For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

By Super
|

ఆహారం భుజించేటపుడు మధ్య మధ్యలో నీరు తాగుతూ వుంటే, పొట్టలోని జీర్ణ రసాలు పలుచబడి వాటి ప్రభావం చూపలేవు. జీర్ణక్రియ మందగిస్తుంది. మీ శరీర ఇన్సులిన్ స్ధాయిలు బాగా హెచ్చు తగ్గులు చూపుతాయి. అజీర్ణం, త్రేన్పులు వంటివి కలిగి అనారోగ్యం కలిగిస్తుంది.

మీరు తినేటప్పుడు నేల మీద ఎందుకు కూర్చోవాలి?

మరి అసలు మన శరీరానికి తగినంత నీరు తాగుతున్నామా? అనే అంశం ఎలా తెలుసుకోవాలి? అందుకు సూచనగా మీకు దాహం వేస్తుంది. కనుక మీరు ఎంత దాహం భావిస్తున్నారనేది ముందుగా పరిశీలించుకోండి. అలాగని మీరు భోజనం చేసే సమయంలో గ్లాసులకొద్ది నీటిని తాగేయటం సరికాదు. నీరు ఆహారం తీసుకునేటపుడు తాగరాదు. మరి ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుందాం..

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

మన భారతీయులలో చాలామందికి భోజనం వద్ద పెద్ద చెంబు లేదా గ్లాసులతో నీరు పెట్టుకొని భోజనం మధ్యలో తాగే అలవాటు వుంది. ఈ రకంగా భోజనం మధ్యలో నీరు తాగితే, మీరు తినే ఆహారాన్ని అది కడిగేస్తుంది. ఇది చాలా చెడ్డ విధానమని గుర్తించండి. జీర్ణక్రియకు చెడు కలిగిస్తుంది. అజీర్ణం సమస్యలు కలిగిస్తుంది. మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వుంటాయి. నీరు తాగితే పలుచనైన ఆ ఆహారాన్ని జీర్ణం చేయాలంటే, మీ పొట్టలో మరోమారు అవసరమైన జీర్ణరసాలు ఘాటుగా ఊరాలి. అందుకు సమయం పడుతుంది. కనుక తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

మన పొట్టలకు మనం ఆహారం ఎపుడు తింటామో అపుడు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయాలనేది బాగా తెనలుసు. అదే సమయంలో మీరు నీరు తాగితే, మీరు అది ఉత్పత్తి చేసే జీర్ణ రసాలను మరింత పలుచబడేస్తున్నారు. కనుక అవి మీరు తినిన ఆహారాన్ని జీర్ణం చేసి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టలేదు.

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

ఆహారం తీసుకునే సమయంలో కొద్దిపాటి నీరు తాగటం సరైనదే అయినప్పటికి, గ్లాసుడు నీరు తాగరాదని అది జీర్ణక్రియకు ఆటంకం అని రీసెర్చి చెపుతోంది.

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనానికి ఒక గంట ముందుగా లేదా భోజనం తర్వాత రెండు గంటల తర్వాత తాగే నీరు జీర్ణక్రియకు సహకరించి పోషకాలు శరీరంలోని బాగా పీల్చేలా చేస్తాయని రీసెర్చర్లు కనుగొన్నారు.

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో తాగే నీరు మీ పేగు గోడలు పీల్చేసుకుంటాయి. అక్కడ ఊరే ఘాటైన యాసిడ్లు పలుచబడిపోతాయి. ఆహారం జీర్ణమయ్యేటందుకు అవసరమైన జీర్ణ రసాలు వుండవు. ఫలితంగా తిన్నది జీర్ణం కాక, మరోమారు వెలుపలికి కూడా వచ్చి గుండె, గొంతు మంటలను కలిగిస్తుంది.

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

ఇన్సులిన్ స్ధాయిలు పెరిగి అవి మీ రక్తంలోకి వదలబడి, కొవ్వును పెంచుతాయి.

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

మరి భోజనం మద్యలో నీరు తాగకుండా వుండేందుకుగాను మీరు తినే ఆహారం మరింత ఉప్పగాను, లేదా కారంగాను లేకుండా చూడండి. నీరు అవసరపడని ఆహారంగా వుండాలి.

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

త్వర త్వరగా తినకండి. మీరు ఆహారం మింగేస్తే నీరు అవసరం అవుతుంది. అందుకని బాగా నమిలి తినండి. ఎంత బాగా నమిలితే, అంతబాగా ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది.

English summary

reasons why drinking water during your meals is bad for you

Probably one of the most common sights you see on a daily basis is that tall glass of water next to your plate of food Probably one of the most common sights you see on a daily basis is that tall glass of water next to your plate of food. Probably one of the most common sights you see on a daily basis
Story first published: Monday, March 14, 2016, 16:48 [IST]
Desktop Bottom Promotion