For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటోల్లో మీరు ఊహించని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్

|

మన ఇండియన్ వంటగదుల్లో టమోటో లేకుంటే ఏదో వెలితిగా ఉంటుంది!. మన నిత్యవసర ఆహారాల్లో టమోటోలు కూడా ఒకటి . మన ఇండియన్ వంటకాల్లో టమోటలను విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా టమోటల యొక్క స్వీట్ అండ్ ట్యాంగీ టేస్ట్ వల్ల వంటలకు అదనపు రుచి మరియు వాసన కలిగి నోరూరిస్తుంటుంది. అంతే కాదు టమోటోలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. !

ప్రతి ఒక్కరికీ సహాయపడే టమోటో హెల్త్ బెనిఫిట్స్

టమోటోలను పచ్చిగా లేదా ఉడికించి తిన్నా, ఇతర సలాడ్స్, సూప్స్ రూపంలో తీసుకొన్నా...ఏవిధంగా తీసుకొన్నా, మన శరీరానికి అనేక రకాల విటమిన్స్, మినిరల్స్, డైటరీ ఫైబర్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి . అయితే టమోటోలను ఒక పరిమితంగా మాత్రమే వాడుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే టమోటోలను పరిమితికి మించి వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీస్తుంది.

ముఖ సౌందర్యానికి టమోటో రసాన్ని ఎలా ఉపయోగించాలి..

టమోటలను ఎక్కువగా వినియోగించడం వల్ల కొన్ని ప్రమాదకరమైన లేదా మరీ అంత ప్రమాదం లేని సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. మరి టమోటోలను అతిగా ఉపయోగించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుంటాం...

వ్యాధినిరోధకతలో అసమతౌల్యం :

వ్యాధినిరోధకతలో అసమతౌల్యం :

ఫ్రెష్ గా టమోటోల్లో కెరోటినాయిడ్స్ మరియు లికోపిన్ అనే కంటెంట్స్ ను కనుగొనడం జరిగింది. ఇవి కెమికల్ కాంపౌడ్స్ గా సూచిస్తారు . ఇవి క్యాన్సర్ ను దూరం చేస్తాయి. కానీ ఫైటో కెమికల్స్ ఎక్సెస్ గా తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ లో అవకతవకలు ఏర్పడుతాయి . లేదా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది . దాంతో మన శరీరం బ్యాక్టీరియల్ మరియ వైరల్ డిసీజ్ లను తట్టుకొనే శక్తి తగ్గిపోతుంది.

గ్యాస్ట్రో ఇంటెన్సినల్ సమస్యలు:

గ్యాస్ట్రో ఇంటెన్సినల్ సమస్యలు:

పొట్ట సంబంధిత సమస్యలకు గురి అవుతారు. ఎందుకంటే టమోటోల్లో ఉండే అసిడిక్ నేచర్ వల్ల , ఎక్కువ టమోటలను వాడటం వల్ల గ్యాస్ట్రో ఇంటెన్షినల్ డిజార్డర్స్ కు గురికావల్సి వస్తుంది. అసిడిక్ రిఫ్లెక్షన్ కు గురిచేస్తుంది . పొట్టలు జీర్ణ రసాలను ఎక్కువగా స్రవించేలా చేస్తుంది. దాంతో హార్ట్ బర్న్ , చాతీలో మరియు పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది.

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్:

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్:

చీకాకు కలిగించే ప్రేగు డిజార్డర్స్ : టమోటోల్లో ఉండే లికోపిన్ కంటెంట్ కొన్ని ప్రమాదకర ప్రేగు సమస్యలకు గురిచేస్తుంది . ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వాటికి గురి చేస్తుంది. ప్రేగుల్లో నొప్పి , పొట్టఉదరంలో గ్యాస్, అజీర్తి, కడుపుబ్బరం మొదలగు ప్రేగు సంబంధిత సమస్యలకు గురిచేస్తుంది . దాంతో వికారం ,వాంతులు మరియు డయోరియాకు గురిచేస్తుంది.

