For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు ఎట్టిపరిస్థితుల్లో తినకూడని ఆహారాలు !!

By Swathi
|

కీళ్ల నొప్పులు ఉంటే.. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎటు కదల్లేక, నడవలేక, కూర్చుంటే లేవలేక, మెట్లు ఎక్కలేక.. ఇలా రకరకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వ్యాయామం, ఎక్కువ దూరం నడవడం వంటి పనులు ఏమాత్రం చేయలేరు. కండరాలు, టిష్యూస్ చుట్టూ ఇన్ల్ఫమేషన్ కారణంగా జాయింట్ పెయిన్ ఏర్పడుతుంది.

మోకాలి నొప్పులను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

సాధారణంగా మోకాళ్లు, భుజాల కీళ్లు, మడిమల దగ్గర ఉండే కీళ్లు ఇలాంటి ప్రాంతాల్లో నొప్పులు బాధిస్తాయి. కండరాలకు సంబంధించిన ఈ వ్యాధి.. కీళ్ల స్టిఫ్ నెస్, నొప్పికి కారణమవుతాయి. దీన్నే ఆర్థరైటిస్ అని పిలుస్తారు. ఓస్టియోపోరోసిస్, వైరల్ ఇన్ఫెక్షన్స్, వ్యాయామం చేయకపోవడం, పోషకాహార లోపం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తాయి.

కీళ్ల నొప్పులు నివారించడానికి మందులు, స్ప్రేలు, ఆయింట్ మెంట్స్, మసాజ్, ఫిజియో థెరపీ వంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు హెల్తీ డైట్, వ్యాయామం చేయడం వల్ల చాలావరకు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే కొన్ని రకాల ఆహారాలు.. కీళ్ల నొప్పులను మరింత ఎక్కువ చేస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఉండే వాళ్లు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్టిఫిషియల్ షుగర్స్

ఆర్టిఫిషియల్ షుగర్స్

కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు.. ఎక్కువ మొత్తంలో ఉండే ఆర్టిఫిషియల్, ప్రాసెస్డ్ షుగర్స్ తీసుకోకూడదు. ఇలాంటివి బరువు పెరగడానికి కారణమై.. జాయింట్స్ పై ఒత్తిడి పెంచుతాయి.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్ లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ప్రొటీన్స్ తీసుకోవడం వల్ల కండరాలపై దుష్ర్పభావం చూపి, ఇన్ల్ఫమేషన్, నొప్పికి కారణమవుతాయి. అలాగే బరువు పెరగడానికి కూడా కారణమవవచ్చు.

ప్రాసెస్డ్ మీట్

ప్రాసెస్డ్ మీట్

ప్రాసెస్డ్ మీట్ లేదా రెడ్ మీట్ లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. నైట్రిట్స్, ప్యూరిన్స్ ఇన్ల్ఫమేషన్ ని పెంచుతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లకు ఇది మరింత దుష్ర్పభావం చూపుతాయి.

టమోటాలు

టమోటాలు

టమోటాల్లో ఎక్కువ యురిక్ యాసిడ్ ఉంటుంది. జాయింట్ పెయిన్ పెరగడానికి, ఇన్ల్ఫమేషన్ కి కారణమవుతాయి. కాబట్టి వీటిని తీసుకోకూడదు.

షెల్ ఫిష్

షెల్ ఫిష్

షెల్ ఫిష్ లో కూడా ప్యూరిన్స్ ఉంటాయి. ఇవి యురిక్ యాసిడ్ లా మారుతాయి. ఎప్పుడైతే యురిక్ యాసిడ్ మీ శరీరంలో పెరుగుతుందో.. ఇన్ల్ఫమేషన్, నొప్పి పెరుగుతాయి.

ఎగ్స్

ఎగ్స్

రోజూ ఎగ్స్ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డులోని పచ్చసొనలో అరచిడోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్ల్ఫమేషన్ కి కారణమవుతుంది.

వెజిటబుల్ ఆయిల్

వెజిటబుల్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కార్న్ ఆయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్ లో.. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీరు బరువు పెరగడానికి, కీళ్ల నొప్పులు, ఇన్ల్ఫమేషన్ కి కారణమవుతాయి.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ కి సంబంధింిన బీర్ వంటివాటిలో యురిక్ యాసిడ్ ఉంటుంది. అది ఇన్ల్ఫమేషన్, జాయింట్ పెయిన్ కి కారణమవుతాయి. శరీరంలో నొప్పికి కారణమవడమే కాకుండా.. నొప్పి నుంచి ఉపశమనం పొందే సత్తా కోల్పోతాం.

రిఫైన్డ్ సాల్ట్

రిఫైన్డ్ సాల్ట్

ఫాస్పరస్, సిలికాన్ రిఫైన్డ్ సాల్ట్ లో ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రత కోల్పోవడానికి కారణమవుతాయి. దీనివల్ల ఎముకలు మరింత బలహీనమవుతాయి. అలా కీళ్ల నొప్పులకు కారణమవుతాయి. కాబట్టి రిఫైన్డ్ సాల్ట్ కి దూరంగా ఉండాలి.

English summary

9 Foods To Stay Away From If You Have Joint Pain

9 Foods To Stay Away From If You Have Joint Pain. Here is a list of foods that you can stay away from if you have a joint pain.
Story first published:Thursday, April 28, 2016, 16:46 [IST]
Desktop Bottom Promotion