For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐరన్ లోపం సూచించే డేంజర్ సిగ్నల్స్

By Swathi
|

శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా.. సజావుగా పనిచేయాలంటే వాటికి కావాల్సినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ అవయవాల పనితీరు బాధ్యత నిర్వర్తిస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్ సరఫరా చేయలేకపోయినా.. ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గినా.. రక్తహీనత బారిన పడాల్సి వస్తుంది. రక్తహీనతకు ప్రధాన కారణం ఐరన్ లోపం.

టీనేజర్స్ కోసం ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు

హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడంలో ఐరన్ బాగా సహాయపడుతుంది. జీవక్రియల్లలో ప్రొటీన్స్ పెంచడంలో కూడా ఐరన్ చాలా అవసరం. ఐరన్ సరైన మోతాదులో ఉంటే.. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే డైట్ ఐరన్ ఉండేలా జాగ్రత్తపడాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభించే ఆహారం తీసుకుంటే.. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

Signs You Have an Iron Deficiency

కండరాల శక్తిని ఐరన్ పెంపొందిస్తుంది. ప్రొటీన్ల ద్వారా శరీరానికి లభించిన ఎనర్జీని కండరాలకు సరఫరా చేయడం వల్ల అవి బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గిపోతే.. నీరసం వస్తుంది. దీనివల్ల అనిమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలసట, తలనొప్పి, తరచుగా జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు ఐరన్ లోపాన్ని సూచిస్తాయి.

మీ ఒంట్లో ఇనుము తగ్గిందా ఇక అంతే సంగతులు....

Signs You Have an Iron Deficiency

చేపలు, గుడ్లు, బీట్ రూట్, ములక్కాడ, బెల్లం వంటి ఆహార పదార్థాల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని రోజువారి డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. జామకాయ తీసుకోవడం వల్ల ఆహారంలోని ఐరన్ ని శరీరం ఈజీగా గ్రహించేలా చేస్తుంది. అలాగే భోజనం తర్వాత కాఫీ, టీలు తీసుకోకూడదు. ఇవి శరీరం ఐరన్ గ్రహించడాన్ని అడ్డుపడతాయి.

దంపుడు బియ్యం, గుమ్మడికాయ, సోయాబీన్స్, బఠాణీలు, స్ర్టాబెర్రీ, ఆకుకూరలు, చికెన్ లలో ఐరన్ లభిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీసే.. ఐరన్ లోపం తలెత్తకుండా.. రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేర్చుకుంటే.. హెల్తీ లైఫ్ లీడ్ చేయవచ్చు.

English summary

Signs You Have an Iron Deficiency

Iron deficiency is the most common nutritional deficiency in the United States, and women are among those at greatest risk. Iron is critical for producing hemoglobin, a protein that helps red blood cells deliver oxygen throughout your body.
Story first published:Monday, January 11, 2016, 17:54 [IST]
Desktop Bottom Promotion