For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ గ్రీన్ వెజిటబుల్స్ తినడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

ఆరోగ్యంగా బతకాలని.. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా ? అయితే ఖచ్చితంగా గ్రీన్ వెజిటబుల్స్ పై ఓ లుక్కేయాల్సిందే. ముఖ్యంగా.. ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోవాలి. డైలీ డైట్ లో వెజిటబుల్స్, ముఖ్యంగా ఆకుకూరలు కంపల్సరీ చేర్చుకోవాలి.

ఈ గ్రీన్ వెజిటబుల్స్ ని ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు.. గ్రీన్ వెజిటబుల్స్ ద్వారానే పొందగలుగుతాం.

అనేక రకాల వ్యాధులు నివారించడానికి గ్రీన్ వెజిటబుల్స్ చక్కటి పరిష్కారంగా అధ్యయనాలు కూడా నిరూపించాయి. బరువు తగ్గడం నుంచి డయాబెటిస్ రిస్క్ తగ్గించడం, హైపర్ టెన్షన్, క్యాన్సర్ నివారించడంలో.. గ్రీన్ వెజిటబుల్స్ కీలకపాత్ర పోషిస్తాయి.

అయితే రోజుకి ఎంత మోతాదులో గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి ? ఈ విషయంలో అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల పెద్దవాళ్లకు ప్రతిరోజూ ప్రకారం 2 నుంచి 3 కప్పుల వెజిటబుల్స్ అవసరమవుతాయట. ఇవి వండినవి, ఉడికించినవి, ఫ్రై చేసినవి, పచ్చివి ఎలాగైనా తీసుకోవచ్చు.

ఇప్పుడు ప్రతిరోజూ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు చూద్దాం..

కొలెస్ట్రాల్ తగ్గించడానికి

కొలెస్ట్రాల్ తగ్గించడానికి

పాలకూర వంటి ఆకుకూరలు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి సహాయపడతాయి. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.

కంటిచూపు మెరుగుపడటానికి

కంటిచూపు మెరుగుపడటానికి

అన్ని గ్రీన్ వెజిటబుల్స్ కంటిచూపు మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో ఎక్కువ మొత్తంలో ల్యుటెన్ ఉంటుంది. ఇవి కణాల డ్యామేజ్ ని నిరోధించి, కంటిచూపు సమస్య రాకుండా నివారిస్తుంది.

విటమిన్స్

విటమిన్స్

గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల్లో ముఖ్యమైన విటమిన్స్ అయిన విటమిన్ ఏ, సి, కే ఎక్కువగా లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేస్తాయి. ఇవి శరీరానికి అందడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి.

ఎముకలకు

ఎముకలకు

బ్రొకోలి వంటి గ్రీన్ వెజిటబుల్స్ లో ఎక్కువ మోతాదులో క్యాల్షియం, ఉంటుంది. ఇది.. ఎముకల ఆరోగ్యానికి, బలానికి చాలా మంచిది.

డయాబెటిస్ రిస్క్

డయాబెటిస్ రిస్క్

కొన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ స్పినాచ్ వంటివాటిలో ఎక్కువ మోతాదులో పోలిఫెనాల్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి.. టైప్ టు డయాబెటిస్ రిస్క్ ని తగ్గిస్తాయి.

క్యాల్షియం, ఐరన్

క్యాల్షియం, ఐరన్

ఆకుకూరల్లో ఎర్రరక్త కణాలకు చాలా అవసరమైన ఐరన్ లభిస్తుంది. బ్రొకోలిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా నివారిస్తాయి.

గుండె సమస్యలు

గుండె సమస్యలు

ఆకుకూరలు, గ్రీన్ వెజిటబుల్స్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా క్యాబేజీ లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది.. గుండె సమస్యలతో పోరాడుతుంది.

English summary

This Is Why You Should Eat Green Vegetables Everyday!

This Is Why You Should Eat Green Vegetables Everyday! Are you on the hunt for the secret of healthy living? Then definitely you must check out green vegetables, especially the leafy ones.
Story first published:Thursday, July 21, 2016, 9:33 [IST]
Desktop Bottom Promotion