For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్ధకం నివారించే ఎఫెక్టివ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్

By Super
|

మలబద్దకం అనేది ప్రాణాంతకం కాకపోయినా.. ప్రాణంతీసేంత పెయిన్ ఉంటుంది. దీంతో బాధపడేవాళ్లు రకరకాలుగా ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ.. పరిష్కారం దొరక్క తీవ్ర ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే.. మలబద్ధకం నివారించడానికి సహజంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది.

మలబద్దకానికి కారణం అయ్యే టాప్ 10 ఆహారాలు మలబద్దకానికి కారణం అయ్యే టాప్ 10 ఆహారాలు

మలబద్ధకం కారణంగా.. రక్తస్రావం వంటి రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల శరీరంలో బ్లడ్ తగ్గిపోయే ఛాన్స్ లు కూడా ఉంటాయి. కాబట్టి రోజుకి రెండుసార్లు, లేదా కనీసం వారానికి మూడు సార్లు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు.

మలబద్దకం గురించి మీకున్న అపోహలను తొలగించుకోండిలా మలబద్దకం గురించి మీకున్న అపోహలను తొలగించుకోండిలా

సగటున ప్రతి ఒక్కరికీ.. 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ అవసరం ఉంటుంది. రోజుకి ఇంత మొత్తంలో ఫైబర్ పొందితే.. మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ ఒకేసారి ఇంత మొత్తాన్ని పెంచకూడదు. రోజు కొంత పరిమాణంలో ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువ నీళ్లు, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బీన్స్

బీన్స్

ఒక కప్పు బీన్స్ లో 10 గ్రాముల కంటే.. ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది.

లెంటిల్స్

లెంటిల్స్

లెంటిల్స్ నే కాయధాన్యాలుగా పిలుస్తారు. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పోరాడవచ్చు.

బఠానీలు

బఠానీలు

బఠాణీలు ఎక్కువగా తీసుకుంటే మీ మదర్ తిడుతున్నారా ? కానీ అలా చెబుతుంది విరేచనాలను అరికట్టడానికి. అయితే సరైన మోతాదులో బఠాణీలు తీసుకుంటే.. మలబద్ధకం నివారించవచ్చు.

బ్రోకలీ

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ఇది మలబద్ధకం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అవకాడో

అవకాడో

అవకాడోలు మలబద్ధకం నివారించడానికి మంచి ఫైబర్ ఫుడ్. నిమ్మతో కలిపి అవకాడో తీసుకోవడం వల్ల మలబద్ధకం ద్వారా వచ్చే నొప్పి కూడా నివారించవచ్చు.

పియర్స్

పియర్స్

అధిక నీటి శాతంతో పాటు ఫైబర్ పుష్కలంగా కలిగి ఉన్న పియర్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు నివారించడం చాలా తేలికైన పని.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ అయిన డేట్స్, ఫిగ్స్, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్స్ ద్వారా ఫైబర్ ఎక్కువగా పొందవచ్చు. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్యతో పోరాడవచ్చు.

ఓట్ మీల్

ఓట్ మీల్

ఓట్ మీల్ మలబద్ధకం పోరాడటానికి మరొక గొప్ప పరిష్కారమని చెప్పవచ్చు. దీని ద్వారా ఫైబర్ పొందడమే కాదు.. అధిక బరువును కూడా కోల్పోవచ్చు.

స్పినాచ్

స్పినాచ్

ఒక కప్పు స్పినాచ్ ద్వారా మలబద్దకం నివారించవచ్చు. ఎప్పుడైతే నొప్పితో బాధపడతారో ఆ సమయంలో ఒక కప్పు స్పినాచ్ తీసుకుంటే.. విటమిన్ కె కూడా పొందవచ్చు.

అరటిపండు

అరటిపండు

మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నప్పుడు మూడు అరటిపండ్లు తీసుకుంటే.. త్వరిత ఉపశమనం ఉంటుంది.

చాయ్ సీడ్

చాయ్ సీడ్

చాయ్ సీడ్ తో మలబద్ధకం నివారించడం చాలా తేలిక. చాయ్ సీడ్ నానబెట్టి తీసుకున్నా.. అలానే తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్

క్యారెట్

పచ్చి క్యారెట్స్, వేయించిన క్యారెట్స్, ఉడికించిన క్యారెట్స్.. ఏవి తీసుకున్నా వీటి ద్వారా ఫైబర్ అందుతుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మలబద్ధకం నివారించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

English summary

12 Fibre Rich Foods To Fight Constipation

12 Fibre-Rich Foods To Fight Constipation. Constipation can be dealt with naturally. It can be treated by consuming high-fibre foods.
Desktop Bottom Promotion