For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తే ఇక అంతే సంగతులు..ఊబకాయం, డయాబెటిస్ తో అవస్థలే...

|

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల నేరుగా అది బరువు మీద ప్రభావం చూపుతుంది. లేదా పిల్లలను స్కూల్ కు సిద్దం చేయడం లేదా ఆఫీసులకు అర్జెంట్ గా వెళ్లాలనే హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు .

ఇలా చేయడం వల్ల అనారోగ్యానికి అదనపు చిహ్నాంగా సూచన. అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల క్రమంగా అనారోగ్యానికి గురి అవుతారు. అంతే కాదు మరణ రేటును కూడా క్రమంగా పెంచుతుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం కొంత మంది పెద్దవారు, టీనేజ్ వారు దినచర్యలో మొదటి సారిగా తీసుకొనే మీల్స్ ను మిస్ చేయడం వల్ల వారి ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్లు కనుగొన్నారు . వారు ఇలా బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయడం వల్ల ఎక్కువగా స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం జరుగుతుంది. దీనికి తోడు వ్యాయామం చేయకపోవడం వల్ల మరిన్నిఆరోగ్య సమస్యలు తోడైతాయి. ముఖ్యంగా ఇలాంటి అనారోగ్య లక్షణాలు బ్రేక్ ఫాస్ట్ తీసుకొనేవారిలో కనబడవు.

ఎవరైతే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తారో వారు ఎక్కువగా ఊబకాయానికి గురి అవుతుంటారు మరియు తక్కువ అటెంటివ్ గా ఉంటారు, అంటే వారు ఏపనిచేయాలన్నా చాలా కష్టంగా భావిస్తుంటారు .

How Skipping Breakfast Leads To Weight Gain & Diabetes

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడంతో పాటు, స్మోక్ చేయడం, వ్యాయామం లేకపోవడం , దానికి తోడు న్యూట్రీషియన్ ఫుడ్ తీసుకోకపోవడం , రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకోవడం మరియు హైబిఎంఐ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే పెద్దలు మరియు టీనేజర్స్ కనిపించే లక్షనాలని రీసెంట్ రీసెర్చ్స్ వెల్లడి చేస్తున్నారు .

ముఖ్యంగా , నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం, ఆరోజుకు అత్యంత ముఖ్యమైన మీల్ గా సూచిస్తున్నారు . ఇలాంటివారు చాలా సింపుల్ గా ఫీవరిష్ లైఫ్ ను గడుపుతూ , అధికబరువు పెరుగుతామన్న విషయాన్ని లెక్క చేయడం లేదు.

ఈ మద్యన ఒక రీసెర్చ్ లో 5500 మంది యవ్వనంలో ఉన్న అమ్మాయి మరియు అబ్బాయిల మీద జరిపిన పరిశోధనలో వారి తల్లిదండ్రులు బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తీసుకుంటారు , ఎన్ని సార్లు తీసుకుంటారు, లేదా ఎన్ని సార్లు స్కిప్ చేస్తుంటారు అన్నదాని మీద పరిశోధనలు జరిపారు. వీటితో పాటు వారి యొక్క బరువు, డ్రింకింగ్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ ను కూడా నోట్ చేసుకున్నారు.

How Skipping Breakfast Leads To Weight Gain & Diabetes

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడంలో ముఖ్యంగా పిల్లల కంటే వారి తల్లిదండ్రులు ముందు వరుసలో ఉన్నట్లు , పరిశోధల్లో గ్రహించడం జరిగింది . ఇక యవ్వనంలోని పిల్లలు , మరియు వారికంటే చిన్న వయస్సు వారు కూడా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడంలో డిజార్డ ఈటింగ్ పాట్రన్స్ కలిగి ఉండటం , ఇది ఖచ్చితంగా హెల్త్ కాంప్రమైజ్ ఆల్కహాల్, టుబాకో మరియు కానబిస్ తో సంబందం కలిగి ఉండటాన్ని గ్రహించారు.

ఈ లక్షణాలను గుర్గించన రీసెర్చర్స్, రోజు ప్రారంభ సమయంలో పొట్ట నిండుగా ఉండటం వల్ల రోజంతా ఆకలి కంట్రోల్లో ఉంటుంది మరియు బరువు క్రమబద్దంగా ఉంటుందని నిర్ధారించారు . ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది . దాంతో ఆకలి మరియు ఎనర్జీ కంట్రోల్లో ఉంటుందని నిర్ధారించారు.

మరో పరిశోధన ప్రకారం3000 అమెరికన్స్ మీదజరిపిన పరిశోధన ప్రకారం . ఎవరైతే రెగ్యురల్ గా బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారో అలాంటి వారు అధిక బరువు కలిగి ఉండటం లేదా డయాబెటిస్ కలిగి ఉండటం చాలా తక్కువ మందిని గుర్తించారు.

అందువల్ల వారికి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కొద్ది సమయం కేటాయిస్తూ , బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఉన్నట్లు గ్రహించారు . అంతే కాదు తల్లిదండ్రులు పిల్లలకు అందించే ఆహారాలు పూర్తి పోషకాహారాలను అందించడం వల్ల హెల్తీగా ఉండగలుగుతారని సూచిస్తున్నారు.

English summary

How Skipping Breakfast Leads To Weight Gain & Diabetes

Skipping breakfast appears to be a straightforward way of decreasing weight or saving time while getting the kids ready for school or rushing off to work.
Story first published: Friday, March 18, 2016, 8:14 [IST]
Desktop Bottom Promotion