For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ స్టెమ్ సెల్ ( బొడ్డు తాడు ) ఎందుకు భద్రపరచాలి ? ఉపయోగాలు ఏంటి ?

By Swathi
|

పల్లెటూర్లలో పిల్లలు పుట్టగానే.. వాళ్లకు ఉన్న బొడ్డు తాడుని కట్ చేసి.. పడేసేవాళ్లు. దీన్ని ఎందుకు పనికిరాని దానిగా భావించేవాళ్లు. కానీ.. ఇదే.. ఇప్పుడు అనేక చికిత్సలకు మూలవస్తువుగా మారింది. ఎందుకు ? బొడ్డుతాడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి ?

పిల్లల స్టెమ్ సెల్స్ స్టోర్ చేస్తున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే.. ఈ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయాలి అన్న విషయం తెలియని వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. బేబీ స్టెమ్ సెల్ ఎందుకు స్టోర్ చేయాలి ? ఎక్కడ స్టోర్ చేయాలి ? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలియని వాళ్లు ఉన్నారు. అయితే.. ఈ స్టెమ్ సెల్స్ ని ఖచ్చితంగా స్టోర్ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అయితే నగరాల్ వీటిపై అవగాహన ఉండటమే కాదు.. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి ప్రాచుర్యం కూడా ఉంది. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి స్టెమ్‌ సెల్స్‌ ఉపయోగపడతాయి. స్టెమ్ సెల్స్ అంటే.. బిడ్డ పుట్టగానే ఎందుకూ ఉపయోగపడదని కత్తిరించి పారేసే బొడ్డు తాడును.. జీవితకాల అవసరాలకు దాచుకుంటారు. దీన్నే స్టెమ్ సెల్స్ అని పిలుస్తారు. మరి ఈ స్టెమ్ సెల్స్ ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం..

బొడ్డు తాడు

బొడ్డు తాడు

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు (అంబిలికల్). పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు (స్టెమ్ సెల్స్) పుష్కలంగా ఉంటాయి.

మూల కణాలు

మూల కణాలు

ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి.

గర్భంలో

గర్భంలో

శుక్ర కణం కలవడం వల్ల అండం ఫలదీకరణ చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం, రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది.

బిడ్డ రూపం

బిడ్డ రూపం

ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం తొమ్మిది నెలల్లో ఎన్నో కణాలుగా, కణజాలంగా, అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడ అద్భుతం.

బొడ్డు తాడులో మూలకణాలు

బొడ్డు తాడులో మూలకణాలు

ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డు తాడు, గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

నూతల కణాలకు ప్రాణం

నూతల కణాలకు ప్రాణం

దెబ్బతిన్న శరీర భాగాలను మూల కణాల సాయంతో బాగు చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. మూల కణాలను ఆయా శరీర భాగాల్లోకి ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాలు ఏర్పడి వ్యాధిని నయం చేస్తాయి.

అనేక వ్యాధులకు చికిత్స

అనేక వ్యాధులకు చికిత్స

ఒకసారి స్టెమ్‌ సెల్స్‌ దాచుకుంటే... షుగర్‌, బిపి నుంచి క్యాన్సర్‌ వరకూ వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాల నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా, తేలికగా బయటపడవచ్చు.

స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స

స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స

బట్టతల, వినికిడి సమస్యలు, షుగల్‌, స్ట్రోక్‌, పెద్ద పేగుల్లో వచ్చే సమస్యలు, రక్త నాళాల సమస్యలు, జ్ఞాపక శక్తి, మెదడుకు గాయాలు వంటి ఎన్నో సమస్యలకు స్టెమ్‌ సెల్‌ ద్వారా చికిత్స అందించవచ్చు.

ఇంట్రా వీనస్ పద్ధతిలో

ఇంట్రా వీనస్ పద్ధతిలో

ఒకవేళ శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే.. మూల కణాలను ఇంట్రా వీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకూ వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు.

80 రకాల వ్యాధులు

80 రకాల వ్యాధులు

శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు తేల్చాయి.

ఇప్పటికే స్టెమ్ సెల్స్ తో చికిత్స

ఇప్పటికే స్టెమ్ సెల్స్ తో చికిత్స

ఎయిడ్స్, అల్జీమర్స్, డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ వ్యాధులు, మస్క్యులర్ డిస్ట్రోఫీ, పార్కిన్ సన్స్ వ్యాధి, మెదడు, వెన్నెముక గాయాలు, స్ట్రోక్, గర్భాశయ సమస్యలకు మూల కణాలతో చికిత్స చేయగా... సానుకూల ఫలితాలు వచ్చాయి.

రిజనరేట్ చేసే సత్తా

రిజనరేట్ చేసే సత్తా

స్టెమ్ సెల్స్ మానవ శరీరంలో అన్ని రకాల టిష్యూస్, అవయవాలు, వ్యవస్థలను మళ్లీ రీజనరేట్ చేయగలవు. ఇవి 200 రకాల టిష్యూలను పునరుత్పత్తి చేయగలుగుతాయి.

అవయవాలకు

అవయవాలకు

ఒక్కో స్టెమ్ సెల్ ఎర్ర రక్త కణంగా, నరాల కణంగా, కండరాల కణంగా విడిపోగలుగుతుంది. పునర్ నిర్మించే సత్తా, రిపేర్ చేసే గుణం, డ్యామేజ్ అయిన కణాన్ని మళ్లీ పునర్ నిర్మించే సత్తా, అనారోగ్యానికి గురైన అవయవాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే సత్తా కలిగి ఉంటాయి.. స్టెమ్ సెల్స్.

25ఏళ్లుగా

25ఏళ్లుగా

ప్రపంచ వ్యాప్తంగా స్టెమ్ సెల్స్ ని 25 ఏళ్లుగా ఉపయోగిస్తూ.. 30 వేల ట్రాన్స్ ప్లాంట్స్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించాయి.

తేలికగా మ్యాచ్ అవడం

తేలికగా మ్యాచ్ అవడం

ఈ స్టెమ్ సెల్స్ కుటుంబ సభ్యులకు చాలా తేలికగా మ్యాచ్ అయ్యే సత్తా కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఇతర వర్గాల ద్వారా స్టెమ్ సెల్స్ తీసుకోవాలంటే.. 6కి 6 శాతం కలవాలి. అదే బొడ్డు తాడు నుంచి తీసుకుంటే.. 6కి 4 శాతం మ్యాచ్ అయితే సరిపోతుంది.

పిల్లల బొడ్డు తాడుతో వేగంగా పునరుత్పత్తి

పిల్లల బొడ్డు తాడుతో వేగంగా పునరుత్పత్తి

పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే.. పిల్లల బొడ్డు తాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్.. చాలా వేగంగా.. కణాలను పునరుత్పత్తి చేయగలుగుతాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయడంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది.

English summary

What are the Stem Cells ? Is storing your stem cells a lifesaver ?

What are the Stem Cells ? Is storing your stem cells a lifesaver ? The umbilical cord that connects the mother and the baby inside the womb nurtures the baby throughout pregnancy by carrying oxygen and nutrition to the baby.
Story first published:Thursday, July 28, 2016, 16:29 [IST]
Desktop Bottom Promotion