For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అటెన్షన్ : బ్రేక్ ఫాస్ట్ లో వైట్ బ్రెడ్ తినే అలవాటుందా..?

|

బ్రేక్ ఫాస్ట్ లో వివిధ రకాల అల్ఫాహారాలను తీసుకుంటుంటాము. వాటిలో వైట్ బ్రెడ్ ఒకటి. వైట్ బ్రెడ్ అంటే చాలా మందికి ఇష్టం. అందుకే బ్రేక్ ఫాస్ట్ లో ఏదో ఒక రూపంలో బ్రెడ్ తింటుంటారు. అయితే ఇది శరీరం ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న విషయం మీకు తెలుసా..? ఆకలి వేసిందా..వైట్ బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొచ్చామా, టోస్ట్ చేసి బట్టర్ అప్లై చేసి, బ్రేక్ ఫాస్ట్ గా లాగించేశామా అన్నట్టు ఉంటారు కొంతమంది. ఇది చాలా సులభ పద్దతి కాబట్టి, దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా ఎంపిక చేసుకొనే వారి సంఖ్య ఎక్కువే...అయితే దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుందన్న విషయం మీకు తెలుసా...?

వివిధ రకాల బ్రెడ్ లలో గుండె ఆరోగ్యానికి ఏ బ్రెడ్ మేలు...?

రెగ్యులర్ గా వైట్ బ్రెడ్ తినడం వల్ల..మనకు తెలియని అనేక దుష్ప్రభావాలు ఈ వైట్ బ్రెడ్ లో దాగి ఉన్నాయి. . వైట్ బ్రెడ్ తినడానికి టేస్టీగా ఉండవచ్చు. ముఖ్యంగా వైట్ బ్రెడ్ లో కొంత షుగర్ జోడించి మరియు టోస్ట్ చేసుండవచ్చు. వైట్ బ్రెడ్ ను రిఫైండ్ ఫ్లోర్ తో తయారుచేస్తారు. అంటే ఇందులో ఉండే అన్ని ప్రయోజనాలను(న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్)మొత్తం తొలగించి ప్రొసెస్ చేసి తయారుచేస్తారు.

బ్రెడ్ ఎక్కువ తినకూడదనడానికి, ఇవే ప్రధాన కారణాలు

ఈ వైట్ రిఫైండ్ ఫ్లోర్ ను మైదా అని పిలుస్తుంటారు మరియు ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాల హానికరమైన ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటుంది. వైట్ బ్రెడ్ లో 100శాతం మైదాతో తయారుచేయబడి ఉంటుంది కాబట్టి, దీన్ని ఖచ్చితంగా నివారించాలి. బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమా?

మన శరీరానికి ఫైబర్ ఎక్కువగా అవసరం అవుతుంది . కాబట్టి, బైట్ బ్రెడ్ కు బదులుగా కేవలం తృణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ ను మాత్రమే తీసుకుంటే మంచిది. మీకు బ్రేక్ ఫాస్ట్ తయారుచేయడానికి సమయం లేనప్పుడు తృణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ ను తీసుకోవడం ఒక బెస్ట్ ఆప్షన్....మరి రెగ్యులర్ గా వైట్ బ్రెడ్ తింటే ఏమవుతుందో చూద్దాం...

బరువు పెరుగుతారు:

బరువు పెరుగుతారు:

ప్రతి రోజూ రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ లో వైట్ బ్రెడ్ తినడం వల్ల ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ తో పాటు బరువు కూడా పెరుగుతారు . వైట్ బ్రెడ్ మిమ్మల్ని ఫ్యాట్ గా మార్చుతుంది మరియు రోజంతా ఆకలివేస్తూనే ఉంటుంది.

బద్దకంగా అనిపిస్తుంటుంది:

బద్దకంగా అనిపిస్తుంటుంది:

రాత్రంతా మంచి నిద్రపట్టినా, వైట్ బ్రెడ్ ఎఫెక్ట్ వల్ల రోజంతా నిద్రమత్తుగా అలసటగా ఫీలవుతుంటారు. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల రోజంతా లేజీగా ఫీలవుతుంటారు. అందుకు కారణం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడం వల్ల అంతరాయం కలుగుతుంది.

డయాబెటిస్:

డయాబెటిస్:

వైట్ బ్రెడ్ డయాబెటిస్ రిస్క్ ను పెంచుతుంది. వైట్ బ్రెడ్ బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం వల్ల మనకు తెలియకుండానే డయాబెటిస్ కు గురిచేస్తుంది . అలాగేడయాబెటిస్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు ఊబకాయానికి కూడా దారితీస్తుంది.

ఎప్పుడూ ఆకలేస్తుంటుంది:

ఎప్పుడూ ఆకలేస్తుంటుంది:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల రోజంతా ఆకలి అవుతున్నట్లే ఫీలింగ్ కలుగుతుంది. దాంతో హై షుగర్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ మీద ఎక్కువ కోరికలు కలుగుతాయి. అందుకు కారణం వైట్ బ్రెడ్ మీకు పొట్ట నిండిన భావన కల్పించకపోవడమే. మరియు లేజీగా ఫీలవ్వడంతో పాటు, ఎక్కువ ఆకలి కలుగుతుంది.

షార్ట్ టెంపర్ కు గురిచేస్తుంది:

షార్ట్ టెంపర్ కు గురిచేస్తుంది:

వైట్ బ్రెడ్ మిమ్మల్ని మూడీగా మార్చుతుంది మరియు తరచూ షార్ట్ టెంపర్ కు గురిచేస్తుంది. రెగ్యులర్ గా వైట్ బ్రెడ్ తినడం వల్ల బ్రెయిన్ లో విడుదలయ్యే హ్యాపీ కెమికల్స్ (సెరోటనిన్)మీద దుష్ప్రభావం చూపుతుంది . ఇంకా వైట్ బ్రెడ్ తినడం వల్ల కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది.

మలబద్దకం:

మలబద్దకం:

వైట్ బ్రెడ్ ను రిఫైండ్ ఫ్లోర్ తో తయారుచేయడం వల్ల ఇందులోలో ఫైబర్ ఉండదు . ఫైబర్ లోపం వల్ల శరీరం మలబద్దానికి దారి తీస్తుంది . ఫైబర్ ప్రేగుల్లో నీటిని నింపుతుంది . దాంతో బౌల్ మీద ప్రెజర్ పడి, బౌల్ మూమెంట్ సులభం అవుతుంది.

కొలెస్ట్రాల్ ఎక్కువ:

కొలెస్ట్రాల్ ఎక్కువ:

వైట్ బ్రెడ్ తృణధాన్యాల పౌడర్ తో తయారుచేయరు మరియు రిఫైన్ ఫ్లోర్ తోతయారుచేయడం వల్ల ఫైబర్ తక్కువగా ఉంటుంది . ఫైబర్ తక్కువ అవ్వడం వల్ల శరీరంలో బ్యాడ్ ఫ్యాట్ ను తగ్గి హైబ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది . మరియు దాంతో హార్ట్ రిలేటెడ్ సమస్యలు పెరుగుతాయి.

English summary

7 Things That Happen When You Eat White Bread Daily

7 Things That Happen When You Eat White Bread Daily,White bread is a favourite food for many during breakfast. However, do you know how this time-saver food can mess up your health for good. It is true that grabbing a packet of white bread, toasting and applying butter on it can be the easiest possible breakf
Story first published: Thursday, January 21, 2016, 18:27 [IST]
Desktop Bottom Promotion