For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకి ఒక గ్లాసు బనానా జ్యూస్ తో పొందే వండర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్..!

అరటిపండు తినడానికి ఇష్టపడని వాళ్లు.. జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఒకే ఒక గ్లాసు అరటిపండు జ్యూస్ తాగడం వల్ల 10 అమేజింగ్ బెన్ఫిట్స్ పొందవచ్చట. మరి ఆ బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

By Swathi
|

అరటిపండు అంటే చాలామంది చులకనగా చూస్తారు. అన్ని ఫ్రూట్స్ కంటే కాస్త తక్కువ ఖరీదులో దొరకడం, సామాన్యుడికి అందుబాటులో ఉండే ఫ్రూట్ కావడం వల్ల.. ఇలాంటి పీలింగ్ ఉంది. కానీ.. ఈ అరటిపండు.. ఆరోగ్యానికి ఎన్నో ఎన్నెన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అరటిపండులో పుష్కలంగా మినరల్స్, విటమిన్స్ లభిస్తాయి.

banana juice

ఫ్రూట్ రూపంలో లేదా సలాడ్, షేక్ ఎలా తీసుకున్నా.. అరటిపండు ద్వారా పొందే ప్రయోజనాలు మాత్రం అమోఘం. అరటిపండు జ్యూస్ గురించి మాట్లాడేటప్పుడు.. క్వాలిటీ, ప్యూర్ జ్యూస్ తీసుకోవాలి. దీన్ని ఇంట్లో తయారు చేసుకుని తీసుకోవడం మంచిది.

అరటిపండు తినడానికి ఇష్టపడని వాళ్లు.. జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఒకే ఒక గ్లాసు అరటిపండు జ్యూస్ తాగడం వల్ల 10 అమేజింగ్ బెన్ఫిట్స్ పొందవచ్చట. మరి ఆ బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

ఎనర్జీ

ఎనర్జీ

అరటిపండు ద్వారా చాలా ఎక్కువ ఎనర్జీ పొందవచ్చు. అలాగే అరటిపండు జ్యూస్ ద్వారా కూడా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సక్రోజ్, మాల్టోజ్ వంటివి పొంది.. తక్షణ శక్తిని గ్రహించవచ్చు. ఒకవేళ మీరు 90నిమిషాలు వ్యాయామం చేయాలనుకుంటే.. రెండు అరటిపండ్లు తింటే.. కావాల్సిన శక్తి పొందవచ్చు.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

అరటిపండ్లలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. కాన్ట్సిపేషన్ ని దూరంగా ఉంచుతుంది. కాబట్టి.. రెగ్యులర్ గా అరటిపండు జ్యూస్ తీసుకుంటే.. బోవెల్ మూవ్ మెంట్ స్మూత్ గా ఉంటుంది.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

అరటిపండ్లలో పెక్టిన్ ఉంటుంది. ఇది సొల్యుబుల్ ఫైబర్. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ ని మెయింటెయిన్ చేస్తుంది. అలాగే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి.. గుడ్ కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపదు.

స్ట్రోక్

స్ట్రోక్

రెగ్యులర్ అరటిపండు జ్యూస్ తాగడం వల్ల.. స్ట్రోక్ రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఉప్పు శాతాన్ని తగ్గించి.. హైడ్ బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది.

పొట్టలో అల్సర్స్

పొట్టలో అల్సర్స్

అరటిపండు కణాలపై పొట్టలో లైనింగ్స్ ని క్రియేట్ ఉంటాయి. స్టమక్ యాసిడ్స్ పై ఇవి సెఫ్టీ కవర్స్ లా పనిచేస్తాయి. అరటిపండ్ల బ్యాక్టీరియాను తొలగించి.. పొట్టలో అల్సర్లు రాకుండా అడ్డుకోవడంలో సహాయపడతాయి.

బ్రెయిన్ పవర్

బ్రెయిన్ పవర్

అరటిపండు జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. మెమరీ పవర్ ని పెంచుతాయి. ముఖ్యంగా పిల్లలో మెమరీ పెంచుతాయి. ఇందులో ఉండే హై పొటాషియం బ్రెయిన్ ని స్ట్రాంగ్ గా మారుస్తాయి.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

విటమిన్ బి, సి అరటిపండు జ్యూస్ లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యునిటి పెంచడమే కాకుండా.. నరాల వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడతాయి.

బలమైన ఎముకలకు

బలమైన ఎముకలకు

అరటిపండులో ఫ్రక్టోలికోశాచ్చరైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్వీటనర్. అరటిపండు జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకుంటే.. ప్రొబయోటిక్స్, మంచి బ్యాక్టీరియాను కోలన్ లో ఉత్పత్తి చేస్తాయి. ఈ బ్యాక్టీరియా శరీరంలో పోషకాలు గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే.. మైక్రోఆర్గానిజమ్స్ జీర్ణక్రియ ద్వారాన్ని హానిచేయకుండా.. అడ్డుకుంటుంది.

మూడ్

మూడ్

ట్రిప్టోఫాన్ శరీరానికి అందితే.. ఒత్తిడి తగ్గించడానికి, డిప్రెషన్ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

కిడ్నీ ఆరోగ్యానికి

కిడ్నీ ఆరోగ్యానికి

అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అరటిపండ్లలో పొటాషియం సాల్ట్ వల్ల నెగటివ్ ఎఫెక్ట్ ని అడ్డుకుని.. కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తుంది.

అరటిపండు జ్యూస్ తయారు చేయడం

అరటిపండు జ్యూస్ తయారు చేయడం

రెండు అరటిపండ్లు, 120మి.లీ. పాలు, ఒక టీస్పూన్ తేనె తీసుకోవాలి. ముందుగా అరటిపండ్లను బ్లెండర్ వేసి బ్లెండ్ చేశాక, పాలు, తేనె కలిపి మళ్లీ బాగా మిక్స్ చేయాలి. కావాలనుకుంటే.. కొద్దిగా వెనీలా లేదా యాలకులు మిక్స్ చేసి.. తీసుకుంటే.. టేస్టీగా మారుతుంది.

English summary

Drink A Glass Of Banana Juice Every Day To Stay Healthy: Here Are 10 Benefits To Prove It

Drink A Glass Of Banana Juice Every Day To Stay Healthy: Here Are 10 Benefits To Prove It. The top 10 benefits of banana juice are as follows.
Story first published: Wednesday, October 26, 2016, 15:48 [IST]
Desktop Bottom Promotion