ఏరోబిక్స్ మీ మెదడుకి చాలా మంచివి: అధ్యయనం

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఏరోబిక్ వ్యాయామం ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, అందులోనూ స్త్రీలు ఎక్కువగా ఎంచుకుంటారు. కానీ అది కేవలం బరువు తగ్గటానికి మాత్రమేకాదు, దాని వల్ల చాలా ఇతర ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం ఏరోబిక్ వ్యాయామం జ్ఞాపకశక్తిని పెంచి వయస్సు పెరుగుతున్నకొద్దీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందని తేలింది.

ఈ అధ్యయనంలో, ఆస్ట్రేలియాలోని పశ్చిమ సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు మెదడులో జ్ఞాపకశక్తికి చెందిన కేంద్రం హిప్పోకాంపస్ పై ఏరోబిక్ వ్యాయామం చూపే ప్రభావాన్ని పరిశోధించారు.

aerobics health benefits

అందరికీ తెలిసిన విషయమే మెదడు పనితీరు వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది. 40 ఏళ్ళ వయస్సు తర్వాత ఒక్కో దశాబ్దానికి 5శాతం చొప్పున మెదడు కుచించుకుపోతుంది.

ఈ పరిశోధనకి, శాస్త్రవేత్తలు 14 శాస్త్రీయ ప్రయోగాలను,అందులో 737 మంది మెదడు స్కాన్ లను ఏరోబిక్ వ్యాయామం ముందు, వెనక తర్వాత పరీక్షించారు.ఇందులో పాల్గొన్నవారు 24-76 వయస్సుల మధ్యలో ఉన్నవారు.వారిలో ఆరోగ్యకరమైన వారు, కొంచెం మెదడు పనితీరు సరిగాలేనివారు, అంటే అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు, నిజంగానే మానసిక స్థితి సరిగాలేని వారు, డిప్రెషన్, స్క్రిజోఫ్రెనియా ఉన్నవారు అందరూ కలిసి ఉన్నారు.

పరిశోధకులు ఏరోబిక్ వ్యాయామాలు అయిన స్థిరమైన సైక్లింగ్, నడక మరియు ట్రెడ్ మిల్ పరుగు ప్రభావాలను పరీక్షించారు. ఈ పరీక్ష కాలవ్యవధి 3 నుంచి 24 నెలల మధ్యలో వారానికి రెండు నుంచి ఐదు సార్ల వ్యాయామంతో జరిగింది.

ఈ అధ్యయనం ఫలితాలు వ్యాయామం పూర్తి హిప్పోకాంపల్ పరిమాణంపై ఏ ప్రభావం చూపదని తెలిసింది,కానీ అది మానవుల హిప్పోకాంపస్ ఎడమవైపు పరిమాణం తప్పక పెరుగుతుందని తేలింది.

“మీరు వ్యాయామం చేసినప్పుడు మెదడు నుంచి స్రవించిన న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది వయస్సుతో మెదడు కుచించకపోకుండా నివారించటంలో సాయపడుతుందని “ వెస్టర్న్ సిడ్నీ యూనివర్శిటీ,నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ కి చెందిన జోసెఫ్ ఫిర్థ్ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ ,” మా డేటా ప్రకారం హిప్పోకాంపస్ పూర్తి పరిమాణం పెంచటం కన్నా, ఏరోబిక్ వ్యాయామాల ముఖ్యమైన మెదడు లాభాలు , మెదడు పరిమాణం కుచించకుండా కాపాడటం’ అని అన్నారు.

ఈ అధ్యయనం జర్నల్ న్యూరోఇమేజ్ లో ఇటీవల ప్రచురితమైంది.

అదేసమయంలో, ఏరోబిక్ వ్యాయామాల కొన్ని పెద్ద ఆరోగ్య లాభాలను చూడండి.

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఏరోబిక్ వ్యాయామాలు రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి.రెగ్యులర్ గా చేసే వ్యాయామంతో రోగనిరోధకశక్తి పెరిగి అనేక ఇన్ఫెక్షన్లను, వ్యాధులను నివారించబడతాయి.

2. గుండెకి మంచిది

2. గుండెకి మంచిది

ఏరోబిక్ వ్యాయామం రెగ్యులర్ గా చేయటం మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రన్నింగ్, వాకింగ్, ఈత, సైక్లింగ్ మరియు కొన్ని ఇంట్లో చేసే వ్యాయామాలు రక్తప్రసరణ సరిగ్గా ఉంటుంది. గుండె జబ్బులను నివారిస్తాయి.

3. కండరాలకి మంచిది

3. కండరాలకి మంచిది

కండరాల నొప్పితో,నడుంనొప్పితో బాధపడేవారికి ఏరోబిక్స్ చాలా మంచిది. అది కండరాలకి తగినంత ఆక్సిజన్ అందించి కండరాలను లాక్టిక్ యాసిడ్ వంటి వ్యర్థపదార్థాలకి దూరంగా ఉంచుతుంది. ఇది ఎలాంటి కండరాల నొప్పినైనా తగ్గిస్తుంది.

4. బరువు తగ్గటం

4. బరువు తగ్గటం

ఎలాంటి వ్యాయామమైనా శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. రెగ్యులర్ గా ఏరోబిక్ వ్యాయామాలు రోజుకి 15నిమిషాలు చేసినా చాలు బరువు తగ్గుతారు.

5. మానసిక వత్తిడి తగ్గుతుంది

5. మానసిక వత్తిడి తగ్గుతుంది

మానసిక వత్తిడిని తగ్గించే వ్యాయామాలలో ఏరోబిక్స్ చాలా ప్రసిద్ధమైనవి. మీరు చాలా వత్తిడిలో ఉంటే రెగ్యులర్ గా ఏరోబిక్స్ చేయటం వలన ప్రశాంతంగా మారతారు.

English summary

Aerobic Exercises Are Good For Your Brain: Study

Aerobic exercises are generally taken up by people, especially female who want to lose weight. But it is not just for weight loss, aerobic exercises have plenty of other health benefits. A new study has found that aerobic exercise can improve memory function and maintain brain health as we age..
Story first published: Wednesday, November 29, 2017, 7:30 [IST]
Subscribe Newsletter