For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆరోగ్యం గురించి మీ కళ్ళు చెప్పే విషయాలు

By Lekhaka
|

"మీలో ఉన్న ఆత్మకి మీ కళ్లే అందమైన కిటికీలు" అని సాధారణంగా చెప్పవచ్చు. ఎవరో ఎందుకు ఇలా చెప్పారో అన్న విషయం మీద చర్చలు జరుపగా, మీ కళ్లు మీ గూరించి, మీ ప్రస్తుత ఆరోగ్యం గూర్చి పూర్తిగా నిజాలనే వెల్లడిస్తాయని బయటపడింది.

నేత్రవైద్యులు చాలా సంవత్సరాలుగా కష్టపడుతూ, వేల డాలర్లను ఖర్చు చేస్తూ కళ్లలో గల లోపాలను గూర్చి, సాధారణ కంటి చూపు గూర్చి తెలుసుకుంటారు. కానీ మీ కళ్ల ద్వారా బయటపెట్టే కొన్ని విషయాల కోసం మీకు ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు.

కంటి పవర్ ను పెంచే టాప్ 20 ఫుడ్స్ కంటి పవర్ ను పెంచే టాప్ 20 ఫుడ్స్

1. కంటిరెప్ప మీద గట్టి కురుపు :

1. కంటిరెప్ప మీద గట్టి కురుపు :

మీరు ఎప్పుడైనా కంటిరెప్ప మీద గడ్డ కలిగి ఉంటే,

అది ఎంత బాధాకరంగా, చిరాకుగా ఉంటుందో మీకు బాగా తెలుసు. అది సాధారణంగా ఏర్పడినది అయినా సరే. కొవ్వును పట్టి ఉంచే ఒక గ్రంధి కారణంగా మీ కంటి కనురెప్పల మీద గట్టి కురుపు లేదా గడ్డని ఏర్పరుస్తుంది. ఇది సాధారణంగా కొద్ది రోజుల్లో ఉంటుంది, లేదంటే అది కొన్ని నెలలుగా కొనసాగుతూ ఉంటుంది.

మీకు ఈరకమైన ప్రభావం ఎదురైనట్లయితే, దాని అసౌకర్యం వల్ల వచ్చే భాద సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈసమస్య ఉన్నవారికి సేబాషియస్ (కొవ్వు) గ్రంధులు ద్వారా మరింత హానికరంగా మారిన్నట్లయితే అది క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. కాబట్టి, మీరు ఈ రకమైన గడ్డలను దీర్ఘకాలం నుండి తరచుగా కనురెప్పల వంటి ప్రదేశంలో సంభవించేగా ఉంటే, మీరు ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది.

 2. సన్నని కనుబొమ్మలు :

2. సన్నని కనుబొమ్మలు :

వృద్ధాప్యం, ఒత్తిడి, పోషకాహారలోపం సహా అనేక కారణాలు వల్లనే మీ కనుబొమ్మలమీద జుట్టు రాలిపోయి సన్నగా మారుతున్నాయి. అలాగే వీటి ఫలితంగా అలోపీషియా అరేటా (alopecia areata) లేదా, స్పాట్ బాల్డనెస్ (spot baldness) వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే 0.1% (శాతం) జనాభాకి మాత్రమే దీని ప్రభావం ఉంది.

కళ్ళు మంటలు, వాపు తగ్గించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!కళ్ళు మంటలు, వాపు తగ్గించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

ఈ కనుబొమ్మల ప్రాంతంలో జుట్టు రాలిపోవడానికి మరో కారణం అయితే థైరాయిడ్ వ్యాధి ఉంది. ఈ హైపోథైరాయిడిజం వల్ల శరీరవేగం మందగించడానికి కారణమవుతుంది. ఇది వివిధ హార్మోన్ల లోపానికి దారి తీయ్యడం వల్ల మొత్తం జుట్టు నష్టపోడానికి దారితీస్తుంది. మీ కనుబొమ్మలు సన్నబడటం వంటి సమస్యను ఎదుర్కొంటుంటే, అది థైరాయిడ్ సమస్యలు తోసిపుచ్చి మీ డాక్టర్ తో ఒకసారి చర్చించండి.

3. చూపు మసకబారడం :

3. చూపు మసకబారడం :

ఈ రోజుల్లో చాలా ఉద్యోగాలు కంప్యూటర్లు మీద లెక్కలేనన్ని గంటలుగా పనిచేయ్యాల్సి వస్తోంది.

అలా లెక్కలేనన్ని పనిగంటలు కంప్యూటర్ మీద చెయ్యడం వల్ల కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి ప్రభావానికి కళ్లు బర్న్ అవ్వడం లేదా, మసకబారడం జరుగుతోంది. ఈ డిజిటలైజేషన్ కొన్ని ప్రాంతాలలో చాలా ముందుకు పోవడం వలన, దాని ప్రభావం ఎక్కువ ఉండటం అనేది మా దృష్టికి వచ్చినప్పుడు, దాని వల్ల మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువ ఉందని తెలిపారు.

