For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం బెస్ట్..!ఎందకంటే..?

కాలానుగుణంగా వచ్చే జామకాయల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిలో పీచు, విటమిన్లు, ప్రొటీన్లు బాగా లభిస్తాయి. ఆరోగ్య సమస్యల బారినపడకుండా కాపాడతాయి. రోగనిరోధకశక్తిని పెంపొందించే విటమిన్‌ సి జామలో అధిక మోత

|

జామకాయల సీజన్ వచ్చేసింది, మార్కెట్లో ఎక్కడ చూసినా జామకాయలే...వింటర్ సీజన్ వచ్చిందంటే రోడ్ సైడ్ బడ్లలో ఎక్కడ చూసినా జామపండ్లే కనబడుతాయి. వింటర్ జామకాయల సీజన్. మన ప్రాంతంలో ఇళ్లు మొదలుకొని పెరండ్ల వరకు ప్రతిచోటా అందుబాటులో ఉండడం వల్ల సహజంగానే జామకాయ అంటే మనకు చిన్నచూపు. కానీ పది ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం బెస్ట్ అంటారు పోషకాహారనిపుణులు. ఒకప్పుడు ఇంటికో జామ చెట్టు ఉండేది. కానీ పట్టణీకరణ, కాంక్రీట్ జంగళ్ల పుణ్యమా అని ఇప్పుడు జామకాయలు కొని తినాల్సిందే!

ఆపిల్‌తో పోలిస్తే జామపండులో పోషకాలు మెండు. తరుచూ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సంత్రా(కమలాపండు)తో పోల్చి చూసినా జామపండులో ఐదు రెట్లు అధికంగా విటమిన్-సి ఉంటుంది. కిలో ఆకుకూరలో కంటే రెండింతల పీచుపదార్థం కి లో జామపండ్లలో లభిస్తుంది. ఇంకా జామలో కొవ్వు, కేలరీలు తక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, పేగులను శుభ్రపరుస్తుంది. జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచుపదార్థం ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారూ తినవచ్చు. జామకాయలో ఉండే పీచుపదార్థం వల్ల మలబద్దకం దూరమవుతుంది.

గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..

కాలానుగుణంగా వచ్చే జామకాయల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిలో పీచు, విటమిన్లు, ప్రొటీన్లు బాగా లభిస్తాయి. ఆరోగ్య సమస్యల బారినపడకుండా కాపాడతాయి. రోగనిరోధకశక్తిని పెంపొందించే విటమిన్‌ సి జామలో అధిక మోతాదులో ఉంటుంది. ఇది నారింజ పండ్లలో దొరికే దానికన్నా నాలుగురెట్లు ఎక్కువ. ఇందులో ఉండే మెగ్నీషియం ఆందోళనను దూరం చేస్తుంది. విటమిన్‌ ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల దృష్టిలోపాలు దూరమవుతాయి.

ఇందులో ఉండే విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, ఫైబర్లు, ఫ్లవనాయిడ్లు, బీటాకెరొటిన్‌, ల్యూటిన్లు క్యాన్సర్‌ కారకాలు, కణతులు వ్యాప్తి చెందకుండా కాపాడతాయి. లోపల ఎర్రగా ఉండే జామకాయలు క్యాన్సర్‌ నివారణలో మరింత తోడ్పడతాయి. వీటిలో ఉండే ఫైబర్లు డయాబెటిక్‌ నివారణకు తోడ్పడతాయి. మలబద్ధకాన్నీ తొలగిస్తాయి. శరీరంలో సోడియం, పొటాషియం పరిమాణాన్ని సమపాళ్లలో ఉంచి రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపయోగపడుతుంది. వీటితో పాటు మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం..

హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

జామకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. దాంతో హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు.

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణశక్తిని పెంచుతుంది:

జామకాయలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, కాబట్టి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో బెస్ట్ ఫ్రెండ్ వంటిది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్ లెవల్ మెరుగుపరుస్తుంది:

కొలెస్ట్రాల్ లెవల్ మెరుగుపరుస్తుంది:

జామకాయలు రెగ్యులర్ గా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ కంట్రోల్లో ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది.

హార్ట్ కు మంచిది:

హార్ట్ కు మంచిది:

జామకాలో శరీంలో సోడియం, పొటాషియం కంటెంట్ బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేయడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది.

మజిల్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది:

మజిల్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది:

జామకాయలో విటమిన్స్, మినిరిల్స్ వంటి వివిధ రకాల న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి .ఇవి మజిల్స్ ను బలోపేతం చేస్తుంది. మజిల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

జామకాయల్లో ఉండే విటమిన్ సి, వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

డయాబెటిస్ :

డయాబెటిస్ :

జామకాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. కాబట్టి, దీన్నిడయాబెటిస్ వారు కూడా గ్రేట్ గా తీసుకోవచ్చు.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

జామకాయలో యాంటీఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్, ఫైటోన్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ కు కారణమయ్యే ఆక్సిజన్ ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది.

English summary

8 Amazing Reasons You Should Eat Guavas!

It's the season of guavas and we can find vendors selling them on the roadside and they are also available across the retail markets. So the next time you go to the market make sure to buy few of those guavas and make it a point to eat them.
Desktop Bottom Promotion