For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మీ ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి..

|

మనవ శరీరంలో ప్రతి భాగం ఎముకతో ముడిపడి ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయం. ఒక మనిషి తన ఎదుగుదలలో 30 సంవత్సరాల వరకు ఎముకల ఎదుగుదల ఉంటుంది. ఆ తరువాత ఎముక పెరగటం ఆగిపోతుంది. మన శరీరంలో పాత ఎముకలు పాడైన కొద్ది కొత్త ఎముకలు వస్తుంటాయి. అలాగే వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఎముకలు చాలా బలహీనపడుతుంటాయి. అందులో ఆడవారికి ఎక్కువగా ఈ సమస్య జరుగుతుంటుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా ఎముకలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఎముకలు బలహీన పడటం ప్రారంభిస్తాయో అప్పటి నుంచి ఇక ఏ పని చేయలేరు. అందుకే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.

మనుషుల శరీరానికి ఎముకలు పునాది లాంటివి. ఇవి శరీరంలోని అనేక కదలికలు, పనితీరులను, అవయవాలకు రక్షణ కల్పించడం వంటి.. కీలక పాత్రలు పోషిస్తాయి. బ్లడ్ సెల్స్, స్టోరేజ్ మినరల్స్, ఎండోక్రైన్ రెగ్యులేషన్ వంటి వాటి పనితీరు బాధ్యత ఎముకల నిర్మాణానిదే. మెదడు, గుండె, ఊపిరితిత్తులకు కూడా ఎముకలే.. రక్షణ కల్పిస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెయింటెయిన్ చేయడం కూడా.. చాలా ముఖ్యం.ఎముకలు బలహీన పడటానికి కారణం శరీరంలో క్యాల్షియం లోపించడం, సరైన డైట్ పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇన్ఫెక్షన్స్, వారసత్వం, ఇతర వ్యాధి లక్షణాల వల్ల కూడా ఎముకల వ్యాధులు ఎదురవుతాయి.

ఎప్పుడైతే ఎముకలు బలహీనమవుతాయో.. కదలికలకు ఇబ్బందిగా మారుతుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతారు. దాంతో పాటు కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఎముకలు ఎప్పుడు బలంగా ఉండేలా జాగ్రత్త పడాలి. హెల్తీ బోన్స్ పొందడానికి ఆహారపు అలవాట్లు, మార్చుకోవడం వల్ల ఎముకలకు నష్టం కలగకుండా చేస్తుంది. వీటితో పాటు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా ఉంచుకోవచ్చు. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నివారించాల్సిన అన్ హెల్తీ హ్యాబిట్స్ మీకే తెలుస్తాయి . ఈ క్రింది తెలిపిన అలవాట్లు కనుక మీకు ఉంటే వెంటనే మానేస్తే మీ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.

సరైన పద్దతిలో కూర్చోకపోవడం:

సరైన పద్దతిలో కూర్చోకపోవడం:

ఫ్లోర్ మీద ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఎముకల మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. జాయింట్ మీద ఎక్కువ ప్రభావం పడటంతో ఎముకలు విరగడం లేదా బ్రోక్ అవ్వడం జరుగుతుంది.

చేపలు మరియు క్యాల్షియం రిచ్ ఫుడ్స్:

చేపలు మరియు క్యాల్షియం రిచ్ ఫుడ్స్:

ఎవరైతే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోరూ అలాంటి వారిలో త్వరగా ఎముకలు బ్రేక్ అవ్వడం, పెళుసుబారడం జరుగుతుంది . బోన్ డెన్సిటి తగ్గిపోతుంది మరియు బోన్స్ వీక్ గా మారుతాయి. ఫ్రాక్చర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయి . కాబట్టి, క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ఎక్సర్ సైజ్:

ఎక్సర్ సైజ్:

ప్రతి రోజూ 15 నిముషాలు వాక్ వెళ్లడం వల్ల బోన్ జాయింట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మరియు ఫెక్సిబుల్ గా ఉంటాయి . జాయింట్స్ పెయిన్ తగ్గుతుంది . బోన్ హెల్త్ ను మెరుగ్గా ఉండాలంటే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుండాలి.

 ఎండలో కూర్చుకోపోవడం:

ఎండలో కూర్చుకోపోవడం:

ఇండియాలో చాలా రాష్ట్రాల్లో కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో ఎండ చాలా అరుదుగా పడుతుంది. . ఎప్పుడూ మేఘాలతో నిండి ఉంటుంది. . ఇలా ఉండటం వల్ల విటమిన్ డి ఎక్కువగా పొందలేరు. ఎండ పడేటప్పుడు ఉదయం ఎండలో కొద్ది సేపు కూర్చోవడం వల్ల శరీరానికి అవసరయ్యే విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుకోవచ్చు.

థైరాయిడ్ మెడికేషన్స్ :

థైరాయిడ్ మెడికేషన్స్ :

థైరాయిడ్ డిజార్డర్ లో హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడే వారు , థైరాయిడ్ హార్మోన్ల ప్రభావం వల్ల బోన్స్ వీక్ గా మారుతాయి. ఈ థైరాయిడ్ మెడికేషన్ ఎముకల్లో క్యాల్షియంను నివారిస్తాయి . కాబట్టి క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవడం మర్చిపోకూడదు. థైరాయిడ్ మెడిసిన్స్ తీసుకున్న 5గంటల తర్వాత క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి.

 సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల :

సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల :

ఎక్కువ సాల్ట్ తినడం వల్ల శరీరంలో క్యాల్షియం తగ్గిపోతుంది. ఎముకల్లోని క్యాల్షియం యూరిన్ లో కోల్పోతుంది. . కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ మరియు ప్రొసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎముకల్లో క్యాల్షియం కొరవడుతుంది. దాంతో ఎముకలు వీక్ గా మారుతాయి . అంతే కాదు ప్రతి రోజూ తీసుకునే ఆహారాల్లో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.

తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల:

తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల:

మన శరీరం మనకెప్పుడూ సూచనలిస్తుంది. ఎప్పుడైతే శరీరంలో సెడెన్ గా మార్పులు జరుగుతాయో అప్పుడు సెడన్ గా లేని నడవాలి. నడవలేని పరిస్థితిలో క్యాల్షియం లోపిస్తుంది . వీక్ బోన్స్ వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ కు గురికావల్సి వస్తుంది.

ఎక్కువ బరువు ఉండటం :

ఎక్కువ బరువు ఉండటం :

ఊబకాయంతో బాధపడే వారిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలుంటాయి. వీటితో పాటు శరీరం బరువు వల్ల కాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది దాంతో జాయింట్ డ్యామేజ్ మరియు బోన్ వీక్ నెస్ కు గురి అవుతుంది. కాబట్టి, బరువును కంట్రోల్ చేసుకోవాలి.

స్ట్రెస్:

స్ట్రెస్:

ఒత్తిడి కూడా ఎముకల మీద జాయింట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒత్తిడితో ఉండటం వల్ల , ఇండైరెక్ట్ గా ఎముకల వీక్ గా మారుతాయి. గ్యాస్ట్రోఇన్ టెన్సినల్ ట్రాక్ నుండి రక్తనాళాల్లోని క్యాల్షియంను శోషింపబడుతుంది. దాంతో బోన్స్ వీక్ గా మారుతాయి.

English summary

Habits That Make Your Bones Weak

Bones as we all know are the support system of the body. Without having healthy bones, you may get crippled at one place, your movement gets restricted and you can't enjoy a quality life.
Desktop Bottom Promotion