతులనం చేస్తుంది. మరియు ఒక ఆరోగ్యకరమైన గుండె లయ నిర్వహిస్తుంది. మెగ్నీషియం, ఎంజైమ్ ల కార్యకలాపాలకు ఉత్ప్రేరంగా ఉండి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. మరియు శరీరంలో ఎముకలకు కావల్సిన కాల్షియంను చేరవేయడానికి సహాయపడుతుంది.

ఆస్టియో ఆర్థరైటిస్:

ఆస్టియో ఆర్థరైటిస్:

ఆస్టియో ఆర్థరైటిస్ శరీరం లో యాసిడ్ క్రిస్టల్ పెరగడానికి కారణంఅవుతుంది, మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ దీన్ని కనబడనీయకుండా చేసి శరీరం యొక్క pH బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఇటువంటి కేసులకు ఇప్పటికి వరకూ ఎటువంటి గణనీయమైన శాస్త్రీయ ఆధారం లేదు. కానీ డాక్టర్ జార్విస్ జాబితాలో అతని సంరక్షణలో కొందరు పేషంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్ నుండి విజయవంతంగా కోలుకోవడం జరిగింది.

ఇమ్యూనిటి పెంచుతుంది

ఇమ్యూనిటి పెంచుతుంది

ఆపిల్ సైడర్ వినెగార్ బీటాకెరోటిన్ కలిగి ఉండి, ఇది మాయో క్లినిక్ ప్రకారం యాంటిఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుండి డ్యామేజ్ కాకుండా ప్రతిపక్షకారినిగా ఉంటుంది. మరియు మీ నిరోధక వ్యవస్థ పెంచడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గుట

బరువు తగ్గుట

యాపిల్ సైడర్ వినేగర్ మీ శరీరంలోని అధిక కొవ్వు కరిగించి బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. అదనపు కొవ్వును ఖర్చు చేయడంతోపాటు ఆకలి తగ్గిస్తుంది. దీనిలో ఉండే పెక్టిన్ అనే పదార్ధం కొవ్వును తొలగిస్తుంది. అధికంగా తీసుకుంటే తప్ప ఇది హానిలేనిది. మీకు కనుక దీని వాసన పడకపోతే, టాబ్లెట్ ల రూపంలో కూడా దీనిని వాడవచ్చు. జీర్ణం అవటం కూడా తేలిక అవుతుంది.

డయాబెటీస్

డయాబెటీస్

రక్తంలో షుగర్ స్ధాయిలను కూడా తగ్గిస్తుందని రీసెర్చిలో రుజువు చేయబడింది. గ్లూకోజ్ స్ధాయిలను తగ్గిస్తుంది కనుక దీనిని డయాబెటీక్ రోగులు తప్పక వాడవచ్చు. రాత్రి వేళ డిన్నర్ తీసుకునే ముందుగా ఒకటి లేదా రెండు స్పూన్లు యాపిల్ సైడర్ వినేగర్ తీసుకుంటే, మరుసటి రోజు ఉదయానికి రక్తంలో షుగర్ స్ధాయిలు తక్కువ ఉండటం గమనించవచ్చు. కనుక డయాబెటీస్ కు ఇది ఒక సహజ నివారణ. అయితే, అధికంగా తీసుకుంటే, గొంతులో మంటను కలిగిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్టరాల్

బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్టరాల్

యాపిల్ సైడర్ వినేగర్ ఆహారం బ్లడ్ ప్రెజర్ మరియు కొల్లెస్టరాల్ నివారణకు ఔషధంగా వాడవచ్చు. వారంలో 4 లేదా 5 రోజులపాటు ఈ ఆహారం తింటే, గుండె జబ్బులు కూడా రావని చెప్పవచ్చు. దీనిని కనుక మీరు అలాగే తీసుకోలేకపోతే, మీరు తినే ఇతర సలాడ్లలో కలిపి తినేయండి. అధికంగా తీసుకుంటే, అది మీ పంటి ఎనామిల్ ను నష్టపరచే అవకాశం కూడా ఉంది. ఈ ఆహార చిట్కాలు పాటించి కొవ్వు రహిత ఆరోగ్యకర శరీరాన్ని పొందండి. అది ఒక యాసిడ్ అని గుర్తించండి. అతి తక్కువ మొత్తాలలో మాత్రమే ఔషధంగా దానిని వాడండి.

 మొటిమలను నివారిస్తుంది :

మొటిమలను నివారిస్తుంది :

ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క యాంటీఇంఫ్లమేటరీ(శోథ నిరోధక) లక్షణాలు అధిక వేడిమి, సూర్యరశ్మి వల్ల కమిలిన చర్మానికి ఉపశమనం కలిగించడం కోసం దీన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. దీన్ని సలాడ్స్ తో కలిపి తీసుకొన్నా లేదా అలాగే తాగినా కూడా అంతర్గతంగా జీర్ణవాహికలోని ఇన్ల్ఫమేషన్ కూడా తగ్గిస్తుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

ఆపిల్ సైడర్ వెనగర్ హెయిర్ గ్రోత్ కు అద్భుతంగా సహాయపడుతుంది. ఇది పిహెచ్ లెవల్స్ పెంచుతుంది. తలలో ఈస్ట్ పెరగకుండా నివారిస్తుంది. వెనిగర్ లో ఉండే కెమికల్ లక్షణాలు చుండ్రు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

11 Things That Happen When You Drink Apple Cider Vinegar Before Breakfast

11 Things That Happen When You Drink Apple Cider Vinegar Before BreakfastDrinking apple cider vinegar every day will help improve digestion and cure many chronic illnesses, such as depression, fatigue, arthritis, and can lower blood pressure and cholesterol levels.
Story first published: Tuesday, July 26, 2016, 18:31 [IST]
Desktop Bottom Promotion