కిడ్నీ స్టోన్స్:

కిడ్నీ స్టోన్స్:

టమోటోల్లో విత్తనాలు ఉంటాయి . వీటిలో ఎక్కువగా క్యాల్షియం, మరియు ఆక్సాలేట్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి . ఇదివరకూ చిన్న చిన్న కిడ్నీ సమస్యలతో బాధపడే వారు , ఈ కాంపౌడ్స్ ను జీర్ణించుకోవడం కష్టం అవుతుంది . కాబట్టి, టమోటోలను పెద్దమొత్తంలో తీసుకోవడం వల్ల క్యాల్షియం మరియు ఆక్సాలేట్స్ కిడ్నీలో చేరి స్టోన్స్ గా మారుతాయి.

 ప్రొస్టేట్ క్యాన్సర్ :

ప్రొస్టేట్ క్యాన్సర్ :

టమోటోల్లోని విత్తనాల్లో లికోపిన్ మేల్ ప్రొస్టేట్ గ్రంథుల్లో అబ్ నార్మలీటిస్ కు గురిచేస్తుంది . ఇలా జరగడం వల్ల మగవారిలో పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది . ఈ పరిస్థితిలో నొప్పి, అంగస్తంభన లోపాలు, యూరిన్ లో అసౌకర్య మొదలగు సమస్యలకు దారితీస్తుంది . కొన్ని సందర్భాల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కు కారణం అవుతుంది.

విటమిన్స్ అధికం అవుతాయి :

విటమిన్స్ అధికం అవుతాయి :

టమోటో విటమిన్ రిచ్ ఫుడ్ . మీడియం సైజ్ టమోటోలను తినడం వల్ల 1025 ఐయు విటమిన్ ఎ మరియు 17ఎంజి విటమిన్ సి శరీరానికి అందుతుంది . ఎక్సెస్ విటమిన్స్ వల్ల బాడీకి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీస్తుంది . రోజులో ఎక్కువ టమోటోలను తినడం వల్ల తలనొప్పి, వికారం, కిడ్నీ నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది.

న్యూట్రీషియన్ లోపం:

న్యూట్రీషియన్ లోపం:

టమోటోల నుండి ఎక్కువ విటమిన్స్ పొందనప్పుడు, శరీరంలో ఇతర అవసరమౌన పోషకాలను కోల్పోతారు . ఇది శరీరంలో డ్యామేజ్ కు గురిచేసి , డైలీ యాక్టివిటీస్ ను చురుగా చేయలేకుండా చేస్తాయి.

అలర్జిక్ రియాక్షన్:

అలర్జిక్ రియాక్షన్:

టమోటోల్లో ఉండే లైకోపిన్ అలర్జీని కూడా కలిగిస్తుంది . లైకోపిన్ అలర్జీ లక్షణాలు దురద, రాషెస్, ఛాతీలో మంట, లేదా ఇబ్బందిగా ఉండటం, పెదాల వాపు, హార్ట్ బర్స్, కళ్ళు మంటలు మరియు ఇతర కొన్ని అలర్జిక్ లక్షణాలు కనబడుతాయి.

 స్కిన్ కలర్ మారుతుంది:

స్కిన్ కలర్ మారుతుంది:

స్కిన్ కలర్ మారుతుంది: టమోటలను ఎక్కువగా ఉపయోగించడం మరియు దీర్ఘ కాలం ఉపయోగించడం వల్ల, భవిష్యత్తులో చర్మ రంగులో మార్పు వస్తుంది . లైట్ ఆరెంజ్ కలర్ లో మారుతుంది .

టమోటోలు తిన్నంత మాత్రాన సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. అయితే పరిమితికి మించి తినకూడదని సూచన మాత్రమే...ఈ సైడ్ ఎఫెక్ట్స్ ను గుర్తు పెట్టుకొని, మితంగా వాడుకొని మీ టేస్ట్ బడ్స్ ను సాటిస్ ఫై చేయండి....

English summary

9 Serious Side Effects Of Tomatoes

9 Serious Side Effects Of Tomatoes,The Indian kitchen is incomplete without tomatoes! No wonder a rise in the price of tomatoes sends us into a tizzy! An integral part of the Indian cuisine, tomatoes offer color, flavor, and a number of health benefits!
Story first published: Friday, May 6, 2016, 16:06 [IST]
Desktop Bottom Promotion