ప్రొబయోటిక్స్ బరువు తగ్గించటంలో ఎలా సాయపడతాయి, తెలుసుకోండి!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్రొబయోటిక్స్ ప్రాథమికంగా ఆరోగ్యానికి మంచిదైన, ప్రత్యక్షంగా ఉండే బాక్టీరియా మరియు ఈస్ట్. తరచూ మంచి మరియు ఆరోగ్యకరమైన బాక్టీరియాగా చెప్పబడే ఈ ప్రొబయోటిక్స్ మీ గట్ ని ఆరోగ్యకరంగా ఉంచడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

ఇది మీరు ముందు కూడా విని ఉంటారు,కానీ ప్రొబయోటిక్స్ బరువు తగ్గడానికి కూడా పనికివస్తుందనే విషయం మీకు ఆశ్చర్యం కలిగించచ్చు మరియు చాలా మందికి తెలికపోయుండచ్చు కూడా.

యోగర్ట్ అని వాడుకలో పిలిచే పెరుగు బజారులో ఎక్కువగా మరియు తేలికగా దొరికే ప్రొబయోటిక్స్.ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది అని ప్రాచుర్యంలో ఉంది.

How Probiotics Help You To Lose Weight, Check It Out!

మనం ప్రొబయోటిక్స్ అని చెప్పినప్పుడు దానిలో చాలా రకాలు ఉంటాయి. లాక్టోబాసిల్లస్, బిఫిడొబ్యాక్టీరియం ,సకారోమైసిస్ బౌలర్డి అని మూడు ప్రధాన రకాల ప్రొబయోటిక్స్ ఉంటాయి.ఈ మూడిట్లో లాక్టోబాసిల్లస్, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

లాక్టోబాసిల్లస్ యోగర్ట్,కెఫిర్ గింజలు మరియు సౌవెర్ క్రాట్లో సమృధ్ధిగా దొరుకుతుంది.

ఇంతకి ప్రొబయోటిక్స్ ఎలా బరువు తగ్గించి , పొట్టలోని కొవ్వుని కరిగిస్తుంది? ప్రొబయోటిక్స్ గురించి కొన్ని వాస్తవాలు మరియు బరువు తగ్గించే విధానం ఇక్కడ వివరించారు.ఒకసారి చూడండి.

1. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.

1. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.

ప్రొబయోటిక్స్ లో శరీరానికి కావాల్సిన ఖనిజాలు,విటమిన్లు ఘనంగా ఉంటాయి.మంచి మొత్తంలో ప్రొబయోటిక్స్ తీసుకోవడం వలన అది పోషకాలను సమర్థవంతంగా పీల్చుకొని జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది.

ఇది తక్కువ తినడానికి మరియు అదే సమయంలో ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండేలా చేస్తుంది కనుక బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

2. కేలరీలను పీల్చుకోడాన్ని తగ్గిస్తుంది

2. కేలరీలను పీల్చుకోడాన్ని తగ్గిస్తుంది

సరైన మొత్తంలో ప్రొబయోటిక్స్ తీసుకుంటే అది శరీరాన్ని ఎక్కువ కేలరీలు తీసుకోకుండా తగ్గిస్తుంది.అయితే ప్రొబయోటిక్స్ లో ఉండే మంచి బ్యాక్టీరియా మీ ఆరోగ్యానికి మంచిది.ప్రొబయోటిక్స్ క్రమ పద్దతిలో తీసుకుంటూ మరియు వ్యాయామం కూడా చేస్తే బరువు తొందరగా తగ్గుతుంది.

3. కొవ్వు పేరుకోడాన్ని తగ్గిస్తుంది

3. కొవ్వు పేరుకోడాన్ని తగ్గిస్తుంది

ప్రొబయోటిక్స్ తీసుకోవడం వల్ల ఉత్పత్తయ్యే ప్రోటీన్ కొవ్వుని కరిగిస్తుంది.అదే సమయానికి,ప్రొబయోటిక్స్ శరీరంలో కొవ్వు పేరుకుపోవటాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.ఇది క్రమంగా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

4. ఆకలిని అణచివేస్తుంది

4. ఆకలిని అణచివేస్తుంది

ప్రొబయోటిక్స్ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవడం వలన శరీరంలో లెప్టిన్ స్థాయి పెరుగుతుంది.ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు పొట్ట నిండి ఉండేలా చేసి, రెండు భోజనాల మధ్యలో ఎక్కువ తినకుండా ఉండేలా కాపాడుతుంది.దీని వల్ల బరువు తగ్గుతుంది.

