For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైలీ డైట్ లో చేర్చుకోవాల్సిన ఫైబర్ ఫుడ్

By Swathi
|

మనం తిన్న ఎలాంటి ఆహారం తీసుకున్నా సరిగా జీర్ణమవకపోతే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొట్టలో ఉబ్బరం, గ్యాస్ర్టిక్ ట్రబుల్ సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ని ఎంచుకోవడం మంచిది. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. అలాగే మలబద్ధకం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే తీసుకునే ప్రతి ఆహారం కాకపోయినా.. ఏదో ఒకటి పీచు పదార్థం ఉన్న పదార్థం చేర్చుకుంటే.. మీ రోజు హెల్తీగా ఉంటుంది. అలాగే.. ఈజీగా జీర్ణమవుతుంది.

spinach

పాలకూర
పాలకూరను మనం సాధారణంగా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దీంట్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వారానికి రెండుసార్లు పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది.

చిక్కుళ్లు
చిక్కుళ్లు చాలా రకాలుగా దొరుకుతాయి. బీన్స్, చిక్కుడు, రాజ్మా, బఠాణీల రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు, ఫైబర్ ని కూడా కావాల్సిన మోతాదులో పొందవచ్చు.

fiber

మొక్కజొన్న
మొక్కజొన్న పొత్తులంటే ఇష్టపడని వాళ్లు ఉంటారా ? అయితే ఇవి రుచికరంగానే కాదు.. ఆరోగ్యకరం కూడా. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి.. మీకు నచ్చిన స్టైల్లో వీటిని ఆరగించండి.

English summary

Top Foods Highest in Fiber

Top Foods Highest in Fiber. Dietary fiber is an essential nutrient required for proper digestion of foods, proper functioning of the digestive tract at large, and for helping you feel full.
Story first published: Thursday, January 21, 2016, 18:04 [IST]
Desktop Bottom Promotion