For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో పైనాపిల్ తినొచ్చా? ఒకవేళ తింటే కలిగే దుష్ప్రభవాలేంటి...?

|

సాధారణంగా మన దినచర్యలో పండ్లు మరియు వెజిటేబుల్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు . పండ్లలో ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది, అంతే కాదు, బరువు తగ్గడానికి మరియు స్ట్రాంగ్ గా బాడీ ఇమ్యూన్ పవర్ పెంచడానికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ ను శరీరానికి అందిస్తాయి.

వివిధ రకాల పండ్లలో పైనాపిల్ ఒకటి . ఇది ఒక విలువైన పోషకాలున్న ఫ్రూట్ . అంతే కాదు, దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కానీ వింటర్లో పైనాపిల్ తినడం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ? ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పవచ్చు.

అనాసలోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

వాటి గురించి తెలుసుకోవడానికి ముందు. పైనాపిల్ తినడం వల్ల పొందే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోవాలి. పైనాపిల్లో బ్రొమైలైన్ మరియు ఎంజైమ్స్ ఉండటం వల్ల జీర్ణక్రియను చాలా ఎఫెక్టివ్ గా మెరుగుపరుస్తుంది . ఇంకా ఇది నేచురల్ డిటాక్సిఫైయర్. బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది మరియు కిడ్నీ ఫంక్షనింగ్ కు సహాయపడుతుంది. క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది.

ఇంకా పైనాపిల్ లో ఉండే విటమిన్ సి బోన్ మరియు స్కిన్ సమస్యలను రిపేర్ చేస్తుంది . అందుకు అవసరం అయ్యే వ్యాధినిరోధకశక్తిని అందిస్తుంది . బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించే వారు, రెగ్యులర్ డైట్ లో కొన్ని పైనాపిల్ ముక్కలను చేర్చుకోవాలి. ఈ ఫ్రూట్ వల్ల ఇన్ని లాభాలున్నా కూడా...నష్టలా గురించి ఎందుకు తెలుసుకోవాలని కోరుకుంటారు? పైనాపిల్ వింటర్లో తినడం ఆరోగ్యకరమేనా? మితంగా తింటే ఏది హాని చేయదు..

పైనాపిల్ తో ఆహా అనిపించే చర్మం సౌందర్యం మీ సొంతం...

ఇదిలా ఉంచితే, ముఖ్యంగా గర్భిణీలు పైనాపిల్ తినడకూడదని చెబుతుంటారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో పూర్తి అయ్యే వరకూ తినకూడదని సలహాలిస్తుంటారు. దీన్ని తినడం వల్ల గర్భశ్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వింటర్లో పైనాపిల్ తినడం ఆరోగ్యకరమా? లేదా అని తెలుసుకోవడానికి , ఒక వేళ తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎదుర్కోవల్సి వస్తుందో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలపడం జరిగింది. మరి అవేంటో తెలుసుకుందాం....

అలర్జీలకు కారణం అవుతుంది:

అలర్జీలకు కారణం అవుతుంది:

వింటర్ సీజన్ అంటేనే అలర్జీలకు నిలయం అని చెప్పవచ్చు . తరచూ అలర్జీలను ఎదుర్కొంటుంటారు . మరి వింటర్లో పైనాపిల్ తినడం మంచిదేనా?ఇందులో ఉండే ఎంజైమ్స్ సోర్ లిప్స్ మరియు గొంతు నొప్పికి దారితీస్తుంది . ఒకవేళ తినాలినిపించినా, వీటిని ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో డిప్ చేసి తినాలి.

గర్భిణీ స్త్రీలు తినకూడదు:

గర్భిణీ స్త్రీలు తినకూడదు:

గర్భధారణ సమయంలో పైనాపిల్ తినడం వల్ల గర్భశ్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని పరిశోధనలు కనుగొనబడ్డాయి. అది వింటర్ అయినా, లేదా ఏ సీజన్లో అయినా గర్భిణీలకు ప్రమాధమే. గర్భధారణలో కాకుండా తర్వాత తీసుకోవచ్చు.

ఆర్ధరైటిస్ ను పెంచుతుంది:

ఆర్ధరైటిస్ ను పెంచుతుంది:

వింటర్లో పైనాపిల్ తినడం వల్ల కలిగే నష్టాలేంటి? వింటర్లో ఎక్కువగా జాయింట్ పెయిన్స్ తో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఆర్థరైటిస్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి . ఈవింటర్ సీజన్లో పైనాపిల్ తినడం వల్ల అది ఆల్కహాల్ గా మార్పు చెంది, గ్యాస్ట్రో ఇన్ టెన్షనల్ ట్రాక్ కు చేరి నొప్పులను మరింత తీవ్రం చేస్తాయి.

నాశికారంద్రంలో మ్యూకస్ ను ఏర్పరుస్తాయి:

నాశికారంద్రంలో మ్యూకస్ ను ఏర్పరుస్తాయి:

మీకు ఇది వరకే సైనస్ సమస్య ఉన్నట్లైతే? వింటర్ మీకు శత్రువే . ఈ సమయంలో పైనాపిల్ తినడం వల్ల ఇది మీ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ముక్కులో మ్యూకస్ ఏర్పడుట వల్ల ఎయిర్ ప్యాసేజ్ బ్లాక్ అవుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచుతుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచుతుంది:

వింటర్లో పైనాపిల్ తినడం వల్ల ఎదుర్కొనే సైడ్ ఎఫెక్ట్స్ ను గుర్తించాలి , విటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పండులో షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నా కూడా డయాబెటిక్ పేషంట్స్ కు ఏమాత్రం ఆరోగ్యకరం కాదు.

డ్రగ్స్ తో కలిసినప్పుడు:

డ్రగ్స్ తో కలిసినప్పుడు:

పైనాపిల్లో ఎంజైమ్స్, బ్రొమోలిన్, ఉన్నాయన్న విషయం మీకు తెలిసిందే. ఇదివరికే మీరు యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నట్లైతే పైనాపిల్ ను ఖచ్చితంగా తీసుకోకూడదు. ఇందులో ఉండే ఎంజైమ్స్ మెడిసిన్ కు రియాక్ట్ అవుతాయి. ఫలితంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి వీటిని తినడం నివారించాలి . వింటర్ సీజన్లో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కనుక వీటిని తినడం తగ్గించాలి.

English summary

Side Effects Of Eating Pineapple In Winter

Pineapple is one of the juiciest and delicious tropical fruits you can have. It also has several benefits on your health. But, are there any side effects of eating pineapples in winter season? Before discussing that, you should know what the benefits of eating pineapples are. Pineapple is effective in digesting foods due to the presence of an enzyme, bromelain.
Story first published: Tuesday, January 19, 2016, 10:24 [IST]
Desktop Bottom Promotion