5. ఒత్తిడిని తగ్గిస్తుంది

5. ఒత్తిడిని తగ్గిస్తుంది

బరువు పెరగడం మరియు ఒత్తిడి రెండూ ఒకదానికొకటి సంబంధించి ఉన్నవే.బరువు పెరగడానికి ఒత్తిడి పెరగడం ప్రధాన కారణం.ప్రొబయోటిక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి సరైన మోతాదులో ప్రొబయోటిక్స్ తీసుకుంటే అది మీ గట్ అరోగ్యంగా ఉండటంలో సహాయం చేస్తుంది, హార్మోన్లని నియంత్రించి తద్వారా ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది.

ఇక దానంతట అదే బరువు తగ్గుతుంది

ప్రొబయోటిక్స్ వల్ల బరువు తగ్గటమే కాకుండా ఆరోగ్యానికి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.వాటిల్లో కొన్ని ఇక్కడ వివరించబడ్డాయి.చూడండి.

1. రోగ నిరోధక శక్తి పెంచుతుంది:

1. రోగ నిరోధక శక్తి పెంచుతుంది:

ప్రొబయోటిక్స్ కి మంచి బ్యాక్టీరియా అని పేరుంది.ప్రొబయోటిక్స్ అధికంగా ఉండే పదార్థాలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి,పలు అంటువ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడంలో సహాయపడుతుంది.

2. గుండెకి మంచిది:

2. గుండెకి మంచిది:

ప్రొబయోటిక్స్ ఆహారం తీసుకోవడం వలన మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది.అది ఆరోగ్యంగా ఉండటం వలన కొలెష్ట్రాలు నియంత్రణలో ఉండి,శరీరంలో కొవ్వు పేరుకోవటాన్ని నివారించి తద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3) కడుపులో మంటని నివారిస్తుంది

3) కడుపులో మంటని నివారిస్తుంది

ప్రొబయోటిక్స్ మంట వ్యతిరేక లక్షణాలకు ప్రసిద్ధి .ప్రొబయోటిక్స్ అధికంగా ఉన్న పదార్థాలు క్రమపద్ధతిలో తినడం వలన కడుపులో మంట రాకుండా నివారిస్తుంది మరియు జీవక్రియని పెంచుతుంది కూడా.

4) మూత్రాశయ ఇన్ఫెక్షన్ యూ టి ఐ నివారణలో సహాయం

4) మూత్రాశయ ఇన్ఫెక్షన్ యూ టి ఐ నివారణలో సహాయం

ఆడవాళ్ళ కి వచ్చే ఆరోగ్య సమస్యలో మూత్ర నాళ ఇన్ఫెక్షన్(యూ టి ఐ)ప్రధానమైనది. ప్రోబయొటిక్స్లో మంచి బ్యాక్టీరియ ఉండటం వలన, అది మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచి ఎటువంటి ఇన్ఫెక్షన్లతో అయిన పోరాడుతుంది.కనుక, మీరు యు టి ఐ తో బాధపడుతుంటే , క్రమ పద్దతిలో ఒక కప్పు పెరుగుని తీసుకుంటే తగ్గుతుంది.

5) ఆరోగ్యవంతమైన చర్మం

5) ఆరోగ్యవంతమైన చర్మం

ప్రొబయోటిక్స్ వాటి మంట వ్యతిరేక లక్షాణాలకి ప్రసిద్ధి.ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు సరైన మోతాదులో తినడం వలన తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది.

ప్రొబయోటిక్స్ వలన బరువు తగ్గడం మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయని ఎంత తెలుసుకున్నామనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రొబయోటిక్స్ తినడంతో పాటు ఇతర సరైన ఆహార పద్దతులు మరియు వ్యాయామం కూడా రోజూ దినచర్యలో భాగంగా పాటించాలి.

English summary

How Probiotics Help You To Lose Weight, Check It Out!

How Probiotics Help You To Lose Weight, Check It Out!,
Story first published: Tuesday, December 26, 2017, 17:00 [IST]