For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైస్ వాట‌ర్‌తో మైండ్ బ్లోయింగ్ బెన్ఫిట్స్

By Swathi
|

రైస్ వాటర్ ! ఇది ఎంతో మందికి ఆకలి తీర్చే ఆహారం. పల్లెటూర్లలో ఇప్పటికీ చాలామంది రైస్ వాటర్ తో కడుపు నింపుకుంటూ ఉంటారు. అయితే ఈ నీటి ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇకపై మీరు కూడా రెగ్యులర్ గా రైస్ వాటర్ తీసుకోకమానరు.

బియ్యం నీళ్లు చాలా మ్యాజికల్ గా పనిచేస్తాయి. పూర్వం రైస్ వాటర్ తో చైనీస్ ట్రీట్మెంట్ చేసేవాళ్లట. ఇది శరీరానికి ఎనర్జీని, హెల్తీ స్కిన్ ని, షైనీ హెయిర్ ని అందిస్తుంది. చీప్ గా దొరికే మంచినీళ్లు, బియ్యం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, అందమైన, సున్నితమైన చర్మం పొందవచ్చు. ఎందుకంటే... ఇందులో కాస్మొటిక్, హెల్త్ బెన్ఫిట్స్ ఉండటమే ఇందులోని మిరాకిల్.

ఆరోగ్యానికి

ఆరోగ్యానికి

ఈ నీటిని తీసుకుంటే.. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తితో పాటు ఏకాగ్రతను పెంచుతాయి. అలాగే క్యాన్సర్ ను నివారిస్తుంది. హై బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు.. బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడంలోనూ ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఫేస్‌కి

ఫేస్‌కి

ఈ రైస్ వాటర్ తో ఫేస్ క్లీన్ చేసుకోవడం వల్ల క్లెన్సింగ్ ఎఫెక్ట్ పొందవచ్చు. ముఖంపై గుంతలు ఏర్పడకుండా నివారించవచ్చు.

జుట్టుకి

జుట్టుకి

ఈ రైస్ వాటర్ తో జుట్టుని శుభ్రం చేసుకుంటే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తూ.. ఆరోగ్యంగా ఉంటుంది.

కండరాలు

కండరాలు

రైస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల కండరాలు, చర్మం స్మూత్ గా, అందంగా కనిపిస్తాయి.

రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకునే విధానం

రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకునే విధానం

బియ్యం కడిగిన నీళ్లే రైస్ వాటర్ అనుకుంటే పొరబడ్డట్టే. ఈ నీటిని కూడా ఉపయోగించవచ్చు. కానీ.. ఇన్ని ప్రయోజనాలు వీటి ద్వారా పొందలేము. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే. ఎక్కువ నీళ్లు పోసి బియ్యంను బాగా ఉడకబెట్టాలి. ఉడికేటప్పుడు బియ్యంను, నీటిని సపరేట్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడైనా, చల్లార్చి అయినా ఆ నీటిని తాగవచ్చు. ఇలా రైస్ వాటర్ తయారు చేసుకోవాలి. ఈ నీటిని మీకు పైన చెప్పిన ఈ పద్ధతిలోనైనా ఉపయోగించవచ్చు.

English summary

After Reading This You Will Never Throw Away The Rice Water Again

Learn how using rice water will magically transform you in so many ways. There is a very old Chinese treatment with rice water (the water with which you cooked the rice)that gives your body energy, makes your skin healthy and your hair shiny.
Story first published: Friday, January 29, 2016, 9:37 [IST]
Desktop Bottom Promotion