For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు మీ పొట్టపై నిద్రిస్తున్నారా? అయితే, మీరు ఇది తప్పక చదవండి!

By Lakshmi Bai Praharaju
|

అయితే, మీ పొట్టపై మీరు నిద్రించడం చెడు అలవాటా? దీనికి సమాధానం – అవును! మీ పొట్టపై మీరు నిద్రించడం వల్ల మీ వెన్నుపూస, వీపు కి ప్రమాదం కలిగే అవకాశం ఉంది.

దీనివల్ల నిద్ర సరిగా పట్టక, శరీరం మొత్తం అసౌకర్యంగా ఉంటుంది. మీరు గర్భవతి అయినట్లయితే, మీ నిద్ర భంగిమ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Are You Sleeping On Your Stomach?

పొట్ట మీద నిద్రించడం మంచిది కాదా

పొట్టపై నిద్రించే చాలామంది నొప్పులను చవిచూసే ఉంటారు. అది మెడ భాగంలో, వెన్ను లేదా కండరాల నొప్పి కావొచ్చు, ఆ నొప్పులకు కారణం మీరు సరైన భంగిమలో నిద్రించడం లేదు అని. ఎక్కువ నొప్పులు ఉన్నాయి అంటే అర్ధం మీరు రాత్రిళ్ళు నిద్రమధ్యలో లేవడం, ఉదయం తక్కువ విశ్రాంతిగా ఉన్నట్టు కనిపించడం.

Are You Sleeping On Your Stomach?

పొట్టమీద నిద్రించడం వల్ల ఖచ్చితమైన ప్రభావాలు ఏమి ఉంటాయి

పొట్టమీద నిద్రించడం వల్ల వెన్ను, వీపు భాగం అలసిపోతాయి. ఎందుకంటే ఎక్కువ బరువు మీ మేడమీద పడుతుంది కాబట్టి. కాబట్టి, నిద్రించేటపుడు వెన్నును నిఠారుగా ఉంచడం కష్టం కాబట్టి.


వెన్ను మీద వత్తిడి పడితే, అది శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. మీ వెన్ను నరాలకు పైప్ లైన్ కాబట్టి, వెన్ను నొప్పి వల్ల మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి రావొచ్చు.

మీ శరీర భాగాలూ గాఢనిద్రలో ఉన్నపుడు మీకు జలదరింపు, తిమ్మిరి కూడా వచ్చే అవకాశం ఉంది. మీ పొట్టపై నిద్రపోతే మీ వెన్నుని ప్రభావితం చేయవచ్చు. ఇది మీ తల, వెన్నుముక అమరికను సరిగా ఉంచక, మీరు మీ పొట్టపై నిద్రించేటపుడు మీ తల పక్కకు వాలవచ్చు. దీనివల్ల ముందుముందు మెడ సమస్యలు కూడా రావొచ్చు.

Are You Sleeping On Your Stomach?

ఈ భంగిమలో మీరు నిద్రిస్తే మీ శరీరానికి ఏమవుతుంది?

ఈ భంగిమలో ఎక్కువసేపు నిద్రిస్తే హీర్నిఎటేడ్ డిస్క్ సమస్యలు వస్తాయి. మీ వెన్నుముక మధ్య ఉండే జేలాటినస్ డిస్క్ విరిగే ప్రమాదం ఉంది. ఈ జెల్ డిస్క్ నుండి బైటికి వస్తే, ఇది నరాలను ఇబ్బంది పెడుతుంది.

Are You Sleeping On Your Stomach?

పొట్టమీద నిద్రించడం తప్పా

మీరు గర్భవతి అయితే, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. గర్భం ధరించిన తరువాత పొట్ట మీద నిద్రించడం కష్టం కావొచ్చు, కానీ దీన్ని మరి త్వరగా మానుకోండి. మధ్యలో అదనపు భారం పడడం వల్ల మీ వెన్ను లాగినట్టుగా ఉంటుంది.

కాబట్టి, ఇదంతా చదివిన తరువాత, మీరు పొట్టపై నిద్రించే అలవాటుని మానుకోవడానికి ప్రయత్నించండి!

English summary

Are You Sleeping On Your Stomach?

If you're sleeping on your stomach, then it's high time you stopped it. Read to know more!
Story first published:Wednesday, November 22, 2017, 17:14 [IST]
Desktop Bottom Promotion