For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరలక్ష్మీ వ్రత ఉపవాసం సమయంలో.. ఎలాంటివి తీసుకోవాలి ?

By Swathi
|

వరలక్ష్మీ వ్రతం.. చాలా ముఖ్యమైన, ప్రాముఖ్యత ఉన్న పండుగ. ఈ పూజను లక్ష్మీదేవి అనుగ్రహం కోసం.. శ్రావణ శుక్రవారం రెండోవారం దక్షిణ భారతీయులు నిర్వహిస్తారు. ఈ వరలక్ష్మీ పూజను పెళ్లైన మహిళలు.. తమ సౌభాగ్యాలు, కుటుంబ శ్రేయస్సు, సంపద కోసం నిర్వహిస్తారు.

ప్రశాంతత, సంపద, ధనం, సంతోషం, కుటుంబ శ్రేయస్సుతో పాటు.. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతం చేసే మహిళలు.. పూజ అయ్యేంతవరకు, కొంతమంది.. వరలక్ష్మీ పూజ రోజంతా ఉపవాసం పాటిస్తారు.

ఈ ఏడాది వరలక్ష్మీ వ్రత పూజను.. ఆగస్ట్ 12న జరుపుకుంటున్నాం. ఈ పూజ చేయడానికి మహిళలు ఉదయాన్నే లేచి.. బ్రహ్మ ముహూర్తంలో లేచి.. స్నానం చేస్తారు. పూజ అయ్యేంతవరకు.. ఉపవాసం ఉంటారు. అయితే.. ఈ పూజ నిర్వహించడానికి చాలా ఓపిక, శక్తి అవసరం అవుతాయి.

ఇల్లంతా శుభ్రం చేయడానికి, పూజ గది శుభ్రం చేసి అలంకరించుకోవడానికి, స్వీట్స్, వంటకాలు చేయడానికి రకరకాలుగా శారీరక శ్రమ అవసరం అవుతుంది. కాబట్టి.. ఉపవాసం సమయంలో.. కొన్ని ఆహారాలు తినడం వల్ల.. ఉపవాసం ఉన్నప్పటికీ.. ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది.

What To Eat During Varamahalakshmi Vrata

అరటిపండు
స్టామినా అందించడంలో బెస్ట్ ఫ్రూట్ అరటిపండు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ గ్లూకోజ్ ఉంటుంది. ఇది.. ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. దీన్ని ఫ్రూట్ గానే తినవచ్చు, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఒక అరటిపండు తిన్నా.. పొట్టనిండిన ఫీలింగ్ కలిగించి.. కావాల్సిన శక్తిని ఇస్తుంది.

What To Eat During Varamahalakshmi Vrata

పాలు
ఉపవాసం సమయంలో పాలు తీసుకోవడం వల్ల.. వాటి ద్వారా విటమిన్స్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. అలాగే పాలను పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఒక కప్పు పాలు తీసుకుంటే.. ఉపవాసం సమయమంతా.. ఎలాంటి నీరసం మీ దరిచేరదు.

What To Eat During Varamahalakshmi Vrata

ప్రూట్ జ్యూస్
తాజా ఫ్రూట్ జ్యూస్ లలో ఎనర్జీ అందించడానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. బొప్పాయి, పుచ్చకాయ, ఆరంజ్, దానిమ్మ వంటి ఫ్రూట్స్ తో జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే.. మీరు పూజ చేసినంత సేపు ఎనర్జిటిక్ గా, హెల్తీగా ఉంటారు.

What To Eat During Varamahalakshmi Vrata

నట్స్
బాదాం, కిస్ మిస్ లు ఉపవాసం సమయంలో ఎనర్జీని అందిస్తాయి. బాదాంలో విటమిన్ ఈ, మెగ్నీషియం ఉండటం వల్ల.. ఎనర్జీని అందిస్తాయి. కాబట్టి 3 నుంచి 4 బాదాం, 4 నుంచి 5 ఎండు ద్రాక్షలను..రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇవి.. పూజ సమయంలో కావాల్సిన శక్తిని అందిస్తాయి.

What To Eat During Varamahalakshmi Vrata

English summary

What To Eat During Varamahalakshmi Vrata (Fasting)

What To Eat During Varamahalakshmi Vrata (Fasting). Varamahalakshmi puja is one of the most important and popular celebrations in South India.This puja is especially dedicated to Goddess Lakshmi and is performed by married women.
Story first published:Thursday, August 11, 2016, 15:55 [IST]
Desktop Bottom Promotion