For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ సీజన్లో హెల్తీగా ఉండటానికి 7 బెస్ట్ టిప్స్ ..!!

వింటర్లో సహజింగా ఫ్లూ, కోల్డ్, శ్వాస సంబంధిత సమస్యలను, సీజనల్ అలర్జీలు, మొదలగునివి బాధిస్తుంటాయి . అందుకే శీతాకాలంలోనూ సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈ కాలంలో ఆరో

|

వింటర్ సీజన్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వేడి వేడిగా ఆహారం తీసుకోవాలన్న కోరిక పెరుగూ ఉంటుంది. అయితే వేడి వేడి ఆహారం లాగించాలనుకోవడం మంచిదే..కానీ అది ఇంట్లో కాకుండా బయటి పదార్థాలకు, ముఖ్యంగా జంక్ ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు. పైగా ఈ కాలంలో చలికి ఆలస్యంగా నిద్రలేవడం వల్ల బ్రేక్ ఫాస్ట్ , లంచ్,..ఇలా అన్నీ ఆలస్యంగానే జరుగుతుంటాయి.

వీటికి తోడు 'అసలే బయట చలిగా ఉంటే ఇక వ్యాయామం ఏం చేస్తాంలే ..' అంటూ చాలా మంది ఎక్సర్ సైజ్ ను వాయిదా వేస్తుంటారు. చలికాలంలో ఎదురయ్యే ఇలాంటి పరిణామాల వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు . వింటర్లో సహజింగా ఫ్లూ, కోల్డ్, శ్వాస సంబంధిత సమస్యలను, సీజనల్ అలర్జీలు, మొదలగునివి బాధిస్తుంటాయి . అందుకే శీతాకాలంలోనూ సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈ కాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి ఆహారనియమాలు తీసుకోవాలి, ఇతర జాగ్రత్తలు గురించి కొన్ని తెలుసుకుందాం..

 టిప్ #1

టిప్ #1

వింటర్ సీజన్లో హెల్తీగా ఉండాలంటే, విటమిన్ సి మరియు జింక్ అధికంగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. విటమిన్ సి మరియు జింక్ అధికంగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్, గార్లిక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులతో పోరాడుతాయి.

టిప్ # 2:

టిప్ # 2:

వింటర్ సీజన్ లో కూడా వ్యాయామం తప్పనిసరి. వింటర్లో రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల , బాడీలో ఉష్ణోగ్రతలు పెరుగాయి. శరీరం వెచ్చగా ఉంటుంది. మెటబాలిజం రేటు పెరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వ్యాధులను నివారిస్తుంది.

టిప్ # 3:

టిప్ # 3:

వింటర్ సీజన్ లో ఎక్కువ ఆహారాలు తీసుకుంటారని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు. దాంతో వింటర్లో ఎక్కువ క్యాలరీలు అందుతాయి. కాబట్టి, మీరు తీసుకునే ఆహారాలు క్యాలరీల కౌంట్ ను తెలుసుకోవాలి. ఇవి బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతాయి.

టిప్ # 4:

టిప్ # 4:

వింటర్ సీజన్ లో హెల్తీగా ఉండాలంటే, రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ను అధికంగా తీసుకోవాలి. ఇవి వింటర్ లో వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి అవసరమయ్యే వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి.

టిప్ # 5 :

టిప్ # 5 :

రోజులో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సమ్మర్లో కంటే వింటర్ సీజన్లో ఇన్ఫెక్షన్స్ చాలా తర్వగా వ్యాప్తి చెందుతాయి. వింటర్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి హైజినిక్ టిప్స్ పాటించడం చాలా అవసరం. అలాగే హ్యాండ్ సానిటైజర్ కూడా ఉపయోగించాలి.

టిప్ # 6:

టిప్ # 6:

వింటర్లో కూడా సరిపడా నీళ్ళు తగాలి. దాహమేయటం లేదాని నీరు తాగడాన్ని మానేస్తుంటారు చాలమంది. కాబట్టి, వింటర్లో కూడా బాడీ హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి, డీహైడ్రేషన్ తగ్గించుకోవడానికి , వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారించుకోవడానికి, స్కిన్ డ్రై నెస్ ను నివారించుకోవడానికి రోజుకు సరిపడా నీళ్ళు తాగాలి.

టిప్ # 7 :

టిప్ # 7 :

వింటర్లో ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ ను కలిసి మల్టివిటమిన్ సప్లిమెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇవి వ్యాధినిరోధకతను పెంచుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తాయి.

English summary

7 Best Tips For Staying Healthy This Winter

After all the heat and sweat, the much awaited winter months are finally here, so along with looking forward for steaming cups of cocoa, you also need to follow a few winter health care tips to avoid ailments!
Desktop Bottom Promotion