నల్లికాయ (ఉసిరికాయ) జ్యూస్ తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

ఆమ్లా, దీన్నే ఇండియన్ గ్రూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. తెలుగులో ఉసిరికాయ అంటారు. ఉసిరికాయలో పోషకాలు అత్యధికంగా ఉన్నాయి.

పోషకాలు అధికంగా ఉండటం వల్ లఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆ ప్రయోజనాలేంటో ఒకసారి తెలుసుకున్నారంటే దీన్ని ఉసిరికాయను తినకుండా, ఆమ్లా జ్యూస్ ను తాగకుండా మాత్రం ఉండలేరు. ఆమ్లాను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చర్మంలో మంచి గ్లో వస్తుంది, ఆమ్లాలో అద్భుత ఆరోగ్యప్రయోజనాలున్నాయి.

ఆమ్లా జ్యూస్ లో ఉండే విటమిన్ సి, ఐరన్ వంటి పోషక పదార్థాలు ప్రాణాంత వ్యాధులను దూరం చేస్తుంది.అలాగే వ్యాధినిరోధకతను పెంచుతుంది.

Health Benefits Of Drinking Amla Juice

ఉసిరికాయ తినడానికి కాస్త ఒగరుగా అనిపించినా, అందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయన్న విషయం మర్చిపోకూడదు. ఆరోగ్యపరంగా ఇవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

ఆమ్లా గురించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఇతర ఏ పండ్లలో కానీ, వెజిటేబుల్స్ లో కానీ లేవు. అలాగే ఇతర ఏ టానిక్ కు సాటి రావు, మరి ఇన్సి సుగుణాలున్న ఆమ్లా జ్యూస్ ఆరోగ్యానికి ఏవిధంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం...

కలబంద మరియు ఉసిరికాయ రసాల మాయాఔషధంతో సులభంగా బరువు తగ్గండి

ఫ్యాట్ బర్న్ చేస్తుంది:

ఫ్యాట్ బర్న్ చేస్తుంది:

ఎక్స్ ట్రా ఫ్యాట్ ను కరిగించుకోవడానికి ఆమ్లా జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆమ్లా జ్యూస్ మెటబాలిజం రేటు పెంచుతుంది, ప్రోటీన్ సింథసిస్ ఫ్యాట్ చేరకుండా చేస్తుంది. టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది. ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. దాంతో ఫ్యాట్ బర్న్ అవుతుంది.

మలబద్దకం తగ్గిస్తుంది:

మలబద్దకం తగ్గిస్తుంది:

ఆమ్లా జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బౌల్ మూమెంట్ చురుగ్గా మారుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల బౌల్ మూమెంట్ మెరుగ్గా పనిచేసి,పెద్ద ప్రేగులోని టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా బయటకు నెట్టేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ అందుకు బాగా సహాపడుతుంది. అయితే పరిమితంగా మాత్రమే దీన్ని తీసుకోవాలి.

ఒక వారంలో మౌత్ అల్సర్ పోగొట్టే ఆమ్లా రెమెడీ

రక్తం శుద్ది చేస్తుంది:

రక్తం శుద్ది చేస్తుంది:

ఆమ్లా జ్యూస్ బ్లడ్ ప్యూరిఫైయర్. ఇది అవాంఛిత టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. హీమోగ్లోబిన్, మరియు ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఇది న్యాచురల్ డిటాక్సిఫయర్ గా పనిచేస్తుంది,ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ గ్లోయింగ్ స్కిన్ కు సహాయపడుతుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

ఆమ్లా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఆమ్లా జ్యూస్ లో ఉండే విటమిన్ సి కంటెంట్, కంటి కండరాలాను స్ట్రాంగ్ గా మార్చి కంటి చూపును మెరుగుపరుస్తుంది.

హార్ట్ హెల్త్ కు మంచిది:

హార్ట్ హెల్త్ కు మంచిది:

ఆమ్లా జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హార్ట్ కు మంచిది. ఎలా అంటే ఇది శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో గుండెకు సరఫరా అయ్యే రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఆమ్లా జ్యూస్ లో ఉండే అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా దూరం చేస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది:

ఎముకల ఆరోగ్యానికి మంచిది:

మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు క్యాల్షియం అధికంగా అవసరం అవుతుంది. ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల ఇందులో ుండే విటమిన్ సి క్యాల్షియం గ్రహించడానికి ఎక్కువగా సహాయపడుతుంది.

పీరియడ్స్ లో నొప్పులను తగ్గిస్తుంది:

పీరియడ్స్ లో నొప్పులను తగ్గిస్తుంది:

నొప్పులను నివారించడంలో న్యాచురల్ రెమెడీ ఆమ్లా, పీరియడ్స్ లో బ్యాక్ పెయిన్, స్టొమక్ పెయిన్ వంటి నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, నిమ్మరసంలో ఉండే విటమిన్స్, మినిరల్స్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి ఎఫెక్టివ్ గా సమాయపడుతుంది. పొట్టను ప్రశాంతంగా మార్చుతుంది.

ఆస్త్మా నుండి ఉపశమనం కలిగిస్తుంది:

ఆస్త్మా నుండి ఉపశమనం కలిగిస్తుంది:

ఆమ్లా జ్యూస్ ను తేనెతో చేర్చి తీసుకుంటే ఆస్త్మా దూరం అవుతుంది. వాస్తవానికి దీన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ుంటుంది. ఆమ్లా జ్యూస్ ఆస్త్మా మాత్రమే కాదు, శ్వాస సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది.

హెయిర్ ఫాల్, తెల్లజుట్టు, చుండ్రు అనేక సమస్యలకు ఉసిరి దివ్వ ఔషధం!

క్యాన్సర్ నివారణి:

క్యాన్సర్ నివారణి:

ప్రస్తుతం ఈ ప్రంచంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్. అలాంటి క్యాన్సర్ లక్షణాలను నివారించడానికి ఆమ్లా జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్య పాత్రను పోషిస్తాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

మీరు డయాబెటిస్ తో బాధపడుతుంటే కనుకు రెగ్యులర్ డైట్ లో ఆమ్లా జ్యూస్ ను చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఆమ్లా జ్యూస్ లో ఉండే క్రోమియం కంటెంట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ లెవల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో కొద్దిగా పసుపు, తేనె చేర్చి తీసుకుంటే డయాబెటిస్ ఎఫెక్టివ్ గా కంట్రోల్లో ఉంటుంది.

English summary

Health Benefits Of Drinking Amla Juice

Health Benefits Of Drinking Amla Juice,Amla juice has plenty of health benefits. Know about these benefits here on Boldsky.
Story first published: Wednesday, November 1, 2017, 16:00 [IST]