For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క‌రివేపాకులో ఉన్న అమోఘ‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

By Swathi
|

ప్ర‌తి ఇల్లాలి నేస్తం క‌రివేపాకు అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. ప్ర‌తి వంట‌లో క‌రివేపాకు ఉండాల్సిందే. క‌రివేపాకు సువాస‌న‌కు మాత్ర‌మే కాదు.. ఔష‌ధ గుణాలు కూడా అమోఘం ఉన్నాయి కాబ‌ట్టి.. అంత ప్రాధాన్య‌త ఇస్తారు. క‌రివేపాకు నిత్యం వాడ‌టం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు స్వ‌స్తిచెప్ప‌వ‌చ్చు.

క‌రివేపాకు రుచికి మాత్ర‌మే కాదు.. ఇందులోని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అమోఘంగా ఉంటాయి. దీన్ని వంట‌కాల్లోనే కాకుండా.. ర‌క‌ర‌కాల వ్యాధులు, అనారోగ్య స‌మ‌స్య‌లు నివారించ‌డానికి ఉప‌యోగించ‌వ‌చ్చు. క‌రివేపాకులో ఉన్న అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో ఇప్పుడు చూద్దాం..

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలు కలిపి పచ్చడిగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటివి త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి.

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

ఎండిన కరివేపాకులు, ధనియాలు, జీలకర్రలను నెయ్యిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, సీసాలో నిల్వచేసుకోవాలి. దీనిని ఉదయం సాయంకాలాలు భోజనంలో వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది.

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

కరివేపాకులను ముద్దగా నూరి 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

కరివేపాకు కాయల రసం తీసుకుని అంతే మోతాదులో నిమ్మరసం కలిపి తీసుకుంటే.. చ‌ర్మంపై ద‌ద్దుర్లు, వాపు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా టీస్పూన్ మోతాదులో తీసుకుంటే మూత్ర పిండాల సమస్య తగ్గుతుంది.

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని, వెన్నతోగాని కలిపి కళ్ల కింద చర్మం మీద రాసుకుంటే న‌ల్ల‌టి వలయాలు తగ్గుతాయి.

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు

కరివేపాకు పొడిని ఆహారంలో ప్రతిరోజూ మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే చెమట వల్ల వచ్చే దుర్వాసన తగ్గుతుంది.

English summary

Best health benefits of eating curry Leaves, curry Leaf

Best health benefits of eating curry Leaves, curry Leaf. Culinary recipes of India include curry leaves as one of its essential elements. It is quite popular for the people staying in south India.
Story first published: Monday, March 7, 2016, 12:03 [IST]
Desktop Bottom Promotion