Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
అలర్ట్ : థైరాయిడ్ సమస్య? ప్రమాధకర ఈ వస్తువుల వల్లే..!
థైరాయిడ్ పేరు చెపితేనే జనం జంకుతుంటారు. ప్రతీ దానికి ఇబ్బందికర పరిస్థితి. థైరాయిడ్ వచ్చిందని ఒక్కసారి గుర్తిస్తే దాదాపుగా జీవితాంతం దాంతో సహజీవనం చేయాల్సిందే. తెల్లవారి లేచిందే మాత్రలు వేసుకోవాలి. థైరాయిడ్ పెరిగితే ఒక ఇబ్బంది. పెరిగితే మరో ఇబ్బంది. గర్భణీ స్త్రీలు కాస్తంత జాగ్రత్త తీసుకోవాలి.
థైరాయిడ్ గ్రంధి
థైరాయిడ్ గ్రంధి సీతాకోక చిలుక ఆకారంలో వుండే చిన్న గ్రంధి.ఇది గొంతు ముందు భాగంలో ఉంటుంది. ఈ గ్రంధి ఉత్పత్తి చేయు హార్మోనుల ప్రభావము వలన శరీరములో ఉన్న వివిధ కణాలు అవసరమైన శక్తిని ఉపయోగించుకొని విధి నిర్వహాణ చేసుకొనుటకు తోడ్పడతాయి.
థైరాయిడ్ వ్యాధి అంటే..
థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లు ఉత్పత్తి చేస్తే కణాలు అధిక శక్తిని వేగంగా ఉపయోగించుకొనేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి తక్కువ స్ధాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే శరీరములోని జీవకణాలు తక్కువ స్ధాయిలో శక్తిని ఉపయోగించి కణాలను విధి నిర్వహణ చేయునట్లు తోడ్పడతాయి. థైరాయిడ్ వ్యాధులు అన్ని వయస్సుల వారికి వస్తాయి. 5 నుండి 8 శాతం మంది స్త్రీలలో అధికంగా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా శ్రవించడం వల్ల దీన్ని హైపోథరాయిడిజం లేదా అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని పిలుస్తారు.
థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే, బరువు పెరగడం, ఇన్ ఫెర్టిలిటి, డ్రై స్కిన్, డ్రై హెయిర్, ఏకాగ్రత కోల్పోవడం, అలసట, శక్తిలేకుండా పోవటం, చీకాకు, మొదలగు లక్షణాలు కనబడుతుంటాయి. థైరాయిడ్ సమస్యలున్నప్పుడు శరీరంలో మెటబాలిజం రేటు తగ్గుతుంది.
గర్భిణీ స్త్రీలలో ఇది అత్యంత ప్రమాధకరమైనది, హైపో థైరాయిడిజం వల్ల గర్భస్రావం జరుగుతుంది. ఇంకా ఇది స్త్రీ పురుషులిద్దరిలో ఫెర్టిలిటి సామర్థ్యం తగ్గిస్తుంది. దాంతో స్త్రీపురుషుల్లో వంద్యత్వంతో పోరాడుతారు.
అందువల్ల, థైరాయిడ్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడానికి కారణాలు తెలుసుకోవాలి. అలాగే థైరాయిడ్ పనిచేయకపోవడానికి కొన్ని హానికరమైన పదార్థాలు కారణమవుతాయి. వీటిని ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరగిందిజ
థైరాయిడ్ కు హాని కలిగించే కొన్ని పదార్థాలు...

ప్లాస్టిక్:
ప్లాస్టిక్ డబ్బాలు, లేదా వస్తువుల్లో ఆహారాలను మీట్ చేయడం, వేడి చేసిన ఆహారాలను తినడం , ప్లాస్టిక్ బాటిల్లోని నీళ్ళు తాగడం వల్ల థైరాయిడ్ గ్రంథులు డ్యామేజ్ అవుతాయి. ప్లాస్టిక్ లో ఉండే కొన్ని హానికరమైన పదార్థాలు, శరీరంలోనికి ప్రవేశించడం వల్ల థైరాయిడ్ గ్రంథులు డ్యామేజ్ అవ్వడం మాత్రమే కాదు, క్యాన్సర్ వంటి ప్రమాధకర ఆరోగ్య సమస్యలకు కూడా గురిచేస్తుంది.

సోయ:
సోయా ప్రొడక్ట్స్ లో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథుల నుండి థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. సోయా తినడం వల్ల థైరాయిడ్ పనితీరును తగ్గిస్తుంది . కాబట్టి, సోయా ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండటమే మంచిది

ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లోని క్రిమిసంహారినిణులు:
ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ వినియోగించడానికి ముందు వీటి ఎప్పుడూ శుభ్రం చేయాలి. వీటిలో రసాయనిక క్రిమి సంహారిణాలు ఉండటం వల్ల, ఈ పెస్టిసైడ్స్ థైరాయిడ్ గ్రంథులను డ్యామేజ్ చేస్తుంది. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ డ్యామేజ్ కు గురిచేస్తుంది.

వాటర్ లోని ఫ్లోరైడ్
మనం రెగ్యులర్ గా తాగే నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువైతే థైరాయిడ్ గ్రంథులు డ్యామేజ్ అవుతాయి. ఇంకా వాటర్ లో ఉండే క్లోరిన్ , కొన్ని ఇతర పదార్థాలు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణమవుతాయి.

ఇంధనంలోని పెరాక్లోరైడ్స్ :
ఇందనం బ్రర్నింగ్ చేసే ప్రొసెస్ లో పెరా క్లోరైడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇంజన్ నుండి వచ్చే పొగను మనం పీల్చడం జరగుతుంది. ఈ కెమికల్స్ ఫుడ్స్ లో మరియు వాటర్ లో కూడా కనుబగొనడం జరిగింది. వీటిని పీల్చినప్పుడు థైరాయిడ్ గ్రంథులు డ్యామేజ్ అవ్వడంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications