For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Milk Day 2021: మీ వయసుని బట్టి మీరు రోజుకి ఎన్ని పాలు తాగాలి ?

మీ వయసుని బట్టి ఎంత పరిమాణంలో పాలు తాగాలి ?

By Swathi
|

ప్రతి రోజూ మనం తాగే పాల వల్ల అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న పిల్లలు అయినా, పెద్ద వాళ్లైనా పాలు తాగడం చాలా మంది. పాలల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, క్యాల్షియం, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, ఫాస్సరస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి పాలు తాగడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

హనీ - మిల్క్ గోల్డెన్ కాంబినేషన్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ హనీ - మిల్క్ గోల్డెన్ కాంబినేషన్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

అయితే ఎంత పరిమాణంలో పాలు తాగాలి అనేదానిపై చాలా అయోమయం ఉంటుంది. అందులోనూ ఏ వయసు వాళ్లు, ఎన్ని పాలు తాగాలి అనేది చాలామందికి ఉండే అనుమానం. ఎంత పరిమాణంలో తాగితే ఆరోగ్యకరం, ఎంత పరిమాణంలో తాగినా అనారోగ్యకరం అనేది తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఏదో పాలు తాగాలి అని తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు.

క్యాల్షియం ఎక్కువగా లభించే పాలు తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ఎముకల ఆరోగ్యానికి, పంటి ఆరోగ్యానికి, రీహైడ్రేషన్ కి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, ఎసిడిటీ నివారించడానికి క్యాల్షియం చాలా అవసరం. అలాగే క్యాన్సర్ నివారణకు కూడా పాలు ఉపయోగపడతాయని స్టడీస్ తేల్చాయి. అలాగే చిన్నతనం నుంచే పాలు తాగడం అలవాటు చేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

అలర్ట్: వన్ ఇయర్ లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదు ? ఎందుకు ? అలర్ట్: వన్ ఇయర్ లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదు ? ఎందుకు ?

అయితే మరీ ఎక్కువగా పాలు తాగినా.. ఆరోగ్యంపై దుష్ర్పభావం ఉంటుందని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ల ఆరోగ్యాన్ని, వాళ్ల వయసుని బట్టి ఎంత పరిమాణంలో పాలు తీసుకోవాలి అనేది కంపల్సరీ పరిగణలోకి తీసుకోవాలి. మరి మీ వయసుని బట్టి మీరు రోజుకి ఎన్ని పాలు తాగాలో ఇప్పుడే తెలుసుకోండి.

0 -12 నెలలు

0 -12 నెలలు

12 నెలలలోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదు. తల్లిపాలు సురక్షితం. తల్లిపాల ద్వారా వాళ్లు ఎంత పరిమాణంలో తాగాలి అనేది తెలుస్తుంది. వాళ్లకు ఆకలి అనిపించినప్పుడు పాలు ఇవ్వడం సురక్షితం.

1-3 ఏళ్లలోపు పిల్లలకు

1-3 ఏళ్లలోపు పిల్లలకు

ఒక ఏడాది నుంచి మూడేళ్లలోపు పిల్లలకు రోజుకి 360 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం. దీనికోసం వాళ్లు రోజుకి కనీసం 100 మిల్లీలీటర్ల పాలు, 100-125 గ్రాముల పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న ద్వారా అందివ్వాలి.

4-10 ఏళ్లు

4-10 ఏళ్లు

4-10 ఏళ్లలోపు పిల్లలకు రోజుకి 130 నుంచి 150 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వడం వల్ల రోజుకి 450 నుంచి 500 మిల్లీగ్రాముల క్యాల్షియం అందుతుంది.

11-18 ఏళ్లు

11-18 ఏళ్లు

ఈ వయసు పిల్లలకు రోజుకి 800 నుంచి 1000 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరం. కాబట్టి వీళ్లు రోజుకి కనీసం 200 నుంచి 250 మిల్లీ లీటర్ల పాలు ఖచ్చితంగా తాగాలి. పాలు మాత్రమే కాకుండా.. పెరుగు, పాల ఉత్పత్తులు 200 గ్రాములు, వెన్న 30 నుంచి 40 గ్రాములు తీసుకోవాలి.

19-50 ఏళ్లలోపు

19-50 ఏళ్లలోపు

19 నుంచి 50 ఏళ్లలోపు వాళ్లు ప్రతి రోజూ 200 మిల్లీ లీటర్ల పాలు, 150 గ్రాముల పెరుగు, 30 గ్రాముల వెన్న తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది.

50 ఏళ్లు పైబడిన వాళ్లు

50 ఏళ్లు పైబడిన వాళ్లు

50 ఏళ్లు పైబడిన వాళ్లకు కావాల్సినంత క్యాల్షియం అందడానికి 200 మిల్లీ లీటర్ల పాలు ఖచ్చితంగా ప్రతిరోజూ తాగాలి. అలాగే 150 గ్రాముల పెరుగు, 30 గ్రాముల వెన్న తీసుకోవాలి.

70 ఏళ్లు

70 ఏళ్లు

70 ఏళ్ల వయసు దాటిన వాళ్లు పాలు తీసుకునే పరిమాణం పెంచాలి. వీళ్లు 230 నుంచి 250 మిల్లీ లీటర్లు రోజుకి తీసుకోవాలి.

English summary

World Milk Day2020 : Ideal Requirement Of Milk As Per Age

World Milk Day: Ideal Requirement Of Milk As Per Age. On this World Milk Day, points out the ideal age-wise milk consumption requirements per day. Have a look.
Desktop Bottom Promotion