For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉప్పు, మిరియాలు, నిమ్మరసం తీసుకుంటే పొందే బెన్ఫిట్స్..!!

By Swathi
|

చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా హాస్పిటల్ కి వెళ్లడం అనవసరమని మీరు ఎప్పుడూ ఫీలవలేదా.. వేలకు వేలు ఖర్చయిపోవడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదా ? అంతేకాదు ఈ మోడ్రన్ మెడిసిన్స్ మనుషులకు రకరకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టే మీకొక గుడ్ న్యూస్ తీసుకొచ్చాం..

ఎక్స్ పెన్సివ్ ట్రీట్మెంట్స్ కి ఇకపై వెళ్లాల్సిన అవసరం ఉండదు. న్యాచురల్ పై మీ మనసు మళ్లిస్తే.. మీకు అంతకంటే ఫలితం మరొకటి ఉండదు. అవును చాలామంది దీన్ని నమ్మరు. మన వంటిళ్లు, పూలతోటలే.. అనేక న్యాచురల్ మెడిసిన్స్ ని ఇముడ్చుకుని ఉంటాయి. న్యాచురల్ పదార్థాల్లో ఉండే మెడిసినల్ గుణాలను చాలా మంది నిర్లక్ష్యం చేయవచ్చు.

అనేక సమస్యలు నివారించడానికి న్యాచురల్ పదార్థాలు చాలా ఉపయోగపడతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఉదాహరణకు యాంటీ బయోటిక్స్ తీసుకోవడం వల్ల ఇమ్యున్ సిస్టమ్ పై దుష్ర్పభావం చూపుతుందని అధ్యయనాలు చేస్తాయి. కాబట్టి న్యాచురల్ పద్ధతిలో ఇమ్యునిటీ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల 7 రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. మరి ఈ డ్రింక్ వల్ల ఎలాంటి వ్యాధులు నయం చేసుకోవచ్చో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉందా..

ముక్కుదిబ్బడ

ముక్కుదిబ్బడ

ఉప్పు, మిరియాల పొడి, నిమ్మలతో పాటు గోరువెచ్చని నీళ్లు కలిపి తీసుకుంటే.. శరీరంలో కావాల్సినంత హీట్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఇన్ల్ఫమేషన్ తగ్గించి, ముక్కు దిబ్బడను నివారిస్తుంది.

గొంతు నొప్పి

గొంతు నొప్పి

ఈ న్యాచురల్ డ్రింక్ యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను నివారిస్తుంది. గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గాల్ బ్లాడర్ స్టోన్స్

గాల్ బ్లాడర్ స్టోన్స్

ఉప్పు, మిరియాలు, నిమ్మలతో పాటు ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకుంటే.. గాల్ బ్లాడర్ లో ఇబ్బందిపెట్టే స్టోన్స్ నివారించవచ్చు. రెగ్యులర్ గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

ఈ మిశ్రమాన్ని వేడినీటితో కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటే మీ శరీరం మెటబాలిజం పెరిగి, ఫ్యాట్ బర్నింక్ కెపాసిటీ పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

పంటి నొప్పి

పంటి నొప్పి

గోరు వెచ్చని నీటితో కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల పంటినొప్పి నివారిస్తుంది. పుక్కిలించినా పంటినొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఫ్లూ

ఫ్లూ

ఈ మిశ్రమాన్ని తేనెతో పాటు తీసుకుంటే.. వైరస్ లతో పోరాడుతుంది. ఫ్లూ లక్షణాలను కూడా నివారిస్తుంది.

వికారం

వికారం

ఉప్పు, మిరియాలలో పొట్టలోని యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. నిమ్మరసం వికారాన్ని తగ్గిస్తుంది. అలాగే పొట్ట సమస్యలు, లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

English summary

What Salt, Pepper And Lemon Mixture Can Do To Your Body

What Salt, Pepper And Lemon Mixture Can Do To Your Body. It is always best to use natural methods to treat various diseases, as natural ingredients do not pose the threat of side effects.
Story first published: Thursday, June 2, 2016, 17:15 [IST]
Desktop Bottom Promotion