For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీవిత కాలాన్ని తగ్గించే 8 రోజువారీ మీరు అనుసరిస్తున్న అలవాట్లు!

By Ashwini Pappireddy
|

ఒక అమెరికన్ నటుడు మరియు ప్రఖ్యాతి ఫిట్నెస్ బోధకుడు ఒకసారి ఈ విధంగా చెప్పారు, "నిజమైన అహంకారం, నిజమైన జీవితం మీ ఆరోగ్యం మరియు దీర్ఘాయువు".

మనలో చాలామంది పైన తెలిపిన వాక్యాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తారు, ఎందుకంటే ప్రధమంగా ప్రతి జీవి దీర్ఘాయువు యొక్క లక్ష్యం వైపుగా లేదా సుదీర్ఘమైన జీవిత కాలాన్ని పొందాలనుకుంటాడు.

అన్ని ప్రాణమున్న జీవులు జంతువులు, మనుషులతో సహా అన్ని సహజంగా నిర్మితమైన మనుగడ స్వభావం కలిగి ఉంటాయి, ఇది మనల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా, మరియు ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.

ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రోజుల్లో, మరణం అనే భావన గురించి తెలుసుకున్నప్పుడు ,మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యం అని తెలిసినప్పటికీ, మనలో చాలామంది మరణం గురించి అనవసరంగా కంగారు పడిపోయి,దానిగురించే భయపడుతూ దిగులు చెందుతారు.

అనుకోకుండా జరిగే ప్రమాదాలు, వ్యాధులు, మొదలైన అకాల మరణాలకు దారితీసే సంఘటనల వల్ల మనం ఎక్కువగా బయపడుతుంటాము.

మానవ జీవితకాలం సగటున 80 మరియు 100 సంవత్సరాల మధ్యలో ఉంటుందని మనకి బాగా తెలుసు.అందువల్ల మనలో చాలామంది వున్నన్ని రోజులు ఆరోగ్యంతో సంపూర్ణ జీవితాన్ని పొందాలని కోరుకుంటారు.

Daily Habits You Could Be Following That Can Shorten Your Life Span!

సహజంగానే, మనం ఏదయినా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, అది మానసిక పరంగా లేదా శారీరకమైనది అయినా, ప్రత్యేకించి అది తీరని మరియు దీర్ఘకాలిక సమస్య అయినట్లయితే, అది మన జీవిత కాలాన్ని తగ్గిస్తేస్తుంది.

కావాలనుకుంటే,సుదీర్ఘ కాలం పాటు వివిధ రకాల వ్యాధులతో బాధపడే అనేక వృద్ధులను మన చుట్టూ మీరు చూడవచ్చు, వారు ఆ వ్యాధుల వల్ల కలిగే నొప్పి మరియు బాధని అనుభవిస్తూ వారి జీవితాన్ని గడుపుతుంటారు.

కాబట్టి, మంచి ఆరోగ్యం మీరు దీర్ఘాయువు ని పొందడానికి మరియు మీ జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవడంలో చాలా ముఖ్యమైన అంశం.

అయితే,మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం ఏమి కాదు, అది రోజువారీ మనం అనుసరించే ఆరోగ్యకరమైన అలవాట్లతో మరియు బలమైన సంకల్పంతో వస్తుంది.

మనము ప్రతిరోజు తప్పకుండా కొన్ని అలవాట్లను అనుసరించడం వలన మన జీవితకాలంలో, ఎదురయ్యే వ్యాధులనుండి లేదా తొందరగా మరణించడం అనేటటువంటి వ్యాకులత నుండి బయటపడి ఎక్కువ కాలం జీవించే అవకాశాలున్నాయి.


మీరు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితాన్ని కావాలని కోరుకుంటున్నారా? అయితే మనం ఎలాంటి అలవాట్లను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అలవాటు # 1: మిడ్నైట్ అల్పాహారం

అలవాటు # 1: మిడ్నైట్ అల్పాహారం

మీరు అర్ధరాత్రుల్లో కూడా భరించలేనటువంటి ఆకలితో చింతిస్తున్నారా? ఆ ఆకలిని తీర్చుకోవడానికి మీరు ఎదో ఒక చిరుతిండిని మీ ఫ్రిజ్ని లో దాచిపెడుతున్నారా?మీ సమాధానం అవును అయితే మీ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని గమనించాలి. ఎందుకంటే ఈ అలవాటు మీ జీవిత కాలాన్ని తగ్గిచేస్తుంది. సమయంకాని సమయంలో ఇలాంటి అనారోగ్యకరమైన చిరు తిండి తినడంవలన అది మీ జీవక్రియను భగ్నం చేయగలవు మరియు అనేక వ్యాధులను కూడా తెచ్చి పెట్టగలవు.

అలవాటు # 2: టీవీ కి అతుక్కుపోవడం

అలవాటు # 2: టీవీ కి అతుక్కుపోవడం

మీరు టీవీ కార్యక్రమాలు లేదా చలన చిత్రాలను చూస్తూ ప్రతి రోజు ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిపినట్లైతే అది మీ జీవితకాలాన్ని తగ్గించే అలవాట్లలో ఒకటిగా వుంది, ఎప్పుడూ టీవీ స్క్రీన్ ని చూడటం లేదా కంప్యూటర్ ని చూడటం వలన అది మీ కళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా మన మెదడు మరియు మన ఆరోగ్యం మీద ప్రతికూల రేడియేషన్ల ప్రభావం పడుతుంది. కాబట్టి, చూడడానికి చాలా మంచి విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ, ప్రతిరోజూ మీరు చూసే టీవీ కోసం ఒక ఒక గంటకు మాత్రమే పరిమితం చేయాలి.

