For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తిడి, ఆందోళన నుంచి రిలాక్సేషన్ ఇచ్చే ఆహారాలు

By Swathi
|

ఆందోళన, ఒత్తిడి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్న సమస్యలు. ఒత్తిడి వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా లేదా ఉద్యోగానికి సంబంధించినదై ఉంటుంది. ఇవి కాకుండా.. మరికొన్ని కారణాల వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తోంది.

బరువు పెరగడానికి ఒత్తిడి ఎలా కారణమవుతుంది ? బరువు పెరగడానికి ఒత్తిడి ఎలా కారణమవుతుంది ?

ఆందోళన వల్ల హార్ట్ రేట్ పెరగడం, హార్ట్ హెల్త్ పై రిస్క్ తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఆందోళనగా ఉన్నప్పుడు తినడం అనేది సరైనది కాదు. అయితే.. హెల్తీ ఆహారాలు తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గించుకోవచ్చు. డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.

ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు, మూడ్ నుంచి మిమ్మల్ని మీరు బయటపడటానికి ఈ కింద వివరించిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచి పద్ధతి. ఒత్తిడి, ఆందోళన తగ్గించే అలాంటి ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ డొఫామెయిన్, న్యూరోట్రాన్స్ మిట్టర్ ని రిలీజ్ చేస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ఒక ముక్క చాక్లెట్ తింటే.. ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడవచ్చు.

అరటిపండు

అరటిపండు

అరటిపండులో టైరోజిన్, ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనలో హ్యాపీ ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ సారి ఎప్పుడై మీ మూడ్ బాగోలేదని ఫీలయినా, ఒత్తిగా ఉన్నా.. అరటిపండు తిని చూడండి.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీల్లో ఎలాజిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఇమ్యునిటీని పెంచి, ఆందోళన తగ్గించడానికి సహాయపడతాయి.

ఐస్ క్రీం

ఐస్ క్రీం

ఐస్ క్రీమ్స్ ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడే వాటిలో అద్భుతమైన, టేస్టీ ఆప్షన్. ఐస్ క్రీం తినడం వల్ల ఆందోళన తగ్గిపోయి, ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది.

యాపిల్స్

యాపిల్స్

ఆందోళన తగ్గించి మూడ్ మార్చడానికి యాపిల్స్ చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే పోషకాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు పనితీరుకి సహాయపడతాయి.

బాదాం

బాదాం

బాదాంలో విటమిన్ ఈ, ఫెనిలలనైన్ ఉంటుంది. ఇది ఆల్ఫా ఎమినో యాసిడ్ ఆందోళను తగ్గిస్తుంది.

బీట్ రూట్

బీట్ రూట్

బీట్ రూట్ లో ఐరన్, విటమిన్ సి, మినరల్స్ లభిస్తాయి. ఇవి శరీరంలో బ్లడ్ ఉత్పత్తి అవడానికి సహాయపడతాయి. అలాగే ఎమినో యాసిడ్స్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.

English summary

Best Anxiety And Stress-Fighting Foods

Best Anxiety And Stress-Fighting Foods. Anxiety and stress are relative terms that are gaining more popularity these days.
Story first published: Saturday, February 27, 2016, 10:41 [IST]
Desktop Bottom Promotion