4. బ్లైండ్ స్పాట్ :

4. బ్లైండ్ స్పాట్ :

మీకు ఎప్పుడైనా మీ చూపులో ఒక చిన్న గుడ్డితనం లాంటి అనుభవం ఉంటే, అది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ పరిస్థితి మీకు మెరిసే కాంతివంతమైన లైట్లు, అలాగే తరంగాల వంటి లైట్లను చూడటం వల్ల మీకు పార్శ్వపు (మైగ్రేన్) నొప్పి కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బ్లైండ్ స్పాట్స్, అలాంటి లైట్లను చూడటం వల్ల తీవ్ర బాధాకరమైన తలనొప్పి కూడా మిమ్మల్ని వెంటాడుతుంది.

5. వాచిన కళ్ళు :

5. వాచిన కళ్ళు :

మన కళ్లు మనతో ట్రిక్స్ చేసినటువంటి అనుభవాన్ని మనందరం కలిగి ఉన్నాము. మీ కళ్లు మీకు సరిగా కనిపించకపోతే కళ్ళను బ్లింక్ చేయ్యడం, రుద్దటం వంటివి చేస్తాము. అలాంటప్పుడు మీ కళ్ళు ఉబ్బిన్నట్లుగా అయితే గనుక థైరాయిడ్ కు సంబంధించినదై ఉండవచ్చు.

6. పసుపు రంగులో ఉన్నట్లయితే (కామెర్లు) :

6. పసుపు రంగులో ఉన్నట్లయితే (కామెర్లు) :

ఇది గమనించతగినది, మీరు దీనిని గూర్చి అనుభవం చెందితే అదేమిటో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి హానికరమైన పరిస్థితులు కొన్ని సార్లు తొందరగా గాని, లేదా అప్పటికప్పుడు గాని కనపడతాయి.

వందేళ్ళ కంటి చూపుకోసం తినండి విటమిన్ రిచ్ ఫుడ్స్ వందేళ్ళ కంటి చూపుకోసం తినండి విటమిన్ రిచ్ ఫుడ్స్

మీ కళ్లు పసుపు రంగులోకి మారడాన్నే, కామెర్లు (జాండీస్) అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా పుట్టిన పిల్లల్లో కాలేయం సరిగా అభివృద్ధి చెందకపోతే అలాంటప్పుడు, మరికొన్ని సార్లు కాలేయ సమస్యలతో బాధపడుతున్న పెద్దలకు కూడా ఇది వస్తుంది. అలాగే ఇది మీ పిత్తాశయం లేదా పిత్త వాహిక సంబంధించినప్పుడు కూడా ఇది వస్తుంది.

మీ కళ్ళు పసుపు రంగులో ఉంటే దాని గూర్చి తెలుసుకోవడం కోసం, ఆలస్యం చెయ్యకుండా వెంటనే మీ డాక్టర్ తో మాట్లాడండి.

7. అస్పష్టమైన చూపు (డయాబెటిస్ వల్ల) :

7. అస్పష్టమైన చూపు (డయాబెటిస్ వల్ల) :

మీకు మధుమేహం (డయాబెటిస్) అని నిర్ధారణ అయినప్పుడు, దానికి సంబంధించిన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మధుమేహం వల్ల కంటి సమస్యలు, డయాబెటిక్ రెటినోపతీ అనే ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

డయాబెటిక్ రెటినోపతీ వలన మీ కన్ను (రెటీనా) వెనుక ఉన్న కంటి కణజాలం లో ఉన్న అతి సున్నితమైన రక్తనాళాలకు నష్టం చేకూర్చేదిగా ఉంటుంది. ఇది మీ కంటిలో రక్త నాళాలు ప్రభావితం చేయ్యడం వలన కంటి చూపును కోల్పోతారు, అమెరికన్లకు ఇదే ప్రాథమిక కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితిని మీరు తేలికగా తీసుకోవద్దు. కాబట్టి మీకు డయాబెటిస్ ఉండి, మీ చూపు అస్పష్టంగా ఉన్నట్లయితే వెంటనే మీ డాక్టర్ తో మాట్లాడండి.

8. రెండుగా కనిపించడం, చూపు సరిగ్గా లేకపోవడం లేదా చూపు కనపడక పోవడం :

8. రెండుగా కనిపించడం, చూపు సరిగ్గా లేకపోవడం లేదా చూపు కనపడక పోవడం :

మీ చూపులో మార్పులు వచ్చినప్పుడు అది మీకొక హెచ్చరికలాంటిది. మనకి కళ్లు చాలా ముఖ్యమైనవి. కాబట్టి హఠాత్తుగా "రెండుగా కనిపించడం, చూపు సరిగ్గా లేకపోవడం లేదా చూపు కనపడక పోవడం" గమనించిన వెంటనే మీరు తప్పక డాక్టర్ కలవాలి. ఒకేసారి పైవన్ని కలిసి మీకు ఎదురైనప్పుడు త్వరగా ఒక మంచి

ఒక ఆరోగ్య సంరక్షణ వెంటనే హెల్ కేర్ ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ లక్షణాలన్ని కూడ గుండెపోటు కి సంకేతాలు కావచ్చు.

English summary

Eight Things Your Eyes Are Trying To Tell You About Your Health

Eight Things Your Eyes Are Trying To Tell You About Your Health,It’s commonly claimed that “Your eyes are the window to your soul”. While there is some debate about who originally said this and why, there is no doubting the fact that your eyes really can reveal a lot about you, specifically your present state of health.
Desktop Bottom Promotion