For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాయామం చేసేవాళ్లు కంపల్సరీ తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్..!

By Swathi
|

వ్యాయామం, వాకింగ్, రన్నింగ్, జాగింగ్.. ఇలా ఏదో ఒకటి చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. వ్యాయామం చేస్తే చాలు హెల్తీగా ఉంటామని భావిస్తే పొరపాటు. ఎక్సర్ సైజ్ తో పాటు.. శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందివ్వాలి. వర్కవుట్ కి తగ్గట్టు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పుడే.. ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు.

జిమ్ లో స్వెట్టింగ్ ఎక్కువగా వస్తే.. ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారని చాలా మంది భావిస్తారు. అది నిజమే. రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేయడమనేది చాలా మంచి హ్యాబిట్. అయితే హెల్తీగా ఉండటానికి వ్యాయామంతో పాటు.. పోషకవిలువలతో కూడిన డైట్ ఫాలో అవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

హెల్తీ డైట్ ఫాలో అవడం వల్ల.. వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చట. కాబట్టి.. వ్యాయామం చేసేవాళ్లు తీసుకోవాల్సిన హెల్తీ డైట్ ఏంటి ? ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం...

ఫ్రూట్స్

ఫ్రూట్స్

ఫ్రూట్స్ చాలా అద్భుతమైన ఎనర్జీ బూస్టర్. అవి వ్యాయామం చేసేటప్పుడు మిమ్మల్ని ఎనర్జిటిక్ గా మారుస్తాయి. తేలికగా జీర్ణమయ్యే పండ్లు అంటే అరటిపండ్లు, యాపిల్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది.

తీసుకోకూడని ఫ్రూట్స్

తీసుకోకూడని ఫ్రూట్స్

వ్యాయామం చేసేవాళ్ల డైట్ లో సిట్రస్ ఫ్రూట్స్ కి నో చెప్పాలి. ఇవి జీర్ణమవడానికి సమయం పడుతుంది. అలాగే.. కండరాల నొప్పులకు కారణమవుతాయి.

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్ బెస్ట్ ఎనర్జీ డ్రింక్ అని అధ్యయనాలు చెబుతున్నాయి. టమోటాల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల వ్యాయామం చేసేవాళ్లకు ఇవి చాలా ముఖ్యం. వ్యాయామం తర్వాత కూడా ఎనర్జిటిక్ గా, హెల్తీగా ఉండటానికి టమోటా జ్యూస్ సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఓట్స్

ఓట్స్

వ్యాయామం చేసేవాళ్ల డైట్ లో చేర్చుకోవాల్సిన హెల్తీ ఫుడ్స్ లో ఓట్స్ ఒకటా. బరువు తగ్గడానికి ఓట్స్ బాగా సహాయపడతాయి. ఓట్ మీల్ ని లో ఫ్యాట్ మిల్క్ తో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే వ్యాయామానికి రెండు, మూడు గంటల ముందు తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల వ్యాయామం సమయంలో.. మీ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయి.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

తృణధాన్యాలు కూడా వ్యాయామం చేసేవాళ్లకు చాలా అవసరం. ఇవి జిమ్ లో మరింత ఎఫెక్టివ్ గా వర్క్ అవుట్ చేయడానికి సహాయపడతాయి. వీటిల్లో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మెటబాలిజంను ప్రోత్సహిస్తాయి.

యోగర్ట్

యోగర్ట్

ఫ్యాట్ తక్కువగా ఉండే యోగర్ట్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల.. ఎక్సర్ సైజ్ వల్ల పొందే ఫలితాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి డైలీ డైట్ లో దీన్ని కంపల్సరీ చేర్చుకోవాలి. సాధారణ పెరుగు కంటే ఇందులో రెట్టింపు ప్రొటీన్స్ ఉంటాయి. మంచి కార్బొహైడ్రేట్స్ అందుతాయి. కాబట్టి.. వ్యాయామం చేసేవాళ్లు యోగర్ట్ ని డైట్ లో చేర్చుకుంటి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.

అల్లం

అల్లం

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి అల్లం సహాయపడుతుంది. అలాగే వ్యాయామం వల్ల వచ్చే కండరాల నొప్పి తగ్గించడంలో అల్లం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని స్టడీస్ చెబుతున్నాయి. అల్లం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరగడం, నొప్పి, ఇన్ల్ఫమేషన్ తగ్గడం జరుగుతుందని.. స్టడీస్ చెబుతున్నాయి.

చికెన్, ఎగ్స్, ఫిష్

చికెన్, ఎగ్స్, ఫిష్

చికెన్, ఎగ్స్ శరీరానికి కావాల్సిన కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్ అందిస్తాయి. వ్యాయామం చేసేవాళ్ల కండరాల ఆరోగ్యానికి ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్ చాలా అవసరం. ఫిష్ కూడా.. శరీరంలో ప్రొటీన్ కంటెంట్ని పెంచుతుంది.

లిక్విడ్ మీల్స్

లిక్విడ్ మీల్స్

లిక్విడ్ మీల్స్ లో రకరకాల విటమిన్స్, మినరల్స్, మంచి క్యాలరీలు ఉంటాయి. ఇవి వ్యాయామం చేసేవాళ్ల శరీరానికి చాలా అవసరం.

English summary

8 Common Foods That Surprisingly Help Boost Your Workout

8 Common Foods That Surprisingly Help Boost Your Workout. To stay healthy you need to balance your exercise routine with a nourishing diet.
Story first published: Wednesday, May 11, 2016, 13:18 [IST]
Desktop Bottom Promotion