For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బాడీలో క్యాల్షియం లెవల్స్ ను రేజ్ చేసే 10 సూపర్ ఫుడ్స్..!!

  By Sindhu
  |

  మన శరీరానికి క్యాల్షియం సిమెంట్ వంటిది. ఇల్లు స్ట్రాంగ్..బలంగా కలకాలం నిల్చి ఉండాలంటే ద్రుడమైన సిమెంట్ పడాల్సిందే, అదే విధంగా మన శరీరం కూడా స్ట్రాంగ్ గా, హెల్తీగా, ఫిట్ గా ఉండాలంటే క్యాల్షియం చాలా అవసరం. మన శరీర నిర్మానికి పిల్లర్స్ వంటివి ఎముకలు, ఇవి శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం అత్యవసరం. ఇటువంటి అత్యవసరమైన మినిరల్ లోపించడం వల్ల ఎముకలు పెళుసుగా మారడం, విరగడం, ఓస్ట్రియోఫోసిస్ సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.

  అంతే కాదు, శరీరంలో క్యాల్షియం లోపం వల్ల దంతక్షయం, హార్ట్ కు సంబంధించిన సమస్యలు, మజిల్ క్రాంప్స్, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇంకా నరాల ఏర్పాటుకు, హార్మోన్ల ఉత్పత్తికి, రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి , కండరాల ఏర్పాటుకు క్యాల్షియం చాలా ఉపయోగపడుతుంది.

  యవ్వనంలో ఉన్నప్పటి నుండి శరీరానికి తగినంత క్యాల్షియం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్త్ కాలంలో బోన్ డెన్సిటిని మెరుగుపరుచుకోవడానికి యవ్వనం నుండే ఎముకలను కాపాడుకుంటూ రావాలి. ఎందుకంటే వయస్సైయ్యే కొద్ది కీళ్ళనొప్పి, ఎముకల్లో క్యాల్షియం తగ్గడం వల్ల ఓస్టిరియోఫోసిస్ ఇతర సమస్యలు బాధిస్తాయి.

  క్యాల్షియం లోపిస్తే ఆరోగ్యానికి మంచిది కాదు, క్యాల్షియం ఎక్సెస్ అయినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, క్యాల్షియం ఎక్కువైనా కిడ్నీ స్టోన్స్ ఏర్పడుట, క్యాల్షిఫికేషన్ టిష్యులు, హార్ట్ డిసీజ్ లు పెరుగుతాయి .

  అందువల్ల మొదట పాజిటివ్ గా ఆలోచించడం మంచిది , క్యాల్షియం లోపం ఏర్పడకుండా మొదట జాగ్రత్తలు తీసుకోవాలి? అందుకు సులభమైన సమాధనం : క్యాల్షియం అధికంగా ఉండే హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అలాంటి క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా పరిచయం చేయబడం జరిగింది. అవేంటంటే..

  గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

  గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

  పాలు, పెరుగు పక్కన పెడితే గ్రీన్ లీఫ్ వెజిటెబుల్స్ లో కూడా అధిక శాతంలో కాల్షియం నిల్వ ఉంటుంది, ముఖ్యంగా ఆకుకూరలు, బ్రొకోలీ ఎక్కువ.

  లోఫ్యాట్ మిల్క్ :

  లోఫ్యాట్ మిల్క్ :

  పాలలో అత్యధికంగా కాల్షియం కలిగి ఉంటుంది. కాబట్టి మహిళలలు ప్రతి రోజూ వారికి కావల్సిన కాల్షియంను గ్రహించాలంటే ఒక రోజుకి కనీసం ఒక గ్లాసు పాలను ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది.

  చైనీస్ క్యాబేజ్:

  చైనీస్ క్యాబేజ్:

  ఒక కప్పు చౌనీస్ క్యాబేజ్ ఒక గ్లాస్ పాలతో సమానం అని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

  సోయా ప్రొడక్ట్స్:

  సోయా ప్రొడక్ట్స్:

  నాన్ ఫ్యాట్ సోయా మిల్క్, అన్ స్వీటెండ్ సోయా మిల్క్ ను రెగ్యులర్ గా తీసుకుంటే క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. సాధారణ ఆవు పాలతో పోల్చితే సోయా మిల్క్ లో కాల్షియం అధికంగా లేకున్నా, కానీ 300mg కాల్షియాన్ని ఇది అంధిస్తుంది.

  బ్రొకోలీ:

  బ్రొకోలీ:

  బ్రొకోలీ క్యాల్షియంను అందిస్తుంది. ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు.

   బాదం:

  బాదం:

  బాదం ‘విటమిన్ ఇ' చాలా ఫేమస్. ప్రతి యొక్క బాదాం గింజ నుండి 70-80mg కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఒక గుప్పెడు బాదాం పప్పులను తినడం వల్ల మీకు కావల్సిన కాల్షియం అందినట్లే.అన్ని రకాల నట్స్ లో కంటే బాదం గ్రేట్ క్యాల్సియం ఫుడ్, ఇందులో క్యాల్షియంతో పాటు విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

   క్యాన్డ్ ఫిష్ :

  క్యాన్డ్ ఫిష్ :

  సార్డిన్స్ వంటి క్యాన్డ్ ఫిష్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. సీ ఫిష్ లో చాలా ప్రసిద్ది చెందినవి, ఆరోగ్యానికి చాలా మంచివి సార్డిన్స్. ఒక రోజులో మీకు కావల్సిన 33% కాల్షియంను వీటిలో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వారంలో ఒకసారైనా ఈ సార్డిన్స్ ఫిష్ ను తినడానికి ప్రయత్నించండి..

  ఆరెంజ్ జ్యూస్ :

  ఆరెంజ్ జ్యూస్ :

  ఆరెంజ్ లో అత్యధిక విటమిన్ సి తో పాటు శరీరానికి కావల్సిన కాల్షియం కూడా ఇందులో లభిస్తుంది. క్యాల్షియంను అందివ్వడంలో ఆరెంజెస్ బెస్ట్ ఆప్షన్ మీరు డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తినకపోతే ఆరెంజస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఆరెంజెస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది విటమిన్ సి అందివ్వడంతో పాటు, వ్యాధినిరోధకశక్తిన పెంచుతుంది.

  బ్రెడ్ , త్రుణధాన్యాలు:

  బ్రెడ్ , త్రుణధాన్యాలు:

  మల్టీ గ్రైన్ బ్రెడ్ అనేది మీ ఆహారంలో తృణధాన్యాలను చేర్చటానికి ఒక అద్భుతమైన మార్గం. మల్టీ గ్రైన్ లో సాదారణంగా వరి,బార్లీ,బక్ గోధుమ మరియు వోట్స్ వంటి తృణ ధాన్యాలు కనిపిస్తాయి. తృణధాన్యాలను తినే వ్యక్తులు తక్కువ బరువు మరియు తక్కువ శరీర ద్రవ్యరాశి ఇండెక్సులు మరియు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగి ఉంటారు.

  టోఫు:

  టోఫు:

  కాటేజ్ చీజ్ కు బదులుగా ఈ సోయాబీన్స్ తో తయారు చేసే చీజ్ లాంటి పదార్థాన్ని టోఫు అంటారు. ఇందులో కూడా కాల్షియం శాతం ఎక్కువే.

  English summary

  These 10 Superfoods Help You Raise Your Calcium Level

  Calcium acts like cement of our body. It helps in making the bones, the pillars of the body, strong. Lack of this very essential mineral thus makes our bones brittle and makes them prone to diseases like osteoporosis.
  Story first published: Thursday, November 17, 2016, 15:08 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more