For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీ లేదా టీలో బట్టర్ కలిపి తీసుకుంటే పొంతే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్..!

By Swathi
|

కాఫీ, టీ ఎక్కువగా తాగితే హానికరం. కానీ.. సరైన మోతాదులో తీసుకుంటే.. ఇవి చాలా హెల్తీ అని, శరీరంలో అద్భుతమైన మార్పులు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీ, టీలను రకరకాలుగా తీసుకుంటాం. బ్రూ, ఫిల్టర్ కాఫీ, ఇన్ స్టంట్ కాఫీలతో పాటు, కెపచీనో, లట్టే ఇలాంటి ఫ్లేవర్స్ కూడా వినే ఉంటాం.

గరం గరం చాయ్ తో గమ్మత్తైన ఆరోగ్య ప్రయోజనాలు

టీ విషయానికి వస్తే.. ఇక బ్రేకుల్లేకుండా లిస్ట్ వచ్చేస్తుంది. హెల్తీ, హెర్బల్ టీలు చాలానే ఉన్నాయి. గ్రీన్ టీ, చామంతి టీ, మందారం టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలు తాగి.. హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అయితే.. మీ కాఫీ లేదా టీని మరింత హెల్తీగా, రుచికరంగా మార్చాలంటే.. కాస్త బట్టర్ కలపండని సూచిస్తున్నాయి స్టడీస్. అంతేకాదు.. ఈ బట్టర్ టీ లేదా కాఫీతో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట.

రోజుకు 2 కప్పుల షుగర్ లెస్ బ్లాక్ కాఫీ తాగడంతో పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..!

ఒకవేళ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినలేదంటే.. టీ లేదా కాఫీలోకి కాస్త బట్టర్ వేసుకుని తాగేయండి. ఈ టేస్ట్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. మీ డ్రింక్ కొద్దిగా సాల్టీగా, క్రీమీగా మారుతుందంతే. అంతేకాదు.. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అయితే.. ఇలా కాఫీ లేదా టీలో బట్టర్ కలుపుకుని తీసుకుంటే పొందే ప్రయోజనాలు వింటే షాక్ అయిపోతారు.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

ఒక కప్పు నీళ్లలోకి ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కలిపి ఉడికించాలి. కొద్దిగా బట్టర్ కలిపి ఒక నిమిషం పాటు బ్లెండ్ చేయాలి. అంతే బట్టర్ కాఫీ రెడీ. సేమ్ ఇలాగే బట్టర్ టీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.

ఆకలి తగ్గిస్తుంది

ఆకలి తగ్గిస్తుంది

కాఫీ లేదా టీ, బట్టర్ కలిపిన కాంబినేషన్ టేస్టీగానే కాదు.. తినాలన్న ఆలోచనను కూడా తగ్గిస్తుంది. ఈ పదార్థం హెవీగా ఉండటం వల్ల చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

హెల్తీ పద్ధతిలో బరువు తగ్గాలి అనుకుంటే.. ఇది చక్కటి సొల్యూషన్. తాజా బట్టర్ బాడీ ఫ్యాట్ ని కరిగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

ఎనర్జీ పెరగడానికి

ఎనర్జీ పెరగడానికి

కాఫీ లేదా టీ, బట్టర్ కాంబినేషన్ చాలా హెల్తీ. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. ఎనర్జీ పొందుతారు. రోజంతా ఉల్లాసంగా, యాక్టివ్ గా ఉంటారు.

హార్ట్ డిసీజ్

హార్ట్ డిసీజ్

ఈ కాంబినేషన్ హార్ట్ డిసీజ్ లతో పోరాడుతుంది. రెగ్యులర్ గా దీన్ని తీసుకుంటూ ఉంటే.. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు. ఒక హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లలో ఆ సమస్య తగ్గుతుంది.

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్ ప్రస్తుత రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. ప్రతి ఒక్కరూ.. ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. చాలా పెయిన్ ఫుల్ గా ఉంటే.. కాన్స్టిపేషన్ నుంచి రిలాక్స్ అవడానికి బట్టర్ కాఫీ లేదా బట్టర్ టీ హెల్తీ సొల్యూషన్.

బ్రెయిన్

బ్రెయిన్

ఈ డ్రింక్ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడమే కాదు.. బ్రెయిన్ రిలాక్స్ గా ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.

English summary

Mix Butter in Your Tea and Coffee for Some Amazing Benefits!

Mix Butter in Your Tea and Coffee for Some Amazing Benefits! To make your beverage really healthy, add a little butter to it and be surprised for the amazing benefits the deadly combination has.
Story first published:Saturday, June 11, 2016, 16:26 [IST]
Desktop Bottom Promotion