అలవాటు # 3: అధిక మొత్తంలో ఉప్పుని ఉపయోగించడం

అలవాటు # 3: అధిక మొత్తంలో ఉప్పుని ఉపయోగించడం

ఒకవేళ మీరు ఫుడ్ ని బాగా ఇష్టపడేవారు అయుండి, అందులోను ఉప్పుని ఎక్కువగా తీసుకున్నట్లైతే, అప్పుడు మీరు మీ జీవితాన్ని ప్రమాదంలో వుంచినట్లే మరియు ఇది మీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ఉప్పు అధికంగా వున్న ఆహార పదార్థాలని తీసుకోవడం వలన ఇది అధిక రక్తపోటుకు కారణమవుతాయి, ఇది ఇంకా ఒక వ్యక్తిని చంపగల ప్రాణాంతక గుండె వ్యాధికి కూడా కారణమవుతుంది!

అలవాటు # 4: అపరిశుభ్రంగా ఉండటం

అలవాటు # 4: అపరిశుభ్రంగా ఉండటం

మీరు వ్యాయామశాల నుండి ఇంటికి, లేదా బయట వీధులలో తిరిగి ఇంటికి వచ్చాక మీరు మీ చేతులని యాంటీబాక్టీరియల్ సబ్బులను ఉపయోగించి శుభ్రంగా స్నానం చేయకపోయినా, కడుకోకపోయినట్లైతే కనీస వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను అనుసరించకపోతే, మీ చుట్టూ అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి అవి మీ శరీరంలోనికి ప్రవేశించి మరియు మీ జీవిత కాలాన్ని తగ్గించే అనేక రకాల వ్యాధులకు కారణం కావచ్చు!

అలవాటు # 5: ఫ్లాస్సింగ్

అలవాటు # 5: ఫ్లాస్సింగ్

న్యూయార్క్ యూనివర్సిటీ లో చేసిన ఇటీవలి పరిశోధనల ప్రకారం, తరచూ మీ దంతాలకు ఫ్లాస్సింగ్ చేయడం వలన మీ జీవిత కాలం సుమారు 6 సంవత్సరాల వరకు పెంచవచ్చని ఒక అంచనాలలో తేలింది. ఎందుకంటే ఫ్లాస్సింగ్, గమ్ వ్యాధి యొక్క అవకాశాలను తగ్గిస్తుంది. ధమనులలో వచ్చే గమ్ వ్యాధులు గుండె జబ్బుతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి, అందువలన ఇలాంటి వ్యాధులు ప్రాణాంతకరమైన గుండె జబ్బు ని కలిగిస్తాయి.

అలవాటు # 6: అసురక్షితమైన సెక్స్

అలవాటు # 6: అసురక్షితమైన సెక్స్

అసురక్షితమైన సెక్స్ ని ఆచరించే వ్యక్తులు, ప్రత్యేకంగా వారు ఇద్దరు భాగస్వాములను కలిగి ఉన్నప్పుడు, వారి జీవితాలను ప్రమాదంలో ఉంచడం కూడా సాధ్యపడుతుంది ఎందుకంటే HIV, హెపటైటిస్, మొదలైనవి వంటి ఎనేబుల్ చేయలేని STDs (లైంగికంగా వ్యాపించే వ్యాధులు) కాబట్టి, రక్షణను వాడటం మరియు మీ భాగస్వాములు ఎస్.డి.డి.ల నుండి స్వేచ్చని కలిగివుండేలా చేసుకోవడం చాలా ముఖ్యం!

అలవాటు # 7: గోళ్లు కొరకడం

అలవాటు # 7: గోళ్లు కొరకడం

అవును, ఇది చాలా ప్రమాదకరమైన చెడు అలవాటులా కనిపిస్తున్నప్పటికీ, నిజానికి గోళ్లు కొరకడం అనేది ప్రాణాంతకరమైన అనారోగ్యానికి కారణమవుతుంది మరియు దీనిని క్రమం తప్పకుండా చేసినట్లయితే ఇది ఆ వ్యక్తి యొక్క జీవితకాలాన్ని తగ్గించవచ్చు. మీరు గోళ్లు కొరికినప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు మీ శరీరంలోనికి ప్రవేశించి మరియు తీవ్రంగా రక్తాన్ని పీల్చడం 'సెప్సిస్' అని పిలవబడే వ్యాధికి గురై మరణానికి కూడా దారి తీస్తుంది.

అలవాటు # 8: బ్రేక్ఫాస్ట్ ని చేయకపోవడం

అలవాటు # 8: బ్రేక్ఫాస్ట్ ని చేయకపోవడం

అనేక శాస్త్రీయ పరిశోధనలు రుజువు చేసినట్లుగా అల్పాహారాన్ని క్రమంగా మిస్ చేయడం వలన మీ జీవక్రియ స్థాయిలు మరియు మీ రోగనిరోధకతను తగ్గిస్తుంది. మీ రోగనిరోధకత మరియు జీవక్రియ తక్కువగా ఉన్నప్పుడు, మీ శరీరం వ్యాధులతో సమర్థవంతంగా పోరాడలేకపోవచ్చు, అందువలన మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి మరియు ఇది ఇంకా మీ జీవిత కాలాన్ని తగ్గించేస్తుంది.

English summary

Daily Habits You Could Be Following That Can Shorten Your Life Span!

Maintaining good health is not an easy feat and it comes with following certain healthy habits on a daily basis with a strong will.Now, there are certain daily habits that we may be following which could actually shorten our life span by causing diseases or bringing about an early death.Have a look at what they are and avoid them, if you want a long, healthy life!
Desktop Bottom Promotion