For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్గానిక్ ఫుడ్స్ తినడం పూర్తిగా సురక్షితమేనా??

మీరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారా?? ఆర్గానిక్ ఫుడ్స్‌లో నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ కంటే తక్కువ క్రిమిసంహారకాలు ఉండి పోషకాలు ఎక్కువ ఉంటాయని చాలా మంది ఇవి తినడానికి మొగ్గు చూపుతారు.

By Lekhaka
|

మీరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారా?? ఆర్గానిక్ ఫుడ్స్‌లో నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ కంటే తక్కువ క్రిమిసంహారకాలు ఉండి పోషకాలు ఎక్కువ ఉంటాయని చాలా మంది ఇవి తినడానికి మొగ్గు చూపుతారు.

కూరగాయలు, పండ్లు పండించేటప్పుడు చల్లిన క్రిమి సంహారకాలని పళ్ళు, కూరగాయలు పీల్చుకుంటాయి, ఇంకొంచెం క్రిమి సంహారకాలు పళ్ళు, కూరల పైభాగంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. కానీ ఆర్గానిక్ ఫుడ్స్‌లో పోషకాలు ఎక్కువ ఉండి హృదయ సంబంధిత వ్యాధులని నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Are Organic Foods Perfectly Safe To Be Consumed?

ఎక్కువ పోషకాలు, తక్కువ క్రిమి సంహారకాలు కలిగి ఉండటమే కాకుండా వీటి రుచి బాగుంటుంది పైగా సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహారం పర్యావరణానికి కూడా మంచిది. అందువల్లే వీటి ధర ఎక్కువైనా కానీ ప్రజలు ఆర్గానిక్ ఫుడ్ కొనుగోలుని తగ్గించట్లేదు.

కానీ అసలు ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే అదనపు ఉపయోగం ఏమీ లేదు అని మరి కొందరి నిపుణుల నమ్మకం. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహారం యొక్క లాభాల గురించి ప్రజలకి పెద్దగా అవగాహన లేదని వీళ్ళంటారు.అందువల్ల ఈ అసలు సేంద్రీయ ఆహారం మంచిదా కాదా అన్న వాదన చివరికి ఎటూ తేలదు.మీరు ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన కూరలు, పళ్ళు లేదా ఇతర ఉత్పత్తులని కొనేముందు అసలు ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏమిటి, దాని వల్ల లాభాలు అవీ వివరిస్తున్నాము. ఇది చదివి ఒక అవగాహన ఏర్పరచుకోండి.

Are Organic Foods Perfectly Safe To Be Consumed?

ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏమిటి??


ఇంతకుముందు అమెరికాలో ఒక ఆహార ఉత్పత్తిని ఆర్గానిక్ ఫుడ్ అని పిలవాల వద్దా అనే విషయంలో అనేక నిబంధనలుండేవి.కానీ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ నిర్వచనానికి ఒక ప్రామాణికం ఏర్పడింది.కృత్రిమ పద్ధతుల్లో లేదా ఏ క్రిమి సంహారకాలూ వాడకుండా పండించిన ఆహారాన్ని ఆర్గానిక్ ఫుడ్ అంటారు.ఆర్గానిక్ జంతు ఉత్పత్తులంటే జంతువులకి ఎటువంటి మందులూ ఇవ్వకుండా కేవలం సేద్రీయ ఆహారం అందించిన జంతువులనుండి తీసిన ఉత్పత్తులు.

Are Organic Foods Perfectly Safe To Be Consumed?

ఆర్గానిక్ ఫుడ్స్ సురక్షితమేనా??
కృత్రిమమైన క్రిమ సమ్హారకాలని తీసుకుంటే ఇవి సేంద్రీయా పద్ధతుల్లో పండించిన ఆహారంలో చాలా తక్కువ ఉంటాయి అందువల్ల సేద్రీయ ఆహారం సురక్షితం.కానీ సహజంగా మొక్కలు ఉత్పత్తి చేసే విష పదార్ధాలని తీసుకుంటే సాధారణ పద్ధతుల్లో పండించిన ఆహారమే సురక్షితం అని నిపుణులు భావిస్తారు. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహారంలో క్రిమి సంహారకాలు చాలా తక్కువ లేదా అసలు వాడకపోవడం వల్ల సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహారంలో సహజ విష ప్దార్ధాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది.కృత్రిమ క్రిమి సంహారకాల లాగే మొక్కలు ఉత్పత్తి చేసే విష పదార్ధాలు కూడా కొన్ని రోజులకి మెల్లిగా హానికరంగా మారతాయి. ఉదాహరణకి, బంగాళదుంపలు ఉత్పత్తి చేసే సోలననిన్. అది ఆకు పచ్చగా మారిన తరువాత ఎక్కువ మోతాదులో అలాంటి బంగాళ దుంపలని మనం భుజిస్తే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. సేంద్రీయ పద్ధతుల్లో మలాన్ని ఎరువుగా వాడటం కూడా సేంద్రీయ ఆహారం సురక్షితం అనే అపోహని ఖండిస్తుంది. ఇలా వాడటం వల్ల హానికారక బాక్టీరియ ఈకోలీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

Are Organic Foods Perfectly Safe To Be Consumed?

ఆర్గానిక్ ఫుడ్స్ మరింత రుచికరంగా ఉంటాయా??
సంప్రదాయ పద్ధతుల్లో పండించిన ఆహారం కంటే సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహారం రుచికరంగా ఉంటుందని కొందరంటారు.కానీ కొన్ని పరిశొధనల ప్రకారం ఈ రెండు పద్ధతుల్లో పండించిన ఆహారం మధ్య పెద్ద తేడా ఉండదు.సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహారాన్ని తాజాగా ఉన్నప్పుడే తినాలి కానీ ఫ్రీజ్ చేసిన తరువాత కాదు అని సూచిస్తారు.

Are Organic Foods Perfectly Safe To Be Consumed?

ఆర్గానిక్ ఫుడ్ కొనడం సమర్ధనీయమేనా??
ఆర్గానిక్ ఫుడ్స్ చాలా ఖరీదు కానీ అవి పర్యావరణానికి మేలు చేస్తాయి కాబట్టి కొనడం సమర్ధనీయమే.కానీ అసలు అవి పర్యావరణానికి ఎలా మేలు కలుగచేస్తాయి?? నిపుణులేమంటారంటే పంటలకి పిచికారీ చేసిన మందులూ అవీ భూమిలో, నీటిలో, కొనుగోలుదారుడి శరీరంలో పేరుకుపోతాయి.అందువల్ల ఆర్గానిక్ ఫుడ్ కొనడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించినవారమవుతాము.

English summary

Are Organic Foods Perfectly Safe To Be Consumed?

We all know how people yearn to live healthy by consuming organic foods. But are organic foods safe to be consumed? Read here to know more.
Desktop Bottom Promotion